బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..
బంగారం ధరల ర్యాలీ ఆగడం లేదు. పశ్చిమాసియాలో నెలకొన్న యుధ్ద మేఘాలు బంగారం ధరలను కమ్మేస్తున్నాయి. పసిడి ప్రియులు ఈ పెరుగుదల చూసి లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. మూడు దేశాల మధ్య కొనసాగుతున్న వార్ ప్రపంచ దేశాలు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రధానంగా బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.
పెరుగుతున్న బంగారం ధరలు ఓ వైపు.. ముంచుకొస్తున్న చమురు సంక్షోభం మరో వైపు.. వెరసి ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనలో పడేస్తున్నాయి. బుతియన్ ధరలు అయితే భారీగా పెరుగుతాయనే అంచనాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. 2026లో Gold ధరల ర్యాలీ ఎంతవరకు సాగుతుందనే దానిపై పలువురు ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.
నివేదిక ప్రకారం బంగారం ప్రస్తుతం సైడ్‌వే-టు-బుల్లిష్ ధోరణిని చూపుతోంది. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్, ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర తెలిపిన వివరాల ప్రకారం బంగారం రూ. 1.70 లక్షల మార్కును చేరవచ్చని అంచనా వేస్తున్నారు. MCX వీక్లీ చార్టు ప్రకారం.. Gold ఇటీవలి గరిష్ట స్థాయిల నుండి తగ్గి, వరుసగా మూడవ వారం స్థిర శ్రేణికి తిరిగి వచ్చింది. ఈ పరిధిలో ధర రూ. 158,000మద్దతు స్థాయికి పైగా ఉన్నంత వరకు.. విస్తృత బుల్లిష్ ధోరణి చెక్కుచెదరకుండా కొనసాగుతుందని తర్వాత పైకెళ్ళే అవకాశాలను సూచిస్తోందన్నారు.

వారపు సమయ వ్యవధిలో మెటల్ బ్రేక్‌అవుట్ జోన్ దగ్గర దృఢమైన స్థావరాన్ని నిర్మించుకుంది, దీనికి పెరుగుతున్న ట్రెండ్‌లైన్ బలమైన మద్దతును ఇస్తుంది. ఏదైనా తక్కువ ముగింపు అయితే, అది స్వల్పకాలిక దిద్దుబాటు (pullback) సృష్టించి కొత్త కొనుగోలు ఆసక్తిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం Gold CMP రూ. 162,300 వద్ద కదలికలో ఉంది, లక్ష్యం రూ. 170,000. స్టాప్‌లాస్ స్థాయి రూ.158,000 గా సిఫార్సు చేయబడింది. సానుకూల మొమెంటం మార్కెట్ సెంటిమెంట్ మద్దతుతో బంగారం రాబోయే సెషన్లలో ర్యాలీని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
MCX వెండి ధరల అంచనాను చూసినట్లయితే..వీక్లీ చార్టు ప్రకారం వెండి కూడా మద్దతు స్థాయి నుండి తిరిగి పుంజుకొని, మూడవ వారం వరుసగా ఇటీవలి స్వింగ్ కనిష్ట స్థాయి పైకి కదలికలో ఉంది. ధరలు ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నాయి. ఇది సైడ్‌వే-టు-బుల్లిష్ ధోరణి కొనసాగింపును సూచిస్తుంది. వెండి CMP రూ.270,900 వద్ద ప్రారంభమై లక్ష్యం రూ. 300,000 వరకు సాగనుంది. తక్షణ మద్దతు స్థాయి రూ. 254,000. దీని కింద ధర నిర్ణయాత్మక ముగింపులో బుల్లిష్ ట్రెండ్ బలహీనపడుతుంది.
విస్తృత ధోరణి ఇంకా సానుకూలంగా ఉంది. స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌లు కొనుగోలు అవకాశాలను ఇస్తాయి. స్థిరమైన కదలిక, సహాయక సాంకేతిక సూచికలు, బలమైన మొమెంటం వెండి ధరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. వెండి స్వింగ్ హై 300,000 రెసిస్టెన్స్ జోన్ దగ్గర తిరిగి పరీక్షకు సిద్ధంగా ఉంది. దీని ద్వారా బుల్లిష్ ట్రెండ్ మరింత స్థిరంగా కొనసాగుతుందని భావిస్తున్నారు.
బంగారం, వెండి MCX ధరలు రెండు మెటల్స్ కూడా సైడ్‌వే-టు-బుల్లిష్ ధోరణి చూపిస్తున్నాయి. బంగారం రూ. 158,000 పైగా కొనసాగుతుందంటే 1.70 లక్షల లక్ష్యానికి చేరే అవకాశముంది. వెండి రూ. 254,000 పైగా ఉంటే..రూ.300,000 రూపాయల లక్ష్యాన్ని చేరవచ్చు. సానుకూల మార్కెట్ సెంటిమెంట్, స్ట్రాంగ్ మద్దతు జోన్లు, పునరుద్ధరణ ట్రెండ్‌లైన్‌లు ఈ మెటల్స్‌పై విస్తృత బుల్లిష్ నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయి. రాబోయే సెషన్లలో అధిక లాభాల అవకాశాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications