For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 ఏళ్లు చెల్లిస్తే.. హెల్త్ ఇన్సురెన్స్‌పై కొత్త మార్గదర్శకాలు: ఇక, 'ఆరోగ్య బీమా' పోర్టబులిటీ!

|

ఎనిమిదేళ్ళు వరుసగా ప్రీమియం చెల్లిస్తే క్లెయిమ్స్‌పై సంస్థలు చేసే సవాల్ పైన ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వరుసగా ఎనిమిదేళ్లు ఆరోగ్య బీమా చెల్లిస్తే క్లెయిమ్స్ విషయంలో హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు సవాల్ చేయడానికి వీలు లేకుండా IRDAI గైడ్ లైన్స్ జారీ చేసింది.

ఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రయివేటు బ్యాంకుల్లో గణనీయ మార్పులుఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రయివేటు బ్యాంకుల్లో గణనీయ మార్పులు

2021 ఏప్రిల్ 1 తర్వాత అన్నీ ఈ పరిధిలోకి

2021 ఏప్రిల్ 1 తర్వాత అన్నీ ఈ పరిధిలోకి

నష్టపరిహారం ఆధారిత ఆరోగ్య బీమాలో పొందుపరిచిన (వ్యక్తిగత ప్రమాద మరియు డొమెస్టిక్/ఇంటర్నేషనల్ ట్రావెల్ మినహాయించి) సాధారణ నిబంధనలని ప్రామాణీకరించడమే ఈ మార్గదర్శకాల లక్ష్యమని IRDAI తెలిపింది. ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా ప్రోడక్ట్స్ ఈ మార్గదర్శకాల పరిధిలోకి రాకపోయినా అన్ని పాలసీ కాంట్రాక్టులు 2021 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత రెన్యూవల్‌కు వచ్చినప్పుడు వీటి పరిధిలోకి వస్తాయని IRDAI తెలిపింది.

ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లించాలి

ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లించాలి

పాలసీ ప్రీమియం ఎనిమిదేళ్లవ వరుసగా చెల్లించడం పూర్తయితే హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్‌ను ఆయా సంస్థలు సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పాలసీలో శాశ్వత మినహాయింపులు ఉన్నట్లు, మోసాలు జరిగినట్లు నిరూపిస్తే మాత్రమే సవాల్ చేయడానికి వీలుంటుందని తెలిపింది. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అందిన తర్వాత బీమా కంపెనీ 30 రోజుల్లో ఆ క్లెయిమ్స్‌ను అనుమతిస్తోందా, తిరస్కరిస్తోందా తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది. చెల్లింపులో ఆలస్యమైతే పాలసీదారుకు 2% వడ్డీతో చెల్లించాలని తెలిపింది.

పాలసీ మార్పుపై..

పాలసీ మార్పుపై..

ఇన్సురెన్స్ పోర్టబులిటీని అందుబాటులోకి తేనున్నట్లు IRDAI తెలిపింది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ తెలిసిందే. అలాగే ఆరోగ్య బీమా కంపెనీని మార్చుకునే వెసులుబాటును పాలసీదారుకు కల్పించనున్నారు. ఇన్సురెన్స్ తీసుకున్న వ్యక్తి, తమ కుటుంబ సభ్యులందరితో పాటు 45 రోజులలోపు పాలసీని వేరే కంపెనీకు మార్చుకోవచ్చు. పాలసీ రెన్యూవల్ తేదీకి 60 రోజుల ముందు మాత్రం లేదు. ఎవరైనా హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకొని, ప్రస్తుతం బీమా కవరేజీలో ఉండి, ఎలాంటి లోపాలు లేకుండా దానిని కొనసాగిస్తే అతనికి కొనసాగింపు ప్రయోజనాలు లభిస్తాయని IRDAI తెలిపింది.

English summary

8 ఏళ్లు చెల్లిస్తే.. హెల్త్ ఇన్సురెన్స్‌పై కొత్త మార్గదర్శకాలు: ఇక, 'ఆరోగ్య బీమా' పోర్టబులిటీ! | Health insurance claims not contestable after 8 year of premium payment

Health insurance companies will not be allowed to contest claims once the premium has been paid for a continuous period of eight years, regulator Irdai said in a fresh set of guidelines.
Story first published: Monday, June 15, 2020, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X