For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టోకరెన్సీ సిప్ చేయవచ్చా? ఆ దెబ్బతి బిట్ కాయిన్ సహా పతనం

|

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నదే. మీరు కాస్త రిస్క్ తీసుకొని కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చునని లేదా ట్రేడింగ్ చేయవచ్చునని క్రిప్టో మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం క్రిప్టోకు సంబంధించి మార్కెట్ తీవ్ర అస్థిరంగా ఉండటం మాత్రమే కాదు, నిబంధనలపరంగానూ ఎలాంటి స్పష్టత లేదు. క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండటంపై ఆర్బీఐ హెచ్చరికలు ఉన్నాయి.

అయినప్పటికీ ప్రజలు క్రిప్టోలలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి భారత్‌లో క్రిప్టో కమ్యూనిటీ భవిష్యత్తు బుల్లిష్‌గా కనిపిస్తోందని క్రిప్టో మార్కెట్ నిపుణుల మాట. అన్ని ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే, క్రిప్టోలో పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ పెట్టుబడిని వివిధ మార్గాలుగా పెట్టవచ్చు. అందులో ఒకటి సిప్(SIP). ప్రస్తుతం భారత్‌లో కొన్ని సిప్స్ ఎక్స్చేంజీలు అందిస్తున్నాయి.

సిప్‌ను ఎంచుకోవచ్చు

సిప్‌ను ఎంచుకోవచ్చు

రోజువారీ లేదా నెలవారీ ప్రాతిపదికన క్రిప్టోను కొనుగోలు చేయడం ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అతని/ఆమెకు ఇష్టమైన వ్యాలెట్‌లో లేదా హార్డ్‌వేర్ వ్యాలెట్‌లో నిల్వ చేయడం ద్వారా కూడా ఒక వ్యక్తి స్వతంత్రంగా సిప్ చేయవచ్చు. ఏదేమైనా క్రిప్టో కరెన్సీలలో సిప్స్ చేయాలా వద్దా అనే ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. అన్ని ప్రమాదాలు, అస్థిరతలను పరిగణలోకి తీసుకున్న తర్వాత చాలామంది ఆర్థిక నిపుణులు మొదటిసారి పెట్టుబడి పెట్టేవారి కోసం కోసం క్రిప్టోకరెన్సీ ద్వారా సంపదను నిర్మించేందుకు సిప్‌ను ఎంచుకోవచ్చునని చెబుతున్నారు.

నిపుణులు ఏం చెప్పారంటే

నిపుణులు ఏం చెప్పారంటే

అలయన్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ అస్తానా మాట్లాడుతూ... ఒక క్రమబద్దమైన పెట్టుబడి ప్రణాళిక(సిప్) ముఖ్య ప్రయోజనం ఏమిటంటే మార్కెట్ అస్థిరత సమయంలో సిప్ సమర్థవంతమైన వ్యూహంగా కనిపిస్తుందని, ఇంకా మార్కెట్లు సమర్థవంతంగా ఉంటే మార్కెట్ టైమింగ్ అనేది కష్టమైన అంశమని చెబుతున్నారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో సిప్‌కు ప్రాధాన్యత ఉంది. క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే సంప్రదాయ ఆస్తి తరగతుల కంటే క్రిప్టో ఆస్తులు అనేక రెట్లు ఎక్కువ అస్థిరతను కలిగి ఉంటాయని చెప్పారు. ఇది సిప్‌కు బలమైన మద్దతు ఇచ్చే అంశమని చెబుతున్నారు.

బలహీనమైన ఫ్యాక్టర్స్

బలహీనమైన ఫ్యాక్టర్స్

అయితే క్రిప్టోలో సిప్ పెట్టుబడికి బలహీన ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్స్... స్టాక్ మార్కెట్స్ అంత సమర్థవంతంగా లేవని చెబుతున్నారు. షార్ట్ హిస్టరీలో చూస్తే క్రిప్టో ఆస్తులు అన్ని ఆస్తి తరగతులలో అత్యధిక రాబడిని పొందాయని గుర్తు చేస్తున్నారు. కానీ ఇది ఎంతకాలం నిలకడగా ఉంటుందనేది కీలకం. ఇది ప్రపంచ క్రిప్టో ఇన్వెస్టర్ల మదిలో ఉన్న ప్రశ్న. కొంతమందికి ఇది ఇంటర్నెట్ విప్లవంతో పోల్చదగిన విప్లవం. క్రిప్టోపై ప్రతికూల ప్రభావం ఉంటే భారీగా నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

ఇటీవల చైనా బ్యాన్ అనంతరం క్రిప్టో మార్కెట్ దారుణంగా పతనమైన విషయం తెలిసిందే. బిట్ కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీలతో కూడిన ట్రాన్సాక్షన్స్ చట్టవిరుద్దమని చైనా కేంద్ర బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. డిజిటల్ కరెన్సీ అనధికార వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్రిప్టో కరెన్సీలను నిర్వహించకుండా 2013లోనే చైనా బ్యాంకులపై నిషేధం విధించారు. కానీ ప్రభుత్వం ఈ ఏడాది మళ్లీ ప్రకటన చేసింది. ఈ ప్రభావం క్రిప్టో కరెన్సీ పైన పడింది. ప్రస్తుతం బిట్ కాయిన్ 42,000 డాలర్ల స్థాయిలో ఉంది.

English summary

Bitcoin price above $42,000: Should you do cryptocurrency SIP?

Investing in cryptocurrency is a high-risk activity. Several experts would advise you to invest or trade in crypto with the money you won’t regret losing.
Story first published: Sunday, September 26, 2021, 16:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X