చాలా ఆర్థిక లావాదేవీల్లో ఐటీ రిటర్నుల ఫారం ఉపయోగపడుతున్నందున ఆదాయం పరిమితికి మించి లేకపోయినా రిటర్నులు దాఖలు చేయడం మంచిది. ఏయే సందర్భాల్లో ఐటీ రిటర్నులు మనకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లించే వారి సంఖ్యను పెంచేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే మొత్తం జనాభాలో ఆదాయపు పన్ను చెల్లించే వారి శాతం 1 శాతం లోపే ఉంది. ఆయకార్ సేతు యాప్, మైట్యాక్స్ యాప్ నుంచి సహజ్ ఫారం వంటి వాటిని అందుబాటులోకి తెచ్చి ఐటీఆర్ ఫైలింగ్ విధానాన్ని సులువుగా చేశారు. 2017 ఆర్థిక సంవత్సరానికి పైలింగ్ గడువును ఆగస్టు 5 వరకూ పెంచారు. జులై 31 నాటికి ఇంకా కోటి మందికి పైగా రిటర్నులు దాఖలు చేయలేదు. మా ఆదాయం పన్ను పరిధిలో లేదని చాలా మంది రిటర్నుల గురించి పట్టించుకోరు. చాలా ఆర్థిక లావాదేవీల్లో ఐటీ రిటర్నుల ఫారం ఉపయోగపడుతున్నందున ఆదాయం పరిమితికి మించి లేకపోయినా రిటర్నులు దాఖలు చేయడం మంచిది. ఏయే సందర్భాల్లో ఐటీ రిటర్నులు మనకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

1. ఆర్థిక సంస్థల నుంచి రుణం దరఖాస్తు చేసుకునేటప్పుడు
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గత మూడేళ్ల ఐటీ రిటర్నుల నకళ్లను ఆదాయం రుజువుగా అడుగుతాయి. ఇది దరఖాస్తుదారు చెల్లింపు సామర్థ్యం మీద ఆక అవగాహనను తెచ్చేందుకు మాత్రమే. అసలు, వడ్డీ కలిపి చాలా అవుతుంది కాబట్టి ఆదాయం ఎంత ఉందనే దాన్ని బట్టి బ్యాంకులు రుణ దరఖాస్తు దారుని గురించి ఒక అవగాహనకు వస్తాయి. దాదాపుగా గృహ రుణం, వాహన రుణం దేనికైనా ఐటీఆర్‌ను అడుగుతుంటారు.

2. వీసా ప్రాసెసింగ్
గత 2,3 ఏళ్ల ఐటీ రిటర్నులను ఫైల్ చేసిన తర్వాత వీసా దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఎందుకంటే దరఖాస్తుదారు చెల్లించిన పన్నులకు ఒక రుజువుగాను, స్థిర ఆదాయానికి ఒక రుజువుగాను ఇది ఉంటుంది.

3. స్థిరాస్తి రిజిస్ట్రేషన్
దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థిరాస్తి కొనుగోలు, రిజిస్ట్రేషన్ సమయాల్లో ఐటీఆర్ ఫారంను అడుగుతున్నాయి. మీరు కొన్న స్థిరాస్తి వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ వారు ఆదాయపు పన్ను శాఖకు పంపుతారని గుర్తుంచుకోండి.

4. బీమా, క్రెడిట్ కార్డుల దరఖాస్తు సమయంలో
కొన్ని చిన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ దరఖాస్తు దారుల స్తోమతను తెలుసుకునేందుకు ఐటీఆర్‌లను అడుగుతాయి. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు సైతం ఐటీఆర్ డాక్యుమెంట్లను అడుగుతాయి. ఇప్పటికీ ఐటీఆర్ రిటర్నులు ఎందుకు సమర్పించాలని అని అనుకునే వారు కనీసం ఈ సందర్భాల్లో పనికొస్తుందనే భావనతోనైనా ఐటీఆర్ రిటర్నులను సమర్పిస్తే వారికే మంచిది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications