For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IDBI బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ కొత్త వడ్డీ రేటు ఇదే, వివిధ బ్యాంకుల్లో ఎంతంటే?

|

IDBI బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను సవరించింది. డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGC) ద్వారా రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సురెన్స్ హామీ ఉంటుంది. హామీతో కూడిన మెరుగైన వడ్డీ రేటు కావాలనుకునే వారికి ఐడీబీఐ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ప్రయోజనం కల్పిస్తుంది.

వివిధ రకాల కస్టమర్లు, వారి అవసరాలు తీర్చేందుకు ఐడీబీఐ బ్యాంకు సూపర్ సేవింగ్స్ ఖాతా, సూపర్ సేవింగ్స్ ప్లస్ ఖాతా, సూపర్ శక్తి మహిళా ఖాతా, జూబ్లీ ప్లస్ సీనియర్ సిటిజన్ ఖాతా, బీయింగ్ మై అకౌంట్, పవర్ కిడ్స్ అకౌంట్, సేవింగ్స్ యూజింగ్ వీడియో కేవైసీ, స్మాల్ అకౌంట్ రిలాక్స్‌డ్ కేవైసీ, సబ్‌కా బేసిక్స్ సేవింగ్స్ అకౌంట్, పెన్షన్ సేవింగ్స్ అకౌంట్, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీం అందిస్తోంది. బ్యాంకు ఇటీవల తన సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను అప్ డేట్ చేసింది. ఇందుకు సంబంధించి కింద వివరాలు ఉన్నాయి.

సేవింగ్స్ అకౌంట్ ఇంటరెస్ట్ రేట్

సేవింగ్స్ అకౌంట్ ఇంటరెస్ట్ రేట్

ఐడీబీఐ బ్యాంకు తన సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును అక్టోబర్ 25, 2021న అప్ డేట్ చేసింది. ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డెయిలీ బ్యాలెన్స్ పైన 3 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. రూ.5 కోట్ల నుండి రూ.100 కోట్ల డెయిలీ బ్యాలెన్స్ పైన 3.25 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. రూ.100 కోట్లకు పైన బ్యాలెన్స్ పైన 3.35 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇటీవల సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- రూ.5 కోట్ల వరకు సేవింగ్స్ బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 3 శాతం.

- రూ.5 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 3.25 శాతం.

- రూ.100 కోట్ల నుండి ఆ పైన బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 3.35 శాతం.

ఐఢీబీఐ బ్యాంకుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1890 బ్రాంచీలు ఉన్నాయి. 3300కు పైగా ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. మార్చి 31, 2021 నాటికి బ్యాలెన్స్ షీట్ సైజ్ రూ.2,97,764.

వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు

వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు

వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- SBI - 2.70%.

- HDFC - 3.00%,

- ICICI - 3.00%,

- Canara Bank - 2.90%,

- Punjab National Bank (PNB) - 3.00%,

- Bank Of India - 2.90%,

- Axis Bank - 3.00%,

- Kotak Mahindra Bank - 3.50%.

వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్స్

వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్స్

సేవింగ్స్ అకౌంట్స్‌లో వివిధ రకాలు ఉన్నాయి. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, శాలరీ బేస్డ్ సేవింగ్స్ అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్, మైనర్స్ సేవింగ్స్ అకంట్, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్, వుమెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్.. కరెంట్ ఖాతా కంటే తక్కువగా ఉంటుంది. మీ సేవింగ్స్ అకౌంట్ ద్వారా మీ క్రెడిట్ కార్డు బిల్స్ పే చేయవచ్చు. ఫండ్స్ ట్రాన్సుఫర్ చేయవచ్చు.

English summary

IDBI బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ కొత్త వడ్డీ రేటు ఇదే, వివిధ బ్యాంకుల్లో ఎంతంటే? | IDBI Bank Revises Interest Rates On Savings Accounts

IDBI Bank is providing a choice of savings accounts for customers who want better interest rates on their deposits combined with deposit insurance of up to Rs 5 lakhs guaranteed by the Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC).
Story first published: Friday, October 29, 2021, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X