For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెక్కు ఇస్తున్నారా.. బౌన్స్ కాకుండా చూసుకోండి.. అయితే జైలుకే

దేశ‌వ్యాప్తంగా చెల్లని చెక్కు కేసులు పెరిగిపోతున్నాయి. చాలా మంది చెక్కులు జారీ చేసి బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు లేకుండా చెక్కు స్వీక‌ర్త‌లను మోసం చేస్తున్నారు. ఇందుకోస‌మే దీనికి సంబంధించిన విచార‌ణ‌ల‌ను

|

ప్ర‌త్యేక అధికారిక ముద్రిత పత్రం ద్వారా చెల్లింపులు జ‌ర‌గాల్సిందిగా ఇచ్చే ఆదేశాల‌ను చెక్కు అని అంటూ ఉంటారు. దీనికి ఆర్బీఐ లీగ‌ల్ ప‌ర్మిట్ ఉంటుంది. చెక్కు స్వభావం... ఏంటంటే చెల్లింపుకు అర్హ‌త క‌లిగి ఉండ‌టం. నిజమైన పరీక్ష తెలుసుకోవాలంటే చెక్కు ఎల్లప్పుడు బ్యాంకులో తీయబడి కోరిన వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా చెల్లింపబడుతూ ఉండాలి. చెక్కు గ్రహీత అనగా బ్యాంకు వారు సరిపడ డ బ్బు ఉన్నప్పుడు దానిని స్వీకరించి డబ్బు చెల్లించదరు. చెక్కును ఎండార్స్ ద్వారా గాని స్వాధీనం చేయుట ద్వారా గాని బదిలీ చేయవచ్చు.ఈ విధంగా చెక్కుకు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాలు ఇక్క‌డ తెలుసుకుందాం.

1. చెక్కులో ఉండే అంశాలు

1. చెక్కులో ఉండే అంశాలు

1. డ్రాయర్ (చెక్కు కర్త) : అనగా చెక్కు రాసిన వారు.

2. డ్రాయీ అనగా : చెక్కులో వ్రాయబడిన సొమ్మని చెల్లించమని ఆదేశాలు జరీ చేయబడిన వారు. అనగా ఏదైనా బ్యాంకు వారు.

3. పేయీ (చెల్లింపు గ్రహీత) అనగా : వారికి గాని వారి ఆదేశాలు ప్రకారం కాని డబ్బు చెల్లించమని, చెక్కులో ఎవరి పేరు అయితే వ్రాయబడిందో వారు.

4. హోల్డర్ (చెక్కుదారు) అనగా... : చెక్కుస్వాధీనాన్ని తన పేరు మీద కల్గి ఉండుటకు మరియు రావలసిన సొమ్మును పొందుటకు లేదా వసూలు చేసుకొనుటకు అర్హత కలిగియున్న వ్యక్తి.

5. హోల్డర్ ఇన్ డ్యూ కోర్సు (కాల క్రమంలో చెక్కును కల్గియున్న వ్యక్తి)... ప్రతిఫలం ఇచ్చుట ద్వారా చెక్కును స్వాధీనం కల్గియుండి డబ్బు చెల్లింపబడుటకు అర్హత కల్గిన వ్యక్తి.

6. ఎండార్స్ర్ : ఎప్పుడైతే చెక్కుదారు లేక చెక్కుకర్త చెక్కు బదిలీ చేయాలి అని ఉద్దేశ్యంతో నోటు వెనుక భాగాన లేదా ప్రారంభంలో సంతకం చేయడం గాని లేదా పేపరు లేదా స్టాంపు పేపరు జతపరచడం గాని చేసిన వ్యక్తి . ఇలాంటి ఎండార్స్మెంట్ పొందిన వ్యక్తిని ఎండార్సీ (ఎండార్స్మెంట్ పొందే వ్యక్తి ) అంటారు.

 2. చెక్కు విష‌యంలో ఉండే సానుకూల‌త‌

2. చెక్కు విష‌యంలో ఉండే సానుకూల‌త‌

చెక్కు చెల్లింపు ఆపమని ఆదేశిస్తే... చెక్కు కర్త తాను ఇచ్చిన చెక్కుకు చెల్లింపు ఆపమని చెల్లింపు జరగుటకు ముందు ఎప్పుడైనను ఆదేశించవచ్చు. బ్యాంకు అధికారులు చెక్కును తిరస్కరిస్తూ దానిపై "చెక్కు కర్త సొమ్ము చెల్లింపు ఆపినాడు" అని రిమార్కు వ్రాస్తే చెక్కు బౌన్స్ అయినట్లు కాదు. ఇలాంటి సందర్భాలలో చెక్కు కర్త వ్రాతపూర్వకంగా తిరిగి ఆదేశించేవరకు అధికారులు చెల్లింపును నిరాకరిస్తారు. ఈ ఆదేశాలు తిరిగి చెక్కు కర్త రద్దుచేసేవరకు లేదా ఆరునెలలు వరకు అమలులో ఉంటాయి. చెక్కు ఇచ్చిన తరువాత చెల్లింపుకు వెళ్ళవద్దని చెక్కు గ్రహీతకు చెక్కుకర్త నోటీసు ఇచ్చినా చెక్కు గ్రహీత బ్యాంకులో చెక్కును దాఖలు చేసినట్లయిన జరిగే పరిమాణాలకు చెక్కుకర్త బాధ్యత వహించడు. కాని ఆ తరువాత వచ్చే నోటీసుకు చెక్కుకర్త బాధ్యుడైయుండాలి.

 3.చెక్కు ఇచ్చిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే

3.చెక్కు ఇచ్చిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే

చెక్కుఇచ్చిన తరువాత చెక్కుకర్త చనిపోతే బ్యాంకు అధికారులు ఆ చెక్కు చెల్లింపుని నిలిపివేయవచ్చు. చెక్కును ఎవరైనా ఏజెంట్ జారీచేస్తే ప్రిన్సిపల్ చనిపోయినప్పటికీ ఆ చెక్కు చెల్లుతుంది. చనిపోయిన బ్యాంకు ఖాతాదారుని అకౌంటు అతని వారసులు కావలసిన డాక్యుమెంట్లు అనగా వారసత్వ సర్టిఫికెట్, ప్రొభేట్ మొదలగునవి దాఖలు చేసినపుడు తిరిగి ప్రారంభమవుతుంది.

4. చెక్కును ఎన్నిసార్లు బ్యాంకులో దాఖలు చేయవచ్చు ?

4. చెక్కును ఎన్నిసార్లు బ్యాంకులో దాఖలు చేయవచ్చు ?

డబ్బు చెల్లింపు కోసం చెక్కును బ్యాంకులో ఇచ్చినప్పుడు డబ్బులు లేక చెక్కు రిటన్ అయినప్పుడు చెక్కు కర్త అభ్యర్థన మేరకు కొది రోజులు తర్వాత మరల ఆ చెక్కును దాఖలు చేయవచ్చును. ఇలా ఎన్నిసార్లు అయినా 3 నెలలోపు బ్యాంకులో చెక్కును దాఖలు చేయవచ్చు.

5. చెక్కు తిరస్కరించబడితే

5. చెక్కు తిరస్కరించబడితే

బ్యాంకుల ద్వారా ఆర్థిక వ్యవహారాలు నడపటంలో నమ్మకం కల్గించటం నేటి ఆర్థిక వ్యవస్థలో చాలా అవసరం. డబ్బు ద్వారానే ఆర్థిక వ్యవహా రాలు నడపటం అన్ని చోట్లా సాధ్యపడదు. నేటి ఆధునిక యుగంలో చెక్కుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం చెక్కులపైనా, బ్యాంకులు ఆర్థిక కార్యకలాపాలపైన నమ్మకం పెంచటం కోసమే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. 1988కి ముందు చెక్కు నిరాకరించడబడితే అది నేరం కాదు. చెక్కును కలిగి ఉన్న వ్యక్తి క్రిమినల్ కేసే వేసే అవకాశం లేదు. 1988 లో ఈ చట్టానికి సవరణలు తేగా 1-4-89 నుంచి ఇవి అమలలోనికి వచ్చాయి. వీటి ప్రకారం చెక్కును కలిగి ఉన్న వ్యక్తి సివిల్ మరియు క్రమినల్ కేసు రెండు దాఖలు చేయవచ్చు. క్రిమినల్ కేసు దాఖలు చేయుటకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. "తిరస్కరించబడిన చెక్కుల" సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించటం కోసం ఈ సవరణలు తీసుకువచ్చారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం 138 నుంచి 142 వరకు గల సెక్షన్లేను పటిష్టంగా ఏర్పరచి, చెక్కులు తిరస్కారం ఎక్కువ కాకుండా ఏర్పాట్లు చేసారు.

6.చెక్కు ఏ విధంగా న్యాయ‌బ‌ద్ద‌మైన‌ది, దాని అర్థం

6.చెక్కు ఏ విధంగా న్యాయ‌బ‌ద్ద‌మైన‌ది, దాని అర్థం

నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం సెక్షన్ 6 ప్రకారం ఒక ప్రత్యేక బ్యాంక్ పేరిట రాసి ఇచ్చిన బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ను చెక్కు అంటారు. అడిగినపుడే చెల్లించవలసినది అనే వాక్యాన్ని ఆ పత్రంలో పొందుపరుచుట జరుగుతుంది. చెక్కుకు క్రింది లక్షణాలు ఉంటాయి.

1. ఇది లిఖిత పూర్వకంగా ఉంటుంది.

2. బేషరతు ఆర్డరును కలిగి ఉంటుంది.

3. ఏదైనా నిర్ధిష్ట బ్యాంకులో తీసి ఉండాలి.

4. ఆ ఆర్డరు నిర్ధిష్గట మొత్తం చెల్లింపు కోసమే ఉద్దేశించబడాలి

5. ఏవరికైతే డబ్బు చెల్లించాలో వారి పేరు స్పష్టంగా ఉండాలి.

7. చెక్కులు రెండు రకాలుగా ఉంటాయి.

7. చెక్కులు రెండు రకాలుగా ఉంటాయి.

ఎ. ఆర్డర్ చెక్కులు బి. బేరరు చెక్కులు

ఆర్డర్ చెక్కులు : కంపెనీలు, వాణిజ్యవేత్తలు వ్యాపాలరాల కోసం సాధారణంగా ఉపయోగించుకుంటాయి. ఈ విధానంలో చెక్కుపై ఎవరి పేరు ఉందో వారి సంతకాన్ని చెక్కు ఇచ్చేవారు. చెక్కు వెనుక భాగాన ధృవీకరించి ఇస్తారు. బ్యాంకు వారు సంతకాన్ని పోల్చి చూసుకొని డబ్బు చెల్లిస్తారు. ఈ చెక్కుల విషయంలో మూడవ వ్యక్తికి డబ ు్బలు చెల్లించే అవకాశం లేదు.

బేరర్ చెక్కులు : ఈ విధానంలో బ్యాంకుకు తీసుకువెళ్ళిన వ్యక్తికి డ బ్బు చెల్లిస్తారు. చెక్కుపై ఎవరి పేరైతే ఉందో వారు ఆ చెక్కు వెనక భాగాన సంతకం చేసి ఉండాలి. చెక్కును తీసుకెళ్ళిన వ్యక్తి కూడా చెక్కు వెనుక భాగాన సంతకం చేసిన తరువాత డబ్బు చెల్లిస్తారు.

ఓపెన్ చెక్కు: బ‌్యాంకు ఖాతాలో సొమ్ము చెల్లింపు జ‌రిపేందుకు ఒక వ్య‌క్తి ఇచ్చే చెక్కునే ఓపెన్ చెక్కు అంటారు. చెక్కు వెనుక వైపు మ‌రో వ్య‌క్తికి ఆపాదిస్తూ ఎండోర్స్ చేయ‌వ‌చ్చు.

8. చెక్కు బౌన్స్ అంటే ఏమిటి ?

8. చెక్కు బౌన్స్ అంటే ఏమిటి ?

చెక్కు ఇచ్చిన తరువాత దానిని తీసుకున్న వ్యక్తికి ఆ చెక్కు ద్వారా డబ్బు రాబట్టుకొనేందుకు బ్యాంకులో వేయగా ఆ చెక్కుపై ఉన్న మొత్తాన్ని బ్యాంకులో సరిపడ డబ్బు లేక లేదా అలాంటి కారణం చేత వారు ఆ చెక్కును తిరస్కరిస్తే చెక్కు బౌన్స్ అయిందంటారు. దానినే డిస్ ఆనర్ ఆఫ్ చెక్ అంటారు. ఈ సెక్షన్ను అమలు చేయాలంటే కొన్ని షరతులు అమలుపరచాలి.

రుణం తీర్చటం కోసం గాని, ఏదైనా ఇతర బాధ్యత నెరవేర్చటం కోసం గాని చెక్కు ఇచ్చి ఉండాలి. తన బ్యాంకు ఖాతా నుంచి ఒక చెక్కును ఒక వ్యక్తి పేరు మీద డ్రా చేసినట్లయితే అది ఏదైనా అప్పు తీర్చటానికి, లేదా చట్టబద్ధమైన ఇతర బాధ్యత నెరవేర్చడానికై ఉండాలి, చట్ట వ్యతిరేకమైన అవసరాల కోసం ఇచ్చిన చెక్కుల విషయంలో ఈ చట్టం అమలు కాదు.

చెక్కు 6 నెలలలోపు బ్యాంకులో దాఖలు చేయాలి. చెక్కు కాలపరిమితి 6 నెలలు మాత్రమే. చెక్కు తీసుకున్న 6 నెలల తరువాత బ్యాంకులో వేస్తే ఆ చెక్కు చెల్లదు. చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి క్రిమినల్ బాధ్యత ఉండదు. పోస్ట్ డెటడ్ చెక్కు అయితే దాని మీద ఉన్న తారీకు నుంచి 6 నెలల లోపు దాఖాలు చేయాలి. చెక్కు ఇచ్చిన తేది నుంచి కాదు.

9.నోటీసు ఇవ్వాలి :

9.నోటీసు ఇవ్వాలి :

బ్యాంక్ నుంచి చెక్కు తిరస్కరించబడినట్లు సమాచారం అందుకున్న నెలరోజుల లోపు చెక్కు ఇచ్చిన వ్యక్తికి డిమాండ్ నోటీసు పంపాలి. అలా నోటీసు ఇవ్వని పక్షంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సెక్షన్ 138 ఆకర్షింపబడదు.

డిమాండ్ నోటీసు పంపించిన 15 రోజుల వరరకు చెక్కు ఇచ్చిన వ్యక్తికి డ బ్బు చెల్లించడానికి గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 15 రోజులలో కూడా డబ్బు చెల్లించకుంటే సెక్షన్ 138 ప్రకారం అతను నేరస్థుడిగా భావించబడి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడానికి చట్టం అవకాశం కల్పించింది.

10. ఎవరు బాధ్యులు అవుతారు?

10. ఎవరు బాధ్యులు అవుతారు?

ఈ విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. చెక్కు ఇచ్చిన వ్యక్తి గ్యారంటర్తో సహా ఈ చర్యకు బాధ్యులౌతారు. కంపెనీ అయినతే చెక్కు ఇవ్వటానికి కారణమైన డైరక్టర్లు, చెక్కు ఇచ్చిన మేనేజరు కూడా బాధ్యులవుతారు. ఇది కేసులో ఉన్న నిర్ధిష్ట పరిస్థితులను బ ట్టి ఆధారపడి ఉంటుంది. సహజంగా నోటీసు ఇచ్చిన తర్వాత రాజీనామా చేశానన్న కారణంగా సంబంధిత బాధ్యతల నుంచి తప్పిచుకోజాలరు.

11. చెక్కు ఇచ్చిన తర్వాత డ బ్బు చెల్లింపు ఆపకూడదా?…

11. చెక్కు ఇచ్చిన తర్వాత డ బ్బు చెల్లింపు ఆపకూడదా?…

ఒకసారి చెక్కుపై రాసిన మొత్తాన్ని చెల్లింపు జరగకుండా నిలుపుదల చేయడానికి ఏ బ్యాంక్ చెక్ అయితే ఆ బ్యాంకుకు రాత పూర్వకంగా చెల్లింపు ఆపమని ఆర్డరు వేయవచ్చు, కారణాలు అడగకుండానే బ్యాంకు అధికారులు చెల్లింపు ఆపివేయాలి. బ్యాంకు అకౌంట్లో డబ్బు సరిపడనంత లేకుండా ఆపివేసినా చెక్కు ఇచ్చిన వ్యక్తి బాధ్యతల నుంచి తప్పించుకోజాలడు.

చెక్కుపై డబ్బు మొత్తం అక్షరాలలోనూ అంకెలలోనూ వేరుగా ఉంటే ? అలాంటి పరిస్థితులలో అక్షరాలలో ఉన్న మొత్తాన్ని పరిగనలోకి తీసుకొని డబ్బు చెల్లించటం జరుగుతుంది.

12. చెక్కులో ముఖ్యమైన మార్పులు చేయవచ్చా?..

12. చెక్కులో ముఖ్యమైన మార్పులు చేయవచ్చా?..

చెక్కుపై ముఖ్యమైన మారపులు, మెటీరి యల్ ఆల్ట్రరేషన్ ఉంటే ఆ చెక్కును తిరస్కరించవలసిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉంటుంది. చెక్కుపైన తేదీలలో కాని చెల్లింపు స్థలంలోగాని, చెల్లించవలసిన మొత్తంగాని, చెల్లింపు నియమంలో గాని వచ్చే మార్పులను మెటీరియల్ ఆల్టరేషన్స్ అని బిల్స్ ఆఫ్ ఎక్సేంజి చట్టం సెక్షన్ 64(2) చెప్తుంది. సాధ్యమైనంతవరకు చెక్కుపై ముఖ్యమైన మార్పులు లేకుండా చూసుకోవాలి.

13. చెక్కుబుక్ పోతే ఏం చేయాలి :

13. చెక్కుబుక్ పోతే ఏం చేయాలి :

చెక్కు పొరపాటును పోగొట్టుకుంటే వెంటనే ఆ చెక్కు వివరాలతో సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. పోయిన చెక్కు దొరికితే దాన్ని ఉపయెగించబోమని బ్యాంకుకు రాసి ఇవ్వవలసి ఉంటుంది. బ్యాంకు నుంచి కొత్త చెక్కు తీసుకోవచ్చు.

కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు

1. చెక్కు ఇచ్చేటప్పుడు ఎంత మొత్తం రాస్తున్నామో, దానికి తగ్గకుండా బ్యాంకులో డబ్బు ఉండేటట్లు చూసుకోవాలి.

2. చెక్కుపై సంతకాలు ప్రతిసారి ఒకే రకంగా ఉండాలి.

3. చెక్కులపై ముఖ్యమైన మార్పులు లేకుండా చూసుకోవాలి.

4. చెక్కులిచ్చేటప్పుడు కౌంటర్ ఫాయిల్స్, నెంబర్లు, ఎవరికిచ్చాయో వారి పేరు వివరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి

5. చెక్కు చిరగకుండా, తడవకుండా, కాలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి

6. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చేటప్పుడు ఆ తేదిలోపు బ్యాంకులో డబ్బు జమచేయటం మరచిపోకూడదు.

7. చెక్కును బ్యాంకుకు పంపించేటప్పుడు వెనుక సంతకం పెట్టాలి

14. ముగింపు

14. ముగింపు

దేశ‌వ్యాప్తంగా చెల్లని చెక్కు కేసులు పెరిగిపోతున్నాయి. చాలా మంది చెక్కులు జారీ చేసి బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు లేకుండా చెక్కు స్వీక‌ర్త‌లను మోసం చేస్తున్నారు. ఇందుకోస‌మే దీనికి సంబంధించిన విచార‌ణ‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని అటు ఆర్‌బీఐ, ఇటు కేంద్ర ప్ర‌భుత్వం న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను కోరుతున్నాయి. 1988కి ముందు చెక్కు నిరాక‌రించ‌బ‌డితే అది నేరం కాదు. చెక్కును క‌లిగి ఉన్న వ్య‌క్తి క్రిమిన‌ల్ కేసు వేసే అవ‌కాశం లేదు. అయితే 1989 నుంచి తిర‌స్క‌రించ‌బ‌డిన చెక్కును క‌లిగి ఉన్న వ్య‌క్తి సివిల్‌, క్రిమిన‌ల్ కేసు దాఖ‌లు చేయొచ్చు. మ‌నం ఇచ్చిన చెక్కు బౌన్స్ అయితే మ‌నం జ‌రిమానా క‌ట్టాల్సి రావొచ్చు. అదే విధంగా ఖాతాలో డ‌బ్బు లేని కార‌ణంగా మ‌న‌కు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయితే చెక్కు ఇచ్చిన వ్య‌క్తిపై క్రిమిన‌ల్ కేసును పెట్ట‌వ‌చ్చు.

డ‌బ్బు లేని కార‌ణంగా చెక్కు బౌన్స్ అయితే జైలుకు వెళ‌తారు. కాబ‌ట్టి ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌

Read more about: cheque చెక్కు
English summary

చెక్కు ఇస్తున్నారా.. బౌన్స్ కాకుండా చూసుకోండి.. అయితే జైలుకే | Everything to know about cheques in detail in telugu

What are the important things you have to observe in cheques Using technology to access banking services, is an easy task and less time consuming unlike earlier where standing in que for most of the transactions was mandatory.An increase in NEFT, RTGS, and other online transactions have reduced the old methods of banking.But, even now some of the financial transactions demand issue of cheque, such as where individuals need to submit post-dated cheque
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X