For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

new income tax return forms: కొత్త ఐటీ ఫామ్స్ విడుదల, ఇక్కడ అందుబాటులో..

|

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ (ITR)ను నోటిఫై చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1న వెల్లడించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్న్స్ మరింత సులభతరం చేయడానికి వీటిని తీసుకు వచ్చామని, గత ఏడాదితో పోలిస్తే ఐటీఆర్ ఫామ్స్‌లో ఈసారి గణనీయమైన చేయడం లేదని CBDT తెలిపింది. కేవలం అవసరమైన కనీస మార్పులు చేసినట్లు పేర్కొంది. ఇందుకు ఆదాయ పన్ను చట్టం, 1961లో సవరణ చేసింది.

Alert: ఈరోజు నుండి ఇవి చెల్లవు.. మార్పులు ఇవే! ఐటీ రిటర్న్స్ షాక్, వీటిపై ఊరటAlert: ఈరోజు నుండి ఇవి చెల్లవు.. మార్పులు ఇవే! ఐటీ రిటర్న్స్ షాక్, వీటిపై ఊరట

పెద్ద మార్పులు లేవు

పెద్ద మార్పులు లేవు

కొత్త ఐటీ ఫామ్స్‌ను నోటిఫై చేసినప్పటికీ, ప్రస్తుత కొవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం గత ఏడాది ఐటీ ఫారంలలో చెప్పుకోదగ్గ పెద్ద మార్పులేవీ చేయలేదు. ఫారంలో తొలుత కొత్త ఐటీ ఫారం ఫైల్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న వస్తుందని తెలిపింది. ఐటీఆర్ 1లో పన్ను అసెసీలు త్రైమాసికానికి తాము అందుకున్న డివిడెండును పేర్కొనవలసి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉండే చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్) ఉపయోగపడతాయి.

2

ఐటీఆర్ ఫామ్ 1(సహజ్), ఐటీఆర్ ఫామ్ (సుగమ్)ను ఎక్కువమంది ట్యాక్స్ పేయర్స్ ఫైల్ చేస్తారు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగినవారు, శాలరీ నుండి, హౌస్ ప్రాపర్టీ నుండి, వడ్డీ రేట్ల నుండి పొందే ఇండివిడ్యువల్స్ సహజ్ ఫైల్ చేస్తారు. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్(HUFs), లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్ కంపెనీలు కానీ సంస్థలు, ఇండివిడ్యువల్స్ సుగమ్‌ను ఫైల్ చేస్తారు. బిజినెస్ లేదా ప్రొఫెషన్ నుండి ఆదాయం లేని ఇండివిడ్యువల్స్, HUFs కూడా ఐటీఆర్ 2ను ఫైల్ చేస్తారు. బిజినెస్ లేదా ప్రొఫెషన్ నుండి ఆదాయం వచ్చే వారు ఐటీఆర్ ఫామ్ 3ని ఫైల్ చేస్తారు.

ఇక్కడ చూసుకోవచ్చు

ఇక్కడ చూసుకోవచ్చు

నోటిఫై చేసిన ఐటీఆర్ ఫామ్స్ website of e-gazette లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్‌కు గాను జనవరి 10వ తేదీతో గడువు ముగిసింది. అంతకుముందు అసెస్‌మెంట్ ఏడాదితో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ ఫైల్ అయినట్లు తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరం(FY21)లో 2.38 కోట్లకు పైగా ట్యాక్స్ పేయర్స్‌కు రూ.2.62 లక్షల కోట్ల పన్ను రిఫండ్స్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది.

English summary

new income tax return forms: కొత్త ఐటీ ఫామ్స్ విడుదల, ఇక్కడ అందుబాటులో.. | CBDT notifies new income tax return forms for AY 2021-22

The Central Board of Direct Taxes (CBDT) has notified new income tax return forms (ITR forms) for the assessment year 2021-22, said an official release issued by the Ministry of Finance on April 1.
Story first published: Friday, April 2, 2021, 13:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X