For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల కోసం బ్యాంక్ అకౌంట్:వివరాలు ఈవిదంగా ఉన్నాయి.

యువకులు సంపాదించడం మొదలుపెట్టినప్పుడు తమ బ్యాంకు ఖాతాను తెరుస్తారు. కానీ పిల్లలకు, తల్లిదండ్రులు చాల మంది వారి పిల్లల కోసం ఖాతాలను తెరిచేందుకు కోరుతున్నారు.

By bharath
|

యువకులు సంపాదించడం మొదలుపెట్టినప్పుడు తమ బ్యాంకు ఖాతాను తెరుస్తారు. కానీ పిల్లలకు, తల్లిదండ్రులు చాల మంది వారి పిల్లల కోసం ఖాతాలను తెరిచేందుకు కోరుతున్నారు. ఇది వారి భవిష్యత్ కోసం డబ్బు ఆదా చేయడం మరియు డబ్బును ఎలా ఉపయోగించాలి అనే విషయాన్నీ తెలియజేయాలి.

మీ పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? మరి ఆలస్యం ఎందుకు? వెంటనే బ్యాంక్‌ను సంప్రదించండి. మైనర్ల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం నిర్వహించడం గతంలో కాస్త కష్టంతో కూడుకున్నది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దానిని నిర్వహించాల్సి ఉండేది. కానీ ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం 10 ఏళ్లు పూర్తైన మైనర్లు ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్‌ని ప్రారంభించడంతో పాటు సొంతంగా నిర్వహించుకోవచ్చు.

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే ఏం చేయాలి?

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే ఏం చేయాలి?

మైనర్ అకౌంట్ కోసం ఉద్దేశించిన అకౌంట్‌కు సాధ్యమైనంత తక్కువ పత్రాలు ఉండాలని ఆర్‌బీఐ సూచించింది. అయితే ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంచాలి? వారికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు, చెక్కు బుక్ లాంటివి ఇవ్వాలా వద్దా అనేది బ్యాంకుకే వదిలేసింది.

అకౌంట్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి

అకౌంట్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి

ఒకసారి ఏదైనా బ్యాంకులో అకౌంట్ ప్రారంభించిన తర్వాత మీ పిల్లలను వెంట తీసుకొని వెళ్లండి. దరఖాస్తు పత్రాలను వారే స్వయంగా నింపుకునేందుకు ప్రొత్సహించండి. దరఖాస్తు పత్రంలో అర్ధం కాని విషయాలను తెలియజేయండి. బ్యాంకు అధికారులతో మాట్లాడించండి. అకౌంట్‌ ఓపెన్ చేసేందుకు, దానికి సంబంధించిన అన్ని విషయాలను వారికి అర్ధమయ్యేలా క్షుణ్ణంగా వివరించండి.

బ్యాంకులో పొదుపు అలవాటు చేయండి

బ్యాంకులో పొదుపు అలవాటు చేయండి

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ పిల్లలకు పొదుపు గురించి అలవాటు చేయండి. మందుగా పొదుపు ప్రాధాన్యం గురించి వివరించేందుకు ప్రయత్నించండి. సైకిల్, కంప్యూటర్ కొనడం లేదా ఉన్నత చదువుల గురించి వెళ్లేటప్పుడు అవసరమయ్యే ఖర్చులు గురించి ముందుగానే తెలియజేయండి. ప్రతి నెలానెలా కొంత మొత్తంలో తమ తమ బ్యాంక్ అకౌంట్‌లో పొదుపు చేసుకునేలా ప్రొత్సహించండి. దీంతో పాటు పొదుపు చేయడం వల్ల వచ్చే లాభాలను వారికి వివరించండి.

నిఘా ఉంచండి

నిఘా ఉంచండి

మైనర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, ఆ ఖాతాపై తప్పనిసరిగా మీ నిఘా ఉంచండి. అకౌంట్ ఓపెన్ చేసి, అందులో పెద్ద మొత్తంలో నగదు జమ చేసి, వారి స్వేచ్ఛకే వదిలేయడం అంత మంచిది కాదు. సందర్భాన్ని బట్టి, అకౌంట్ వివరాలను పిల్లల సమక్షంలో ఎప్పటికప్పుడు సరిచూస్తూ ఉండండి. వడ్డీ ఎంత వచ్చింది? ఇటీవల చేసిన లావాదేవీలు ఏంటీ? అకౌంట్ నుంచి ఎప్పుడెప్పుడు నగదు బయటకు తీస్తున్నారు? ఇలాంటివన్నీ కూడా గమనించాలి.

డబ్బు మిగుల్చుకోవడం తప్పనిసరిగా నేర్పించాలి?

డబ్బు మిగుల్చుకోవడం తప్పనిసరిగా నేర్పించాలి?

ఎంతో కష్టపడితే గానీ డబ్బు సంపాదిస్తున్నామనేది మీ పిల్లలకు అర్ధమయ్యేలా వివరించండి. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు జమ చేస్తున్నారంటే వారు తప్పనిసరిగా డబ్బుని మిగుల్చుకోవాల్సిందేనని తెలియజెప్పండి. పుట్టినరోజు, ఇతర వేడుకలకు తక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా వారి పొదుపుని పెంచుకోవచ్చని చెప్పండి.

మైనర్ బ్యాంక్ అకౌంట్‌ ఓపెన్ చేసేందుకు కావాల్సిన పత్రాలు:

మైనర్ బ్యాంక్ అకౌంట్‌ ఓపెన్ చేసేందుకు కావాల్సిన పత్రాలు:

  • పుట్టినరోజు ధృవీకరణ పత్రం
  • పుట్టినరోజు నమోదు సర్టిఫికెట్
  • పుట్టినరోజుని తెలిపే రిపోర్ట్ కార్డ్
  • ఫోటోతో స్కూల్ ఐడీ కార్డు

Read more about: minor account banking money
English summary

పిల్లల కోసం బ్యాంక్ అకౌంట్:వివరాలు ఈవిదంగా ఉన్నాయి. | How To Open Bank Accounts For Children

For accounts of minors, the guardian must operate the account. However, minors over 10 years of age can operate the account on their own.
Story first published: Tuesday, February 5, 2019, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X