For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal Finance: కొత్త ఏడాది జనవరి నుండి మారుతున్న కొన్ని...

|

కొత్త క్యాలెండర్ ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం. మరో కొద్ది గంటల్లో 2021 నుండి 2022 సంవత్సరంలోకి వెళ్తున్నాం. దాదాపు ప్రతి నెలలో కొన్ని మార్పులు చేర్పులు మన పర్సనల్ ఫైనాన్స్ పైన ప్రభావం చూపుతాయి. కొత్త ఏడాది అయితే మరిన్ని మార్పులు ఉంటాయి. ఇందుకు అనుగుణంగా మన స్పెండింగ్ బిహేవియర్‌ను మార్చుకోవాలి. పెట్టుబడులు, ఇన్సురెన్స్ పాలసీలు, క్రెడిట్ రిపోర్ట్స్.. వంటి వాటిలో మార్పులు ఉండవచ్చు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పర్సనల్ ఫైనాన్స్ మరింతగా అవసరం.

ఈపీఎఫ్ వెబ్ సైట్

ఈపీఎఫ్ వెబ్ సైట్

మీరు ఏదైనా ఆర్గనైజేషన్‌లో కనుక వర్క్ చేస్తుంటే.. మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే మీ ఈ-నామినేషన్‌ను పొందుపరచాలి. తొలుత ఈ గడువును నేటి వరకు (డిసెంబర్ 31, 2021) వరకు ఇచ్చారు. అయితే దీనిని నిన్న పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది శుభవార్త. EPFO ప్రకారం ఒక వ్యక్తి ఈ-నామినేషన్‌ను దాఖలు చేయాలి. ఎందుకంటే ఇది సభ్యుని మరణం తర్వాత పెన్షన్ (ఎంప్లాయీస్ డిజిటల్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్), ప్రావిడెంట్ ఫండ్(PF), ఇన్సురెన్స్ (ఉద్యోగుల డిజిటల్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్) ప్రయోజనాలను సులభంగా పొందడంలో ఉపయోగపడుతుంది.

ఏటీఎం నగదు ఉపసంహరణ ఖరీదు

ఏటీఎం నగదు ఉపసంహరణ ఖరీదు

ఏటీఎం ట్రాన్సాక్షన్స్ జనవరి 1, 2022 నుండి మరింత ఖరీదు కానున్నాయి. అంటే ట్రాన్సాక్షన్స్‌కు మించి ఏటీఎం నుండి నగదును తీసుకుంటే ఇక నుండి ఒక్కో ట్రాన్సాక్షన్ పైన రూ.21 ఛార్జీ వర్తిస్తుంది. అకౌంట్ ఉన్న బ్యాంకులో నాన్ క్యాష్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ పరిమితి 5, నాన్-బ్యాంక్ అయితే మూడు.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు నేడు చివరి రోజు. సాధారంగా ఐటీఆర్ డెడ్ లైన్ జూలై 31, 2021. అయితే కరోనా నేపథ్యంలో ఈ గడువును పొడిగించారు. తొలుత అక్టోబర్ నాటికి, ఆ తర్వాత డిసెంబర్ చివరి నాటికి పొడిగించారు. అయితే ఆలస్య ఫీజుతో మార్చి 31వ తేదీ వరకు ఫైల్ చేయవచ్చు. ఆలస్య రుసుము 234ఎఫ్ ప్రకారం రూ.5000 ఉంటుంది. మీ ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షలు అయితే పెనాల్టీ రూ.1000.

సిలిండర్ ధరలు

సిలిండర్ ధరలు

ఈ నెలలో ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి నెల మొదటి తారీఖున ధరలను సవరిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల ప్రారంభంలో ధరల్లో మార్పు ఉండవచ్చు. ఈ నెలలో కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. కానీ 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మార్పులేదు. వచ్చే నెల ధరల్లో మార్పు ఉండవచ్చు. అలాగే, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబి రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను సవరించింది.

English summary

Personal Finance: కొత్త ఏడాది జనవరి నుండి మారుతున్న కొన్ని... | 5 important changes in money matters from January

Once you have your resolutions in place in January, you will have to revisit your spending behaviour, investments, insurance policies, credit reports, etc. and rework on them for a better financial life amid the pandemic.
Story first published: Friday, December 31, 2021, 13:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X