For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వడ్డీలతో 4 కోట్లమందికి భారీ షాక్, లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటే...

|

ముంబై: సాధారణంగా సీనియర్ సిటిజన్లు, రిటైర్మెంట్ తీసుకున్నవారు పిక్స్డ్ డిపాజిట్ (FD)లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే అలాంటివారు ఇప్పుడు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని డెబ్ట్ మ్యుచువల్ ఫండ్స్‌లోకి మార్చే అవకాశాలు కొట్టి పారేయలేం. బుధవారం నాడు ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ (SBI) వడ్డీ రేట్లను సవరించింది. రుణాలు తీసుకునే వారికి ఊరట లభించినప్పటికీ, FD రేట్లు మాత్రం తగ్గించింది. ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్లకు 1-2 ఏళ్లకుగాను వడ్డీ రేట్లను 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించింది. అలాగే, రూ.1 లక్ష డిపాజిట్‌పై సేవింగ్స్ బ్యాంక్ రేటును 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించింది. ఇతర బ్యాంకులు కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశాలు ఉన్నాయి.

సొమ్ము భద్రం: LIC ఆర్థిక పరిస్థితి బాగాలేదా? వాస్తవం ఇదీ!సొమ్ము భద్రం: LIC ఆర్థిక పరిస్థితి బాగాలేదా? వాస్తవం ఇదీ!

సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లు...

సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లు...

రూ.1 లక్,లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది. ఇప్పుడు దీనిని 3.25 శాతానికి తగ్గించింది. అదే సమయంలో రూ.1 లక్షకు పైన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటు 3 శాతానికి తగ్గుతుంది. 2019 నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి. ఎస్బీఐ రూ.1 లక్షకు పైన బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను రెపో రేటుతో లింక్ చేసింది.

FD

FD

ఎస్బీఐ FD, టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. బ్యాంకు ఒక నెలలో FDలపై వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోసారి. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. FD రేట్లు 4.5 శాతం నుంచి 6.25 శాతం మధ్యలో ఉన్నాయి.

వారికి బ్యాడ్ న్యూస్

వారికి బ్యాడ్ న్యూస్

ఎస్పీఐ వడ్డీ రేట్లను రెపో రేటుకు లింక్ చేసి రుణగ్రహీతలకు శుభవార్త చెప్పింది. అదే సమయంలో డిపాజిట్లపై కూడా అదే బెంచ్ మార్క్‌తో అనుసంధానించబడుతుంది. ఈ నేపథ్యంలో రుణగ్రహీతలకు వడ్డీ రేటు తగ్గగా, డిపాజిట్ చేసేవారికి వడ్డీ తక్కువగా వస్తుంది. అంటే ఆర్బీఐ రెపో రేటు కట్ చేస్తే FD రేట్లు కూడా తగ్గుతాయి. ఇది సీనియర్ సిటిజన్లకు, రిటైర్ అయినవారికి దెబ్బ. ఆర్థిక అవసరాల కోసం FDపై ఆధారపడే వారికి ఇది బ్యాడ్ న్యూస్.

ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు...

ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు...

FDపై వడ్డీ రేటు తగ్గుతున్న ఇలాంటి పరిస్థితుల్లో వీటిపై ఆధారపడిన సీనియర్ సిటిజన్లు ఇతరులు కాస్త రిస్క్ చేయాలని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. డెబిట్ ఫండ్స్ వంటి మార్కెట్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా, ప్రభుత్వం కూడా సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ రాయితీ కలిగిస్తూ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ద్వారా ఊరట కల్పించాలని చెబుతున్నారు.

రూ.14 లక్షల కోట్లు... డిపాజిట్లు వెనక్కి తీసుకునే పరిస్థితులు..

రూ.14 లక్షల కోట్లు... డిపాజిట్లు వెనక్కి తీసుకునే పరిస్థితులు..

ఎస్బీఐ రేట్ కట్ తర్వాత రూ.50 లక్షల FDపై ఆదాయం రూ.5,000 వరకు తగ్గుతుంది. సర్‌ప్లస్ లిక్విడిటీ కారణంగా వడ్డీ రేట్లు తగ్గించబడ్డాయని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం 4.1 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు FD అకౌంట్స్ ఉన్నాయి. రూ.14 లక్షల కోట్ల మొత్తం సేవ్ చేసారు. ఇలా FDలపై వడ్డీ రేట్లు తగ్గిస్తే డిపాజిట్లు వెనక్కి తీసుకునే పరిస్థితులు తలెత్తుతాయి.

వడ్డీ రేట్లకు పరిమితి

వడ్డీ రేట్లకు పరిమితి

అయితే ఇక్కడ మరో విషయం ఉంది. ఓ పరిమితి దాటి వడ్డీ రేట్లు తగ్గించలేరని PNB చీఫ్ ఎస్ఎస్ మల్లికార్జున రావు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం రెపో రేటు తొమ్మిది పదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందని, మరింత తగ్గించే సూచనలు ఉన్నాయని భావిస్తున్నారు. వడ్డీ రేటు 6 శాతం కంటే తగ్గితే ఈ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లు డిపాజిట్లు వెనక్కి తీసుకుంటే అప్పుడు సామాజిక అసౌకర్యం కలుగుతోందని చెబుతున్నారు. ఎకానమీ ముందుకు సాగకుంటే అది అందరికీ ప్రతికూలతేనని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ అన్నారు.

ఇక వాటివైపు మరలే అవకాశం

ఇక వాటివైపు మరలే అవకాశం

ఎటికా వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ అండ్ సీఈవో కొఠారీ ప్రకారం... సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షల మొత్తాన్ని SCSSలో మిగతా మొత్తాన్ని ప్రభుత్వ 7.75 శాతం డిపాజిట్ స్కీంలలో ఇన్వెస్ట్ చేస్తే, ఈ రెండింటిపై కూడా పన్ను మినహాయింపు లేదు. ప్రభుత్వం ఇలాంటి పథకాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకుంటే, అలాగే FD వడ్డీ రేట్లు మళ్లీ మళ్లీ తగ్గితే అప్పుడు 7.5 శాతం నుంచి 8 శాతం రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఆకర్షణీయ పెట్టుబడి మార్గాలుగా సీనియర్ సిటిజన్లకు కనిపించవచ్చు.

కార్పోరేట్ FDలవైపు చూపు...

కార్పోరేట్ FDలవైపు చూపు...

FDల నుంచి వచ్చే ఆదాయం తగ్గినప్పుడు, అంతే మొత్తం కమిట్‌మెంట్ కొనసాగించాల్సిన పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అధిక రేటింగ్ కలిగిన కార్పోరేట్ FDల వైపు చూడవచ్చునని ఢిల్లీకి చెందిన ఆర్థిక నిపుణులు సూర్య తెలిపారు. FD ఆదాయం తగ్గిన సమయంలో ప్రత్యామ్నాయ రాబడులవైపు చూస్తున్నప్పుడు సేఫ్టీ, రిటర్న్స్, లిక్విడిటీని కచ్చితంగా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మీకు ఏది సరైనదనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేయవచ్చునని, రాజీపడవద్దని చెబుతున్నారు.

English summary

ఈ వడ్డీలతో 4 కోట్లమందికి భారీ షాక్, లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటే... | Falling FD rates set to hit 4 crore senior citizens hard

Senior citizens and retirees who primarily depend on income from fixed deposits in banks, may soon need to look at shifting part of their life's savings into debt mutual funds.
Story first published: Thursday, October 10, 2019, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X