నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అతారిటీ(PFRDA) చేత నిర్వహించబడే సహకార విరమణ పథకం. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సులోని వారు ఈ పథకంలో చేరవచ్చు. స్కీంలో చేరిన సమయంలో ప్రతి NPS సభ్యుడికి ఒక పోర్టబుల్ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PRAN) కేటాయిస్తారు. ప్రస్తుతం చాలా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఉన్నాయి. ఇందులో NPS కూడా ఒకటి. ఇది రిటైర్మెంట్ స్కీం. ఆర్మ్‌డ్ ఫోర్స్‌ను మినహాయించి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల కోసం 2004 జనవరిలో NPSను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని తమ ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. 2009 నుంచి ఈ పథకాన్ని అన్ని వర్గాలకు, ఎన్నారైలకు కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఎప్పటికప్పుడు NPSలో మార్పులు
NPS స్కీంలో చేరిన చేరివారు ఉద్యోగం చేసే సమయంలో ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించాలి. పదవీ విరమణ తర్వాత సదరు ఉద్యోగి 60 శాతం మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. రెగ్యులర్ ఆదాయ వనరు కోసం మిగిలిన 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలి. NPS పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎప్పటికి అప్పుడు ప్రభుత్వం మార్పులు చేస్తోంది.

ఈపీఎఫ్ఓ కంటే బెట్టర్
ఓ నివేదిక ప్రకారం ఈపీఎఫ్ఓ (EPFO) ఎంచుకున్న సబ్‌స్క్రైబర్స్ కంటే NPS ఎంచుకున్న వారు మెరుగ్గా ఉన్నారట. ఎందుకంటే సెంట్రల్ (స్కీమ్-CG), రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు (స్కీమ్-ఎస్‌జీ) కోసం కేటాయించిన పథకాలు ఈఫీఎఫ్ఓ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.

ఈపీఎఫ్ఓ కంటే మంచి రిటర్న్స్
గత పదేళ్లను చూస్తే స్కీమ్-CG, స్కీమ్-SG సగటున వరుసగా 9.1 శాతం, 9.5 శాతం రాబడిని ఇచ్చాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈపీఎఫ్ఓ మాత్రం 8.7 శాతం రిటర్న్స్ (పన్ను కోణాన్ని పరిగణలోకి తీసుకోకుండా) ఇచ్చాయి.

NPSలో రెండు రకాల ఖాతాలు..
NPS టైర్ 1, టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలను అందిస్తోంది. టైర్ 1 ఎన్పీఎస్ అకౌంట్ కచ్చితంగా పెన్షన్ ఖాతా. ఇది పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది. టైర్ 2 ఖాతా వాలంటరీ సేవింగ్స్ అకౌంట్. దీనిని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.

టైర్1 ఖాతాలో ఎప్పుడు ఉపసంహరించుకోవచ్చంటే...
టైర్ 1 ఖాతా నుంచి పాక్షికంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలు, మెడికల్ ట్రీట్మెంట్ వంటి వివిధ పరిస్థితుల్లో కొన్ని షరతులకు లోబడి 25 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. టైర్ 1 ఖాతాలో పెట్టుబడులు EET(ఎక్సెంప్ష్, ఎక్సెంప్ష్, ట్యాక్స్‌డ్)గా ఉంటాయి.

పన్ను పరిధి ఆదాయాన్ని రూ.2 లక్షల వరకు ఎలా తగ్గించుకోవచ్చు
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80 CCD(1) ప్రకారం వేతనంలో (బేసిక్, డియర్‌నెస్ అలవెన్స్-DA) 10 శాతం వరకు ఉద్యోగి కంట్రిబ్యూషన్ ఉంటే పన్ను తగ్గింపు పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు మొత్తానికి (రూ.1.5 లక్షలు) ఇది మించకూడదు. సెల్ఫ్ ఎంప్లాయిట్ పన్ను చెల్లింపుదారులకు కంట్రిబ్యూషన్ 20 శాతంగా ఉంటుంది.

ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD(2) కింద ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 10 శాతం (బేసిక్, డియర్‌నెస్ అలవెన్స్-DA) ఉంటే ట్యాక్స్ డిడక్షన్‌కు ఎలిజబుల్. ఈ మొత్తం సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల పరిమితికి మించకూడదు.

వాలంటరీ కంట్రిబ్యూషన్..
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80CCD(B) కింద ఉద్యోగులు స్వచ్చంధంగా ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో రూ.50,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. దీంతో NPSలో ఇన్వెస్ట్ చేసే ఉద్యోగులు వారి కంట్రిబ్యూషన్ పైన రూ.2 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అదనపు ప్రయోజనం. ఉద్యోగులపై పన్ను భారం తగ్గించేందుకు ఎన్నో ప్రైవేటు కంపెనీలు కూడా NPS స్కీంను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications