For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దారుణంగా పతనమైన IRCTC స్టాక్, ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?

|

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) షేర్లు రెండు రోజులుగా పతనమవుతున్నాయి. ఈ స్టాక్ బుధవారం ఉదయం పదిహేను శాతం క్షీణించి రూ.4,600 వద్ద ట్రేడ్ అయింది. మంగళవారం కూడా ఉదయం భారీగానే లాభపడినప్పటికీ క్లోజింగ్‌కు కొద్ది ముందు 15 శాతం పతనమైంది. దీంతో రూ.5,400 దిగువకు పడిపోయింది. నిన్న ప్రారంభ సెషన్‌లో ఈ స్టాక్ రూ.6,393 వద్ద ట్రేడ్ అయి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గత నెల రోజుల్లో IRCTC స్టాక్ ఆకాశాన్ని తాకేలా దూసుకెళ్లింది. వరుసగా ఈ స్టాక్ పరుగులు పెట్టడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం వేచి చూశారని చెబుతున్నారు. నిన్న, నేడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారని చెబుతున్నారు. అయితే IRCTC కంపెనీలో మెజార్టీ వాటా ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నందున మరింత పడిపోయే అవకాశాలు లేవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలా అని ప్రస్తుత డిప్‌లో కొనుగోలు చేయమని కూడా సూచించడం కాదని, మరిన్ని సెషన్స్ బలహీనంగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు. Q2FY22 ఫలితాలు ప్రకటించే వరకు ఈ స్టాక్ శ్రేణి పరిమితంగా ఉంటుందని భావిస్తున్నారు.

32 శాతం డౌన్.. అప్రమత్తత అవసరం

32 శాతం డౌన్.. అప్రమత్తత అవసరం

IRCTC స్టాక్ రికార్డ్ గరిష్టం నుండి 32 శాతం పతనమైంది. రూ.6300 దాటిన ఈ స్టాక్ బుధవారం మధ్యాగ్నం గం.1 సమయానికి రూ.4,600కు దిగువన ఉంది. అంటే 17 శాతం క్షీణించింది. నేడు ప్రతి గంట గంటకూ పతనమమవుతోంది. నేడు కనీసం రూ.5000 మార్కును కూడా అందుకోలేదు. నేడు రూ.4909 వద్ద ప్రారంభమై, రూ.4999 వద్ద గరిష్టాన్ని, రూ.4377 వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే ఆల్ టైమ్ గరిష్టంతో మూడోవంతు పడిపోయింది. కానీ గత ఆరు నెలల కాలంలో ఇదే స్టాక్ 300 శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా రోజురోజుకు పడిపోతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.6,393, 52 వారాల కనిష్టం రూ.1,291.00. స్టాక్ రూ.4700కు పడిపోతే మరింత క్షీణించి రూ.4000కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే ఇది రూ.4500కు చేరుకుంది. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రుణరహిత సంస్థ

రుణరహిత సంస్థ

IRCTC స్వచ్ఛమైన గుత్తాధిపత్య వ్యాపారంలో ఉంది. ఎందుకంటే భారతీయ రైల్వేలకు ఆన్‌లైన్ టిక్కెట్లు, క్యాటరింగ్ సేవలను అందించే ఏకైక అధీకృత సంస్థ ఇది. ఈ కంపెనీ ఆర్థిక పుష్టి కలది. రుణరహితంగా కూడా ఉండటంతో ఇన్వెస్టర్లకు మక్కువ కలిగిన స్టాక్‌గా నిలిచింది. IRCTC 2019 అక్టోబర్‌లో లిస్టింగ్ చేయబడింది. అప్పటి నుండి ఈ స్టాక్ అద్భుతమైన రాబడిని అందించింది.

IRCTC షేర్లు కౌంటర్‌లో బలహీనంగా కనిపిస్తున్నాయి. ఈ స్టాక్ రూ.6000 నుండి రూ.6100 వద్ద బలమైన అడ్డంకిని కలిగి ఉందని, రూ.5000 వద్ద మద్దతు ఉందని, అంతకు మించి పడిపోతే రూ.4500 వద్ద మద్దతు ఉందని మరికొంతమంది నిపుణుల మాట.

షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఓకే

షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఓకే

ప్రస్తుత భారీ డిప్ (భారీగా పతనం) సమయంలో IRCTC స్టాక్‌ను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. షార్ట్ టర్మ్‌లో త్రైమాసిక ఫలితాల వరకు కాస్త అటు ఇటుగా ఉండవచ్చునని, కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న రూ.1 లక్ష కోట్ల మార్కును తాకింది. అయితే ఆ తర్వాత భారీగా నష్టపోయింది. IRCTC స్టాక్ గత ఏడాది కాలంలో 364 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత దసరా నుండి మల్టీ బ్యాగర్లుగా మారిన స్టాక్స్‌లో IRCTC ఒకటి. నిన్నటి నుండి నష్టపోతున్నప్పటికీ, అంతకుముందు చూస్తే IRCTC గత ఐదు సెషన్‌లలో 30 శాతం, గత నెల రోజులలో 70 శాతం ఎగిసిపడింది. ఆరు నెలల కాలంలో దాదాపు 300 శాతం ఎగిసింది. ఏడాది కాలంలో 360 శాతం లాభపడింది.

English summary

దారుణంగా పతనమైన IRCTC స్టాక్, ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? | IRCTC shares continue to fall, plunge 15 percent: Should you buy?

IRCTC shares continued to decline as the stock slipped over 15% to ₹4,610 apiece in Wednesday's early trading session deals.
Story first published: Wednesday, October 20, 2021, 13:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X