For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుల్లో కూరుకుపోయారా? అయితే ఇలా బయటపడండి..

By Jai
|

ఎవరూ సరదా కోసం అప్పులు చేయరు. ఆదాయం తక్కువగా ఉండి అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. కొంతమంది కుటుంబ అవసరాల కోసం, మరికొంత మంది పెళ్లిళ్లు, వ్యాపారం, ఇంటి కొనుగోలు, వాహన కొనుగోలు, అత్యవసర ఆస్పత్రి ఖర్చులు తదితరాల కోసం అప్పులు చేస్తుంటారు. అప్పులు చేసే ముందే దాన్ని ఎలా తీర్చాలి, దానికి తగిన విధంగా ఆదాయ వనరులు ఉన్నాయా లేవా అన్న ఆలోచన చేసిన తర్వాతనే అప్పు కోసం ముందడుగు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు.

అయితే ఊహించిన స్థాయిలో ఆదాయం లేనప్పుడు అప్పుల కుప్ప పెరుగుతుంది. ఇది రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఈ అప్పు భారాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక దాని గురించే ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకునే వారిని చాలా మందిని చూసుంటాం. అయితే అప్పులు పెరిగి పోయినప్పుడు ఏవిధంగా వాటి నుంచి బయటపడవచ్చో చూద్దాం.

స్విగ్గి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్కీం?స్విగ్గి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్కీం?

అప్పుల్లో రకాలు, నష్టాలు

అప్పుల్లో రకాలు, నష్టాలు

డబ్బు అవసరం ఉండగానే ముందు స్నేహితులు, బంధువులు గుర్తుకు వస్తారు. వారికి తమ అవసరాన్ని చెప్పి ఎంతోకొంత డబ్బు తీసుకోవడం సహజం. ఆ తర్వాత క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని వినియోగించుకుంటాం. అయినా డబ్బులు సరిపోకపోతే బ్యాంకునుంచి వ్యక్తిగత రుణం తీసుకుంటాం. వీటన్నింటికి కూడా కొంత కాలపరిమితి ఉంటుంది. ఆలోపు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించక పోతే ఒత్తిడి మొదలవుతుంది. స్నేహితులకు ఎలాగోలా నచ్చజెప్పుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డు ద్వారా చేసిన చెల్లింపులను నిర్దేశిత కాలంలో చెల్లించకపోతే మాత్రం జరిమానాలతో గూబ గుయ్ మంటుంది. వ్యక్తిగత తదితర రుణాలు చెల్లించకపోయినా డీఫాల్టర్ గా ముద్రపడిపోతుంది. అందుకే తీసుకున్న రుణాలను ఏవిధంగా తిరిగి చెల్లించాలో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలి.

ఇలా చేయండి...

ఇలా చేయండి...

* ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువగా కారు, గృహ, పర్సనల్ రుణాలు తీసుకుంటుంటారు. వీటిపై నెలవారీగా చెల్లించే ఈఎంఐ మొత్తమే చాలా అధికంగా ఉంటుంది. క్రెడిట్ కార్డును కూడా ఎక్కువగానే వినియోగిస్తుంటారు. కాబట్టి ప్రతి నెలలోను వీరి వేతనంలో అధిక భాగం వీటి చెల్లింపులకే వెళుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందో ఒక లెక్కవేసుకోండి. అందుకుతగిన విధంగా ఖర్చులను అదుపుచేసుకోండి. ఒకవేళ ఉద్యోగంపోయినా, ఎక్కువ రోజులు సెలవులు పెట్టాల్సి వచ్చినా వేతనం తగ్గిపోతుంది. అప్పుడు చెల్లించాల్సిన వాయిదాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఇలా ఉండవద్దు అనుకుంటే మీ అనవసర ఖర్చులు తగ్గించుకోండి. పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ డబ్బు విలువ పెరిగేందుకు అవకాశం ఉన్నవాటికి వినియోగించుకోండి.

* క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే వడ్డీ మోత మోగిపోతుంది. కాబట్టి ముందు ఈ బిల్లులను క్లియర్ చేసుకోండి. తర్వాత కార్డు వినియోగాన్ని బాగా తగ్గించండి. అత్యవసరాల్లో వినియోగించడానికే ప్రాధాన్యం ఇవ్వండి.

* అప్పుల్లో ఉన్నప్పుడు కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన చేయకండి. కారు లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిజోలికి వెళ్లకండి. వాటికోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా మీ పై అప్పులభారం ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది.

* అప్పుల నుంచి బయట పడలేని స్థితిలో మీకు తెలిసిన ఫైనాన్సియల్ ప్లానర్ ను సంప్రదించండి. మీ పరిస్థితిని విశ్లేషించి మీకు మంచి సలహాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి...

మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి...

మీరు చేసే అప్పులు మీ ఒక్కరి కోసం కాకుండా కుటుంబం కోసం చేసేవి అయినప్పుడు వాటి గురించి కుటుంబ సభ్యులతో చర్చించండి. ప్రతినెలా ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో తెలియజేయండి. దీనివల్ల వారుకూడా అదనంగా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం ఎలాగో చెప్పే అవకాశం ఉంటుంది. ఖర్చులను తగ్గించుకునే అవకాశాలు కూడా ఉంటాయి.

English summary

అప్పుల్లో కూరుకుపోయారా? అయితే ఇలా బయటపడండి.. | How to manage debt of any size?

How to Manage Debt of Any Size. Know Who and How Much You Owe. Pay Your Bills on Time Each Month. Create a Monthly Bill Payment Calendar. Make at Least the Minimum Payment.
Story first published: Sunday, June 30, 2019, 8:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X