న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రయివేటు రంగ దిగ్గజం HDFCలతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ బ్యాంకులు 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను తగ్గించలేదు. యథాతథంగా ఉంచింది. కానీ వివిధ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు-MCLRను తగ్గించాయి. ఏ బ్యాంకు ఎంత తగ్గించిందంటే..

SBI
SBI వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ పైన దీనిని తగ్గించింది. ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఈ ఏడాదిలో ఇది ఎనిమిదోసారి. ఈ తగ్గింపు ద్వారా రుణభారం మరింత తగ్గనుంది.

BOB
బ్యాంక్ ఆఫ్ బరోడా నిధులపై వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. వివిధ కాలపరిమితులపై 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20 శాతం వరకు తగ్గించింది. ఈ రేట్లు గురువారం (12 డిసెంబర్ 2019) నుంచి అమలులోకి వస్తాయి. ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేట్లను 0.05 శాతం తగ్గించి 8.25 శాతంగా, ఒక రోజు నుంచి నెల రుణాలపై 0.20 శాతం తగ్గించి 7.65 శాతం, మూడు నెలలు ఆరు నెలల కాల పరిమితిపై వరుసగా 7.80 శాతం, 8.10 శాతానికి తగ్గించింది.

UBI
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అన్ని కాలపరిమితులపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలపరిమితిపై 8.25 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గించింది. ఇవి బుధవారం (డిసెంబర్ 11) నుంచి అమలులోకి వస్తాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.75 శాతం, నెల రోజుల కాలపరిమితి 7.80 శాతం, మూడు నెలల కాలపరిమితి 7.95 శాతం, ఆరు నెలల కాలపరిమితి 8.05 శాతం, ఏడాది కాలపరిమితి 8.20 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్‌ను 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.

HDFC
HDFC వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాల పరిమితిపై వడ్డీ రేటును 8.30 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. అలాగే, రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితిపై 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఓవర్ నైట్ 7.95 శాతం నుంచి 7.8 శాతానికి, నెల రోజుల కాలపరిమితిపై 8 శాతం నుంచి 7.85 శాతానికి, 3 నెలల కాలపరిమితిపై 8.05 శాతం నుంచి 8 శాతం నుంచి, 6 నెలల కాలపరిమితిపై 8.1 శాతం నుంచి 8 శాతానికి, ఏడాది కాలపరిమితిపై 8.30 శాతం నుంచి 8.15 శాతానికి, రెండేళ్ల కాలపరిమితిపై 8.4 శాతం నుంచి 8.25 శాతానికి, మూడేళ్ల కాలపరిమితిపై 8.5 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. HDFC బేస్ రేట్ 9.2 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గించింది.

ఆయా బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు...
SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....
- SBI హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.15% - 8.80% p.a.
- HDFC హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.25% - 9.60% p.a.
- ICICI Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.60% - 9.40% p.a.
- Axis Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.55% - 9.40% p.a.
- PNB Housing Finance హోమ్ లోన్ వడ్డీ రేటు: 7.95% - 8.70% p.a.
- Karnataka Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.65% - 10.25% p.a.
- United Bank of India హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.00%- 8.15% p.a.
- Vijaya Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.10% - 9.10% p.a.
- UCO Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.40% to 8.65% p.a.
- Citi Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.05% - 9.60% p.a.
- HSBC Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.55% - 8.65% p.a.
- Canara Bank హోమ్ లోన్ వడ్డీ రేటు: 8.05% - 10.05% p.a.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications