For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.600 క్షీణించి రూ.48,300 స్థాయికి

|

మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు కుప్పకూలాయి! నేడు (జనవరి 27, గురువారం) ప్రారంభ సెషన్‌లో ఉదయం గం.10.00 సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.600కు పైగా క్షీణించి రూ.48,250 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోను వరుసగా రెండు సెషన్‌లలో పసిడి దారుణంగా పతనమైంది. 1850 డాలర్ల వద్ద ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఏకంగా 1815 డాలర్ల దిగువకు వచ్చింది. అంటే ఈ వారం ఇప్పటి వరకు ఏ స్థాయిలో పెరిగిందో, దాదాపు అదే స్థాయిలో వెనక్కి వచ్చింది.

గోల్డ్ ఫ్యూచర్స్ ధర

గోల్డ్ ఫ్యూచర్స్ ధర

ఈ వార్త రాసే సమయానికి ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.554 క్షీణించి రూ.48,297 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.575 తగ్గి రూ.48,393 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 15.05 డాలర్లు క్షీణించి 1814.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1829.70 డాలర్ల వద్ద ముగిసింది.

అంతకుముందు ఓ సమయంలో 1850 డాలర్లను తాకింది. కానీ ఈ రెండు సెషన్‌‍లలో 30 డాలర్లకు పైగా పడిపోయింది. ఏడాదిలో 2.65 శాతం తగ్గింది.

ఇటీవలే రూ.2000కు పైగా తగ్గిన సిల్వర్

ఇటీవలే రూ.2000కు పైగా తగ్గిన సిల్వర్

ఈ వారం వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. గతవారం ఓ సమయంలో రూ.65,000 పైకి చేరుకున్న సిల్వర్ ఫ్యూచర్స్ నేటి వరకు రూ.2000కు పైగా తగ్గాయి. నేటి సెషన్లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.784 తగ్గి రూ.63,287 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.729 తగ్గి రూ.63,963 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.455 డాలర్లు క్షీణించి 23.352 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఫెడ్ వడ్డీ రేటు కీలకం

ఫెడ్ వడ్డీ రేటు కీలకం

అమెరికా ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం పసిడి మార్కెట్ పైన ప్రభావం చూపుతుంది. 2022లో ఫెడ్ మూడు పర్యాయాలు వడ్డీ రేట్లను పెంచనుంది. ఇందులో భాగంగా రేపో మాపో తొలి దఫా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇటీవలే రెండు నెలల గరిష్టానికి చేరుకున్న పసిడి ఫ్యూచర్ ఇప్పుడు ఇటీవలి కనిష్టానికి పడిపోయింది. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని, రూ.47,000 దిగువకు కూడా చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తే మాత్రం రూ.50,000 అందుకోవచ్చునని చెబుతున్నారు.

English summary

భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.600 క్షీణించి రూ.48,300 స్థాయికి | Gold Prices See A Massive Dip On January 26, 2022

For 10 grams of 22-carat of the metal, Gold price in Mumbai is Rs 47,750 and Gold Price in Chennai is Rs 46,050. In Kerala, Gold rate today is Rs 45,750.
Story first published: Thursday, January 27, 2022, 10:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X