For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేయకండి.. ఇవి చేయవద్దు: కస్టమర్లకు SBI ఆన్‌సైన్ బ్యాంకింగ్ టిప్స్

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ కస్టమర్లకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సమయంలో ఫ్రాడ్‌కు గురి కాకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ సూచించాయి. ఇటీవల ఫ్రాడ్స్ పెరిగిపోయాయి. కస్టమర్లు స్కామ్ చేసేవారి చేతిలో పడకుండా ఉండేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి.

తాజాగా ఎస్బీఐ, PNB తమ కస్టమర్లకు టిప్స్ ఇచ్చాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ సురక్షితంగా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందే కస్టమర్లు చేయవలసిన, చేయకూడని వాటిని తమ వెబ్‌సైట్లో పొందుపరిచింది ఎస్బీఐ.

ముఖేష్ అంబానీకి మరింత తగ్గరగా, భారీగా పెరిగిన అదానీ సంపదముఖేష్ అంబానీకి మరింత తగ్గరగా, భారీగా పెరిగిన అదానీ సంపద

ఇలా చేయండి

ఇలా చేయండి

ఆన్‌లైన్ ద్వారా వెబ్ సైట్‌కు లాగిన్ కావడానికి మీ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో https://www.onlinesbi.com/ ద్వారా యాక్సిస్ కావొచ్చు.

మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌నిక్రమం తప్పకుండా యాంటీవైరస్‌తో స్కాన్ చేయాలి.

చివరికి లాగిన్ తేదీ, సమయం ప్రతిసారి చెక్ చేస్తుండాలి.

ఇలా చేయవద్దు

ఇలా చేయవద్దు

సైట్‌కు లాగిన్ కావడానికి మెయిల్ లేదా మెసేజ్ ద్వారా వచ్చిన లింక్స్ పైన క్లిక్ చేయకూడదు.

మీకు తెలియని వెబ్ సైట్స్ నుండి వచ్చే ఈ-మెయిల్‌ను తెరిచి చూడవద్దు. ఈ-మెయిల్‌కు జోడించిన లింక్స్ పైన క్లిక్ చేయడం వద్దు.

తెలియని వ్యక్తులు సలహా మేరకు అవసరం లేని యాప్స్‌ను డౌన్ లోడ్ చేయవద్దు.

వ్యక్తిగత సమాచారం చెప్తే రివార్డులు ఇస్తామని సందేశాలు, ఈమెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఫోన్ కాల్స్ వస్తే వాటికి దూరంగా ఉండాలి. మీ పర్సనల్ సమాచారం ఇవ్వవద్దు.

వివరాలు ఇవ్వవద్దు

వివరాలు ఇవ్వవద్దు

బ్యాంకు వెబ్ సైట్ సమాచారం అప్ డేట్ చేస్తున్నామని, మీ వివరాలు తెలియజేయాలని అడిగే వాటికి సమాధానం చెప్పకూడదు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఎస్బీఐ, ఆర్బీఐ, ప్ర‌భుత్వ సంస్థ‌లు, పోలీస్‌, KYC అథారిటి నుంచి కాల్ చేస్తున్నామని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి ఫోన్ కాల్స్ వ‌స్తే సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డే వారి నుండి వ‌చ్చే కాల్స్‌గా భావించి వాటిని నివారించాలి.

ఏ బ్యాంకులైనా ఈ-మెయిల్ ద్వారా లేదా ఇతర మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేయవు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

పుట్టిన తేదీ, డెబిట్ కార్డు నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ నెంబర్, సీవీవీ, ఓటీపీ వంటి సమాచారం ఎవరితోను షేర్ చేయవద్దు.

English summary

ఇలా చేయకండి.. ఇవి చేయవద్దు: కస్టమర్లకు SBI ఆన్‌సైన్ బ్యాంకింగ్ టిప్స్ | Account holders to follow these tips while banking online to avoid scam: SBI

The State Bank of India(SBI) shared precautionary measures and tips for their customers while banking online.
Story first published: Tuesday, June 15, 2021, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X