For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గతవారంలో బంగారం ధరలు ఎంత పెరిగాయంటే, మరింత పైకి చేరుకుంటాయా?

|

బంగారం ధరలు గతవారం రూ.48,000 క్రాస్ చేశాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.48,000 దిగువన ప్రారంభమై, వారాన్ని మాత్రం రూ.48,000 పైన ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1820 డాలర్ల దిగువన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్ 1836 డాలర్ల వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో వారం మొత్తంలో పసిడి రూ.400 వరకు పెరిగింది. కామెక్స్‌లో 20 డాలర్ల వరకు ఎగిసింది. చివరి సెషన్‌లో పసిడి కాస్త తగ్గింది. అంతకుముందు రెండు సెషన్‌లలో మాత్రం ఎగిసిపడింది. 1850 డాలర్ల దిశగా పరుగు పెట్టిన బంగారం ధరకు చివరి సెషన్‌లో బ్రేక్ పడింది.

క్రితం సెషన్లో...

క్రితం సెషన్లో...

ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.144 తగ్గి రూ.48,236 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.175 తగ్గి రూ.48,281 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో చివరి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ 6.70 డాలర్లు క్షీణించి 1835.90 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్లో 1842.60 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్లో 1,828.55 - 1,843.60 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 1.83 శాతం తగ్గింది. 52 వారాల గరిష్టం 1922.80 డాలర్లు, కనిష్టం 1680 డాలర్లు.

సిల్వర్ ఫ్యూచర్స్

సిల్వర్ ఫ్యూచర్స్

అలాగే, క్రితం వారం రూ.65,000 దాటిన సిల్వర్ ఫ్యూచర్స్ ఆ తర్వాత కాస్త క్షీణించి ఈ మార్కు దిగువకు వచ్చింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.559 తగ్గి రూ.64,820 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.515 తగ్గి రూ.65,450 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో 0.361 డాలర్లు క్షీణించి 24.355 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

కొనుగోలు చేయవచ్చా?

కొనుగోలు చేయవచ్చా?

బంగారం ధరలు స్వల్పకాలంలో ఎంసీఎక్స్‌లో రూ.48,650కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, వచ్చే ఒకటి రెండు నెలల్లో రూ.49,200ను కూడా తాకవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుత డిప్ సమయంలో షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ కోసం కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.

హైదరాబాద్, విశాఖల్లో ధరలు

హైదరాబాద్, విశాఖల్లో ధరలు

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ.45,500, బెంగళూరులో రూ.45,500, విశాఖపట్నంలో రూ.45,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో రూ.49,640 వద్ద ఉంది. వెండి ధర రూ.69,000గా ఉంది.

English summary

గతవారంలో బంగారం ధరలు ఎంత పెరిగాయంటే, మరింత పైకి చేరుకుంటాయా? | Gold price gives breakout in spot market. Good opportunity to buy

The yellow metal price in the spot market has given fresh breakout at $1835 per ounce levels on closing basis as spot gold price on Friday closed at $1839 levels.
Story first published: Sunday, January 23, 2022, 11:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X