ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు తమ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు నిర్దేశించిన సగటు నెలసరి బ్యాలెన్స్ (AMB-యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్) లేకుంటే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. మెట్రో నగరాలు, పట్టణాలు... ఇలా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ రూల్స్ వివిధ రకాలుగా ఉన్నాయి. ఆ మేరకు బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేకుంటే ఛార్జీలు వసూలు చేస్తారు.

ఎక్కడ ఎంత మినిమం బ్యాలెన్స్ ఉండాలంటే?
మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖల్లో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఖాతాలో సగటున రూ.10,000 ఉండాలి. లేదంటే పెనాల్టీ ఉంటుంది. సెమీ అర్బన్ శాఖలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో కస్టమర్లు తమ అకౌంట్లో రూ.5,000 ఉండేలా చూసుకోవాలి. రూరల్ బ్రాంచీల్లో నెలకు రూ.2,5000 ఉండాలి.

FD కలిగినా పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు
పెనాల్టీ తప్పించుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో ఏడాదికి రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ కలిగిన వారు కూడా పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. కస్టమర్లు మినిమం బ్యాలెన్స్ రూల్స్‌ను అనుసరించకపోతే బ్యాంకు వారి వద్ద నుంచి పెనాల్టీ రూపంలో రూ.150 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తుంది.

మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో పెనాల్టీ ఇలా...
- మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500 నుంచి రూ.10,000 లోపు అమౌంట్ ఉంటే రూ.150 పెనాల్టీ ఉంటుంది.
- మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000 నుంచి రూ.7,500 లోపు అమౌంట్ ఉంటే రూ.300 పెనాల్టీ ఉంటుంది.
- మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.5,000 లోపు అమౌంట్ ఉంటే రూ.450 పెనాల్టీ ఉంటుంది.
- మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.0 నుంచి రూ.2,500 లోపు అమౌంట్ ఉంటే రూ.600 పెనాల్టీ ఉంటుంది.

సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పెనాల్టీ ఇలా...
- సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.5,000 లోపు అమౌంట్ ఉంటే రూ.150 పెనాల్టీ ఉంటుంది.
- మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.0 నుంచి రూ.2,500 లోపు అమౌంట్ ఉంటే రూ.300 పెనాల్టీ ఉంటుంది.
- రూరల్ ప్రాంతాల్లో రూ.1,000 నుంచి రూ.2,500 లోపు అమౌంట్ మాత్రమే ఉంటే రూ.270 పెనాల్టీ ఉంటుంది.
- రూరల్ ప్రాంతాల్లో రూ.1,000 లోపు అమౌంట్ ఉంటే రూ.450 పెనాల్టీ ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications