For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లల బంగారు భవిత కోసం ఇలా చేయండి...

By Jai
|

పిల్లలకు జన్మనివ్వడమే కాదు వారికి బంగారు భవిష్యత్ ను అందించడం కూడా తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత. వారికి విద్యా బుద్ధులను నేర్పించి వారి కాళ్ళమీద వారు నిలబడేలా ఉన్నత స్థాయికి చేర్చాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. కానీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోలేక కొంతమంది విఫలమవుతారు. తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే పిల్లకు మంచి భవిష్యత్ ను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలు పెరుగుతాయి. విద్య కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యతో పాటు పెళ్లిళ్లకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది. ఈ స్థాయిలో తల్లిదండ్రులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఆదాయం పెంచుకోవడమే కాదు ఆ ఆదాయాన్ని మెరుగ్గా వినియోగించుకోవాలి. అది ఎలాగంటే..

పెట్టుబడులకు అంకురార్పణ

పెట్టుబడులకు అంకురార్పణ

మీచేతిలో ఉన్న సొమ్ము మీదగ్గరే ఉంటే దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఆ సొమ్ము మరింత పెరిగేందుకు ఉన్న మార్గాలపై దృష్టి సారించాలి. సొమ్ము మీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంటే 4 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మరికాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది. వీటి విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. కాస్త ఎక్కువ రిస్క్ తీసుకుని ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్లు వస్తాయి. అయితే ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశించే ముందు మార్కెట్ పై నే కాకుండా మీరు పెట్టుబడి పెట్టాలనుకునే కంపెనీల గురించి అవగాహన పెంచుకోవడం మరవొద్దు. ఇంత ఓపిక లేకపోతే మ్యూచువల్ ఫండ్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. పిల్లల కోసం కూడా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు వచ్చాయి.

బీమా మరవొద్దు ..

బీమా మరవొద్దు ..

ఇంట్లో సంపాదించే వ్యక్తికీ అనుకోనిదేమైనా జరిగితే కుటుంబం పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. ఇట్లాంటి తరుణంలో బీమా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అందుకే మీరు బీమా చేసుకోండి. మీ పిల్ల పేరుమీద కూడా బీమా చేయండి. అది వారి ఆర్థిక అవసరాలకు ఉపయోగ పడుతుంది. చిన్న వయసులోనే బీమా చేస్తే ఆ సొమ్ము వారి ఉన్నత విద్యకు లేదా పెళ్లికి ఉపయోగ పడుతుంది. ఆరోగ్య బీమా కూడా తప్పనిసరిగా మారింది కాబట్టి దీనికోసం కూడా కొంత మొత్తం ఖర్చు చేయాలి.

సేవింగ్స్ ఖాతాలు..

సేవింగ్స్ ఖాతాలు..

దేశంలోని ప్రముఖ బ్యాంకులు పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతాలు తీసుకు వచ్చాయి. ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐ సి ఐ సి ఐ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు, ఐ డి బి ఐ బ్యాంకు వంటివి పిల్లల సేవింగ్స్ ఖాతాలు తెచ్చాయి. ఈ మీవద్ద మిగులు సొమ్ము ఉండగానే ఈ ఖాతాలోకి మళ్ళించవచ్చు. మీ బ్యాంకు ఖాతాకు పిల్లల సేవింగ్స్ ఖాతాలు లింక్ చేసుకోండి. మీ ఖాతాలో జీతం పడగానే పిల్లల ఖాతాకు సొమ్ము బదిలీ చేయండి. ఇలాంటి ఖాతాల ద్వారా పిల్లల్లో కూడా పొదుపు అలవాటు పెరుగుతుంది.

ఆడ పిల్ల కోసం... బంగారం బాండ్లు, సుకన్య సమృద్ధి యోజన

ఆడ పిల్ల కోసం... బంగారం బాండ్లు, సుకన్య సమృద్ధి యోజన

ఆడ పిల్లల పెళ్లి, లాంఛనాల కోసం తల్లి దండ్రులు మరింత ఎక్కువ పొదుపు చేయాలి ఉంటుంది. ఆడ పిల్లలకు బంగారం అంటే ప్రాణం. పెళ్ళిలో బంగారం పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బంగారం కోసం కూడా పొదుపు చేయవచ్చు. భారత ప్రభుత్వం బంగారం బాండ్లను విక్రయిస్తోంది. వీటిని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8 ఏళ్లకు ఈ బాండ్లు మెచ్యూరిటీ అవుతాయి. వీటిపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన విషయానికి వస్తే.. ఈ ఖాతాను పోస్టాఫీసు, బ్యాంకు వద్ద తెరవ వచ్చు. ఇందులో నెలవారీగా లేదా వార్షికంగా ఒకేసారి నిర్దేశిత సొమ్ము జమ చేయవచ్చు. పదేళ్ల లోపు ఆడ పిల్లల పేరుమీద ఈ ఖాతాను తీసుకోవచ్చు. ఈ ఖాతాపై గరిష్టంగా 8.5 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇలా మీ వద్దనున్న సొమ్మును సద్వినియోగం చేసుకుంటే అత్యవసరాల్లో ఈ సొమ్ము ఆడుకుంటుంది. ఆర్ధిక భరోసా లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే నిర్ణయం తీసుకోండి...

English summary

మీ పిల్లల బంగారు భవిత కోసం ఇలా చేయండి... | Start savings right away for your child

Start your kids off right in life by putting money away in strategic savings accounts.
Story first published: Friday, May 17, 2019, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X