For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊరట.. దీర్ఘకాల వాహన బీమాలు రద్దు: IRDAI అతికీలక నిర్ణయం

|

ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) అతిపెద్ద లేదా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కార్లు, బైక్స్‌కు విక్రయిస్తున్న అన్ని దీర్ఘకాల థర్డ్ పార్టీ బీమా కవరేజీలను రద్దు చేస్తున్నట్లు IRDAI మంగళవారం తెలిపింది. ఈ వాహన బీమా అమ్మకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడంలో భాగంగానే బీమా రంగ నియంత్రిత ప్రాధికార సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే వాహనదారులకు భారంగా మారిన దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బీమా పాలసీలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.

<strong>అన్-లాక్: భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు, ఎలా కోలుకుంటుంది?</strong>అన్-లాక్: భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు, ఎలా కోలుకుంటుంది?

ఎప్పటి నుండి అమల్లోకి...

ఎప్పటి నుండి అమల్లోకి...

IRDAI తీసుకున్న ఈ నిర్ణయం ఆగస్ట్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పుతో IRDAI 2018 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ దీర్ఘకాలిక వాహన బీమా పాలసీలను అమలులోకి తెచ్చింది. ఈ విధానం కింద కొత్త కారును కొనుగోలు చేస్తే మూడేళ్ల కాలానికి, టూ-వీలర్ కొనుగోలు చేస్తే అయిదేళ్ల కాలానికి తమ వాహనాలకు బీమా థర్డ్ పార్టీ, ఓన్ డ్యామేజీ పాలసీ తీసుకోవాలి. కానీ దీంతో ఖర్చులు పెరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో IRDAI ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 నుండి వాహనదారులు ఇక కొత్త వాహనం కొన్నపుడు ఏడాది కాలానికి పాలసీ తీసుకుంటే సరిపోతుంది.

కొనుగోలుదారులకు లాభం కాదనే..

కొనుగోలుదారులకు లాభం కాదనే..

కార్లకు మూడేళ్ల పాటు, టూ-వీలర్స్‌కు అయిదేళ్ల పాటు ఈ ప్యాకేజీల్లో బీమా కవరేజీ ఉంటుందన్నదని, మార్కెట్లోని ఈ ప్యాకేజీల్ని క్షుణ్ణంగా పరిశీలించాక కొనుగోలుదారులకు ఇది లాభదాయకం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు IRDAI పేర్కొంది. ఇది కొత్త వాహనాల కొనుగోలు ధరని పెంచేలా ఉన్నాయని పేర్కొంది. 2018 సెప్టెంబర్‌లో దీనిని ప్రారంభించినప్పటి నుండి సమీక్షించినట్లు తెలిపారు.

ఆ తర్వాత ఉపసంహరణ

ఆ తర్వాత ఉపసంహరణ

సుప్రీం కోర్టు ఉత్తర్వు, IRDAI ఆదేశాల నేపథ్యంలో బీమా కంపెనీలు వినియోగదారులకు దీర్ఘకాలిక ప్రాతిపదికన విక్రయించడం ప్రారంభించాయి. ఓన్ డ్యామేజ్ ధరల నియంత్రణ IRDAI చేతిలో లేకపోవడంతో వినియోగదారులు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు IRDAI ఉపసంహరించుకుంది.

ఇదిలా ఉండగా, అంతకుముందు జూన్ 6వ తేదీన లీగల్ ఎంటిటీ ఏడెంటిఫైయర్ ఇండియా లిమిటెడ్ నుండి రుణగ్రహీతలు ఎల్ఈఐ కోడ్ పొందలేకపోతే బీమా సంస్థలు లోన్ రెన్యూవల్స్ చేయవద్దని IRDAI సూచించింది. లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) కోడ్‌ను తీసుకోవాలని అంతకుముందే సూచించింది.

English summary

ఊరట.. దీర్ఘకాల వాహన బీమాలు రద్దు: IRDAI అతికీలక నిర్ణయం | Irdai withdraws long term third party motor insurance for 3, 5 years

In a major development, the Insurance Regulatory and Development Authority of India (IRDAI) has issued a notification for "Withdrawal of long term package cover offering both motor third party insurance and own damage insurance for three years of five years".
Story first published: Wednesday, June 10, 2020, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X