For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అదిరిపోయే ఆఫర్లు

|

ప్రభుత్వరంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(BoM) తమ కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది. వడ్డీ రేట్లలో కన్సెషన్, రిటైల్ రుణాల పైన 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 'రిటైల్ బొనాంజా మాన్సూన్ ధమాకా' ఈ ఆపర్ అందిస్తోంది. బంగారు రుణాలు, హోమ్ లోన్, కారు రుణాలపై పండుగ బొనాంజా సందర్భంగా ప్రాసిసెంగ్ ఫీజును మాఫీ చేసింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ బ్యాంకు హౌసింగ్, కారు రుణాల పైన ఇచ్చే వడ్డీ రేటు వరుసగా 6.90 శాతం, 7.30 శాతం నుండి ప్రారంభమవుతుంది. హోమ్ లోన్ తీసుకుంటే రెగ్యులర్ పేమెంట్స్ పైన రెండు ఉచిత ఈఎంఐల ప్రయోజనాలు ఉన్నాయి. కారు, హోమ్ లోన్ పైన 90 శాతం వరకు రుణ సదుపాయం ఉంది. ఉచిత పేమెంట్, ప్రీ-క్లోజర్, పార్ట్ పేమెంట్ ఛార్జీలు వంటివి లేవు.

BoM waives loan processing fees under special offer

ఈ ప్రత్యేక ఆఫర్లపై BoM ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ తమ్టా మాట్లాడుతూ... బంగారం, హౌసింగ్, కారు రుణాలపై తమ కస్టమర్లకు ఆకర్షణీయ బహుమతితో ముందుకు వచ్చామని, వారికి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇస్తున్నామన్నారు. ఈ బ్యాంకు తన గోల్డ్ లోన్ పథకాన్ని కూడా పునరుద్ధరించింది. రూ.20 లక్షల వరకు రుణంపై 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రూ.1 లక్ష వరకు జీరో ప్రాసెసింగ్ ఫీజు ఇస్తున్నట్లు తెలిపింది.

Read more about: loan రుణం
English summary

కస్టమర్లకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అదిరిపోయే ఆఫర్లు | BoM waives loan processing fees under special offer

BoM has announced a slew of offers, including concessional interest rates and a 100 percent waiver on processing fees on retail loans.
Story first published: Saturday, August 21, 2021, 22:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X