For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తున్నారా? ఇది గుర్తుంచుకోండి... ఇక పన్ను, జీఎస్టీ విధింపు!

|

బిట్‌కాయిన్‌తో పాటు ఏదేని క్రిప్టోకరెన్సీపై ఆర్జించే లాభాలు, ట్రేడింగ్ పైన ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయి. బిట్‌కాయిన్స్‌ను ఆర్థిక సేవల కింద వర్గీకరించి, వీటిపై 18 శాతం జీఎస్టీ విధించవచ్చునని, బిట్‌కాయిన్ ద్వారా ఆర్జించే లాభాలపై వ్యక్తిగత ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పైన నిషేధాన్ని 2020 మార్చిలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ, ట్యాక్స్ విధించే అవకాశాలు ఉన్నాయి.

అదరగొడుతున్న క్రిప్టో, రూ.37 లక్షలు దాటిన బిట్ కాయిన్ వ్యాల్యూఅదరగొడుతున్న క్రిప్టో, రూ.37 లక్షలు దాటిన బిట్ కాయిన్ వ్యాల్యూ

బిట్ కాయిన్ జంప

బిట్ కాయిన్ జంప

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ జోరు కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో ఈ డిజిటల్ కరెన్సీ వ్యాల్యూ 6 శాతం పెరిగి చరిత్రలో తొలిసారి 51,000 డాలర్ల పైకి చేరుకుంది. ఓ దశలో 51,431 డాలర్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. భారత కరెన్సీ రూపాయిలో ఇది రూ.38 లక్షలను క్రాస్ చేసింది. గత రెండు నెలలుగా బిట్ కాయిన్ 25వేల డాలర్ల నుండి 50వేల డాలర్లు దాటింది.

క్రిప్టో

క్రిప్టో

బిట్ కాయిన్ రోజురోజుకు రికార్డులు సాధిస్తోంది. ఇప్పటికే 50వేల డాలర్లు దాటిన ఈ క్రిప్టోకరెన్సీ త్వరలోనే లక్ష డాలర్లకు చేరుకోవచ్చునని అంచనాలు వేస్తున్నారు. మంగళవారం 50వేల డాలర్లు దాటిన ఈ క్రిప్టో, ఇప్పుడు 51వేల డాలర్లు దాటింది. ఇది స్థిరంగా లక్ష డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. బిట్ కాయిన్ పెరుగుదలకు ఇన్వెస్టర్లు కారణం. టెస్లా, మాస్టర్ కార్డ్, పేపాల్, మైక్రోస్ట్రాటజీ వంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీలు క్రిప్టోకు అనుకూలంగా పాలసీని మార్చడంతో బిట్ కాయిన్ దూసుకెళ్తోంది.

2009లో ప్రారంభం

2009లో ప్రారంభం

బిట్ కాయిన్ ఓ డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ. 2009 జనవరిలో దీనిని తీసుకు వచ్చారు. ప్రభుత్వ కరెన్సీల మాదిరిగా దీనికి నియంతృత్వ వ్యవస్థ లేదు. భౌతిక రూపం లేని క్రిప్టో కరెన్సీ ఇది. ఇన్వెస్టర్ల ఖాతాల్లో మాత్రమే కనిపించే దీని వ్యాల్యూ ప్రస్తుతం భారతీయ కరెన్సీలో రూ.38 లక్షలకు పైగా ఉంది.

English summary

బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తున్నారా? ఇది గుర్తుంచుకోండి... ఇక పన్ను, జీఎస్టీ విధింపు! | Bitcoin trade may attract IT, GST: taxes to be paid in this fiscal year

Ahead of the cryptocurrency Bill, the government is likely to levy both income-tax (I-T) and goods and services tax (GST) on gains and trading of bitcoins or cryptocurrencies, said a senior finance ministry official privy to the development. A circular will be released soon, he added.
Story first published: Thursday, February 18, 2021, 8:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X