For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల కంటే మంచి ఆఫర్, ఇలా మీ డబ్బు రెండింతలు అవుతుంది

|

కొన్ని పాస్టీఫీస్ పథకాలు... కమర్షియల్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పైన ఇచ్చే వాటి కంటే మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఉదాహరణకు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీం ద్వారా ఏడాదికి 8 శాతం వడ్డీ వస్తుంది. NSC రిటర్న్స్‌తో పోలిస్తే ప్రముఖ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల పైన ఇచ్చే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియాలో ప్రస్తుతం 1-2 రెండేళ్ల కాలం ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పైన 7 శాతం వడ్డీ రేటు ఉంది. 5-10 ఇన్వెస్ట్‌మెంట్ పైన వడ్డీ రేటు 6.60 శాతంగా ఉంది. అలాగే, ఇతర ప్రముఖ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, యాకిస్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు కూడా వరుసగా 7.40 శాతం, 7.25 శాతం, 7.1 శాతం, 7 శాతంగా ఉన్నాయి.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

తొమ్మిది, పదేళ్లలో రెండింతలు

తొమ్మిది, పదేళ్లలో రెండింతలు

NSCలో పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే మీ ఆదాయం రెట్టింపు కావొచ్చు. ఎవరైనా కనీసం రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంత పెట్టాలనే దానికి లిమిట్ లేదు. ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ లెక్కన తొమ్మిదేళ్లలో మీ మొత్తం దాదాపు రెండింతలు అవుతుంది. పదేళ్లు దాటితే మీ అమౌంట్ రెండింతల కంటే ఎక్కువ కావొచ్చు. ప్రస్తుతం NSC VIII అయిదేళ్ల టెన్యూర్‌తో అందుబాటులో ఉంది. ఇక్కడ అయిదేళ్లకు ముగిశాక, మళ్లీ రీ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. పదేళ్లలో రెండింతలు అవుతుంది.

పన్ను రిబేట్

పన్ను రిబేట్

NSCలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇతర బ్యాంకుల్లో కంటే ఎక్కువ వడ్డీ రేటు రావడమే కాదు. పన్ను రిబేట్ కూడా ఉంటుంది. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ఉంది. మీరు మీ వద్ద ఉన్న మొత్తాన్ని అయిదు నుంచి పదేళ్ల కాలానికి గాను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే NSC సురక్షిత, అధిక వడ్డీ రేటు ఇచ్చే ఆఫ్షన్ కావొచ్చు.

NSC

NSC

పోస్టాఫీస్ అఫీషియల్ వెబ్ సైట్ ప్రకారం సింగిల్ ఓల్డర్ NSC స్కీంలో తన పేరున లేదా తన మైనర్ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయవచ్చు. వడ్డీ రేటు ప్రతి ఏటా మన చేతికి వస్తుంది. మెచ్యూరిటీ డేట్ ఇష్యూ తర్వాత ఓసారి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి పేరు మీదకు దీనిని మార్చుకోవచ్చు.

English summary

బ్యాంకుల కంటే మంచి ఆఫర్, ఇలా మీ డబ్బు రెండింతలు అవుతుంది | This Post Office scheme offers better interest than Fixed Deposits

Some of the Post Office schemes offer better returns than the Fixed Deposit schemes of commercial banks. Take for example the National Savings Certificate (NSC), which can grow your money at the rate of 8% per annum compounded annually.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X