For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు

|

పన్ను వివాదాల పరిష్కారం కోసం తీసుకు వచ్చిన వివాద్ సే విశ్వాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు ఉన్న ఈ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. అలాగే ఈ వివాద పరిష్కార పథకం కింద చెల్లింపులు చేసే తేదీని కూడా ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు. ఈ మేరకు CBDT శుక్రవారం ప్రకటించింది. దీని ప్రకారం ఈ పథకం కింద స్వచ్ఛంద ప్రకటన చేయడానికి గడువును మార్చి 31 వరకు, అపరాధ రుసుము లేకుండా చెల్లింపులు చేసే గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.

వివిధ అప్పిలేట్ ఫోరమ్స్ వద్ద ప్రస్తుతం 5,10,491 కేసులు పెండింగులో ఉండగా, ఇందులో 24.5 శాతం 1,25,144 కేసుల్లో వివాద్ సే విశ్వాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో దాదాపు రూ.97 వేల కోట్లు విలువ చేసే వివాదాలకు ఈ పథకం కింద పరిష్కారం లభిస్తుంది.

Deadline for filing declaration under Vivad Se Vishwas scheme extended till March 31

వివిధ అప్పిలేట్ ఫోరమ్స్‌లో ఉన్న ప్రత్యక్షపన్ను వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. నోటీసు జారీ అయి, విచారణ ప్రారంభం కాని సంస్థలు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చునని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

English summary

మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు | Deadline for filing declaration under 'Vivad Se Vishwas' scheme extended till March 31

The Income Tax Department on Friday extended the deadline for filing declarations and making payment under direct tax dispute resolution scheme Vivad Se Vishwas (VsV) till March 31 and April 30.
Story first published: Saturday, February 27, 2021, 13:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X