For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్!: హోంలోన్ తీసుకుంటే రూ.50,000 ప్రయోజనం?

|

ఇల్లు కొనుగోలుదారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఓ శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయట. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రోత్సాహం దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ స్టేటస్ పొందవచ్చు. అది కూడా బడ్జెట్‌కు ముందే అని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ భారీ ఆఫర్ ముందుకు రావొచ్చునని, అది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

సగం సగం...: నెలకు రూ.2,000తో చేతికి రూ.50 లక్షలు!సగం సగం...: నెలకు రూ.2,000తో చేతికి రూ.50 లక్షలు!

రియల్ ఎస్టేట్ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్

రియల్ ఎస్టేట్ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్

ఇప్పటికే వివిధ రంగాలను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రియాల్టీ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వాలని చూస్తోందని తెలుస్తోంది. కొత్త ఏడాదిలో నిర్ణయం వెలువడే అవకాశముంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

రూ.50,000 వరకు పన్ను ప్రయోజనం

రూ.50,000 వరకు పన్ను ప్రయోజనం

ఇది వాస్తవ రూపం దాల్చితే తమ డ్రీమ్ హౌస్ కొనుగోలు చేయాలనుకునే ట్యాక్స్ చెల్లింపుదారులకు మరిన్ని ఆదాయపు పన్ను ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీరు ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ అయితే ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. పన్ను ప్రయోజనం రూ.50,000 వరకు ఉండొచ్చు.

రూ.50 వేలు లేదా 10 శాతం ఆదా

రూ.50 వేలు లేదా 10 శాతం ఆదా

మీరు హోమ్ లోన్ రూపంలో ఏడాదికి రూ.5 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తూ ఉంటే కనుక మీరు చెల్లించే పన్నులు దాదాపు రూ.50,000 లేదా 10% ఆదా అవుతుందని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ అన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి అప్లికబుల్

వచ్చే ఆర్థిక సంవత్సరానికి అప్లికబుల్

కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే కనుక ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ (2020) నుంచి మార్చి 31 2021 వరకు అప్లికబుల్ అవుతుందని తెలుస్తోంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవారు తాము తీసుకున్న లోన్ పైన తొలి మూడేళ్ల పాటు ట్యాక్స్ రిబేట్ లభించవచ్చు. ఇప్పటికే హౌసింగ్ లోన్ పైన గత బడ్జెట్‌లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ ప్రీమియం ప్రాజెక్టులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

రియల్ రంగానికి కొత్త ఉత్సాహం

రియల్ రంగానికి కొత్త ఉత్సాహం

వచ్చే ఏడాది నుంచి ఇది అమలైతే రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఉత్సాహం వస్తుంది. గత నాలుగయిదేళ్లుగా రియల్ రంగంలో ఆశించినంతగా పెరుగుదల లేదని రియాల్టర్లు భావిస్తున్నారు. కాబట్టి ఈ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని అంటున్నారు. రూ.1.8 లక్షల కోట్ల లోన్లు స్టక్ అయిపోయాయని, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే క్లియరెన్స్ లభించి ఈ రంగానికి వచ్చే ఏడాది మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు.

English summary

పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్!: హోంలోన్ తీసుకుంటే రూ.50,000 ప్రయోజనం? | Homebuyers to get income tax rebate on housing loan

For homebuyers, Real Estate sector, and housing finance companies, there is some great news in offing.
Story first published: Thursday, October 31, 2019, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X