For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rate Today: రూ.1000 తగ్గిన బంగారం ధర, వెండి రూ.3000 డౌన్

|

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గతవారం భారీగా పెరిగి రూ.49,000కు చేరువైన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.48,000 దిగువకు పడిపోయింది. మూడు రోజుల క్రితం రూ.48,800కు పైన పలికిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,900 దిగువకు పడిపోయింది. ఈ మూడు సెషన్‌లలో బంగారం రూ.1000 వరకు తగ్గింది. వెండి కూడా భారీగానే తగ్గింది. రూ.65,000కు పైన ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.62,000 దిగువకు వచ్చింది. ఈ కాలంలో రూ.3000కు పైగా తగ్గింది.

50 డాలర్లు తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్

50 డాలర్లు తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్

గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి నేడు (జనవరి 28, శుక్రవారం) ప్రారంభ సెషన్‌‌లో రూ.49 క్షీణించి రూ.47,861 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.31 తగ్గి రూ.47,951 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లోను పసిడి ధరలు 1800 డాలర్ల దిగువకు వచ్చాయి. ఓ సమయంలో 1850 డాలర్లు తాకిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ కాలంలో 50 డాలర్ల మేర తగ్గాయి.

నేటి సెషన్‌లో కాస్త పెరిగినప్పటికీ ఈ మార్కు దిగువనే ఉన్నాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.90 డాలర్లు ఎగిసి 1796 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌‌లో 1793 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 3.36 శాతం తగ్గింది.

సిల్వర్ ఫ్యూచర్ ధర ఎంతంటే

సిల్వర్ ఫ్యూచర్ ధర ఎంతంటే

సిల్వర్ ఫ్యూచర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.21 పెరిగి రూ.61,965 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.32 క్షీణించి రూ.62,744 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 0.079 డాలర్లు పెరిగి 22.755 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 22.676 వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 11 శాతం క్షీణించింది.

మద్దతు ధర, నిరోధకస్థాయి

మద్దతు ధర, నిరోధకస్థాయి

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,700-47,550, నిరోధకస్థాయి రూ.48,100-48,330, వెండి మద్దతు ధర రూ.61,600-61,200, నిరోధకస్థాయి రూ.62,300-62,700. వెండిని రూ.61500 టార్గెట్ ధరతో రూ.61,200 స్టాప్ లాస్‌తో రూ.61,600 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్లు సూచిస్తున్నారు.

English summary

Gold Rate Today: రూ.1000 తగ్గిన బంగారం ధర, వెండి రూ.3000 డౌన్ | Gold Rate Today: Gold Prices see a sharp fall on January 28, 2022

The gold rate today fell by a whopping Rs 4,000 per kg across the country. In India, the gold rate today was Rs 45,500 per 10 grams of 22-carat gold.
Story first published: Friday, January 28, 2022, 11:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X