For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసీఐసీ సహా ఈ బ్యాంకుల్లో హోంలోన్ వడ్డీరేటు పెరిగింది: ఈఎంఐ భారం ఎంతంటే?

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును నిన్న మరో 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. గత నెలలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచగా, ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4 శాతం నుండి తొలుత 4.40 శాతానికి, తాజా పెంపుతో 4.90 శాతానికి పెరిగింది. దీంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు తదితర బ్యాకులు రెపో రేటు ఆధారిత వడ్డీ రేటును పెంచాయి.

ఐసీఐసీఐ బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంకు

ప్రయివేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు(EBLR)ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన వడ్డీ రేటు జూన్ 8వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపింది. ఈబీఎల్ఆర్ రేటు 8.10 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లను పెంచింది. బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటును నేటి నుండి (గురువారం, 09 జూన్ 2022) నుండి పెంచుతున్నట్లు తెలిపింది. బీఆర్ఎల్ఎల్ఆర్‌ను 7.40 శాతానికి పెంచింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.40 శాతం నుండి 8.75 శాతం మధ్య ఉన్నాయి. వెహికిల్ లోన్ 7.90 శాతం నుండి, మోర్టగేజ్ లోన్ 9.10 శాతం నుండి ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేట్లను నేటి నుండి (గురువారం, 09 జూన్ 2022) పెంచుతున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేటు 6.90 శాతం నుండి 7.40 శాతానికి చేరుకుంది.

ఈ బ్యాంకులు కూడా...

ఈ బ్యాంకులు కూడా...

బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 7.75 శాతానికి చేరుకుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును 7.25 శాతం నుండి 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 7.75 శాతానికి చేరుకుంది.

ఈఎంఐ ఎంత పెరుగుతుంది

ఈఎంఐ ఎంత పెరుగుతుంది

ఆర్బీఐ గత ఐదు వారాల్లో రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు లేదా 0.9 శాతం పెంచింది. దీంతో బ్యాంకులు కూడా ఈ మేరకు వడ్డీ రేటును సర్దుబాటు చేసి పెంచుతాయి. ఉదాహరణకు రూ.30 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాలానికి 7 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే ఈఎంఐ ఇప్పటి వరకు రూ.23,259గా ఉండగా, రెపో రేటు పెంపు అనంతరం రూ.1648 పెరిగి రూ.24,907కు చేరుకుంటుంది. ప్రతి లక్ష రూపాయలకు రూ.55 పెరుగుతుంది. అయితే బ్యాంకును బట్టి ఈ పెరుగుదలలో మార్పు ఉంటుంది.

English summary

ఐసీఐసీ సహా ఈ బ్యాంకుల్లో హోంలోన్ వడ్డీరేటు పెరిగింది: ఈఎంఐ భారం ఎంతంటే? | ICICI, Bank of Baroda, BoI, PNB hike home loan interest rates

PNB announced that it has hiked its Repo Linked Lending Rate with effect from June 9, 2022. For existing and new clients, the RLLR has been changed from 6.90 percent to 7.40 percent.
Story first published: Thursday, June 9, 2022, 16:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X