For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిట‌ర్నులు: ఈ విష‌యాల్లో జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. .. ...

చాలా సార్లు ప‌న్ను చెల్లింపుదార్లు ఆర్థిక సంవ‌త్స‌రం, మ‌దింపు సంవ‌త్స‌రం మ‌ధ్య తిక‌మ‌క ప‌డుతూ ఉంటారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం 2017-18 అని గుర్తుంచుకోండి. ఈ వివ‌రాలు స‌రిగా ఇవ్వ‌కుండా ఒక సంవ‌త్స‌రం రాయాల్స

|

ప‌న్నులు క‌ట్టే వారంతా ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేయ‌డం ముఖ్యం. మీరు స‌మ‌యానికి స‌రైన ప‌న్ను చెల్లించిన‌ప్ప‌టికీ పెనాల్టీలు ప‌డ‌కూడ‌దంటే ప‌న్ను రిట‌ర్నుల‌ను మాత్రం గ‌డువు లోపు స‌మ‌ర్పించాలి. మొద‌టిసారి రిట‌ర్నులు ఫైల్ చేయ‌డానికి సిద్ద‌మైన‌వారికి కాస్త భ‌యంగా ఉన్నా, ఏదో కాస్త స‌రికొత్త అనుభూతి కూడా ఉంటుంది.
ఐటీ రిట‌ర్నుల‌కు డ్యూ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించాల‌ని గుర్తుంచుకోవాలి. మీరు ఇప్ప‌టికీ రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే ఏ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాలో తెలుసుకుందాం.

1. డాక్యుమెంట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌

1. డాక్యుమెంట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌

అన్ని ప‌త్రాల‌ను స‌ర్దుకొని వేటిపై సంత‌కాలు చేయాలో తెలుసుకుని ఉండాలి. వ్యాపార వ‌ర్గాలు, స్వ‌యం ఉపాధి వారు రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు కొన్ని వివ‌రాల‌ను నింపాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కేవ‌లం మీరు వేటిని నింపాలో చూసుకుని మిగిలిన వాటిని వ‌దిలేయండి. అవ‌స‌ర‌మైతే గ‌తేడాది పెట్టుబ‌డి వివ‌రాల‌ను, ఇత‌ర ఆదాయ వివ‌రాలు, ప‌న్ను ర‌సీదుల‌ను ముందు పెట్టుకోండి.

2. స‌రైన ఐటీ ఫారంను ఎంచుకోవాలి

2. స‌రైన ఐటీ ఫారంను ఎంచుకోవాలి

మీరు పొందే ఆదాయాన్ని బ‌ట్టి స‌రైన ఐటీ ఫారం ఎంచుకుని దాన్ని నింపడం మొద‌లుపెట్టండి.

మీ ఆదాయ మార్గాల‌ను బ‌ట్టి ఏ ఫారంను వాడాలో, వాడ‌కూడ‌దో ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్లో ఫారంల గురించి స్ప‌ష్టంగా పేర్కొంటారు. ఒక‌సారి మీకు స‌రిప‌డా ఫారంను ఎంచుకుంటే రిట‌ర్నులు ఫైల్ చేయ‌డం సులువే.

3. లెక్క‌ల‌న్నీ ఒక‌సారి స‌రిచూసుకోవాలి

3. లెక్క‌ల‌న్నీ ఒక‌సారి స‌రిచూసుకోవాలి

ఫైలింగ్ స‌మ‌యంలో అన్ని వివ‌రాల‌ను నింపి స‌బ్‌మిట్ చేసే ముందు ఒక‌టికి రెండు సార్లు సంఖ్య‌ల‌న్నీ స‌రిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. దీని వ‌ల్ల మీరు అన్ని త‌ప్పులు లేకుండా ఇస్తున్నారో లేదో తెలుస్తుంది. మ‌రో విష‌యం ఫారం-16లో ఉన్న వాటితో ఇవి స‌రిపోలుతున్నాయో లేదో తెలుసుకోవ‌చ్చు.

4. ఫారం 26ఏఎస్‌

4. ఫారం 26ఏఎస్‌

ఫారం 26ఏఎస్‌లో ప‌న్ను సంబంధిత స‌మాచార‌మైన టీసీఎస్‌, టీడీఎస్‌, రీఫండ్ వివ‌రాలుంటాయి. మీ త‌ర‌పున కంపెనీ వ‌సూలు చేసే ప‌న్ను, ఇత‌ర సంస్థ‌లు ప‌న్ను క‌ట్టినా ఆ వివ‌రాల‌ను 26ఏఎస్ ద్వారా తెలుసుకుని వెరిఫై చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ప‌న్ను వివ‌రాలు స‌రిపోల్చిన వార‌వుతారు. అంతే కాకుండా ఎక్క‌డా ఏదో ఇత‌ర ఆదాయ మార్గాన్ని విడిచే వీల్లేకుండా చూసుకోవ‌చ్చు. ఒక వేళ మీకు తెలియ‌కుండా, మ‌రిచిపోయి ఏదైనా వివ‌రాల‌ను దాచినా ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. ఒక్కోసారి పెనాల్టీలు విధించినా క‌ట్టాల్సిందే.

5. ఇత‌ర ఆదాయాలను చూపాలి

5. ఇత‌ర ఆదాయాలను చూపాలి

ఎక్కువ మంది చేసే త‌ప్పు ఇత‌ర ఆదాయ మార్గాల‌ను చూప‌క‌పోవ‌డం. మీరు ఫారం నింపుతున్న‌ప్పుడు మీకు 'Income from other sources' అనే కాలమ్ క‌నిపిస్తుంది. మీ రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ చూప‌డంతో పాటు సంవ‌త్స‌రంలో ఇత‌ర ఆదాయాలు ఏమైనా ఉంటే వాటి వివ‌రాలు ఇవ్వాలి. ఫారం 26ఏఎస్‌లో ఒకవేళ ఇచ్చి ఉండ‌క‌పోయినా మీరు మాత్రం ఇత‌ర ఆదాయాల వివరాలను ఇవ్వాల‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ చెబుతున్న‌ది.

6. టీడీఎస్‌, ప‌న్ను

6. టీడీఎస్‌, ప‌న్ను

మీకు యాజ‌మాన్యం వేత‌నం ఇచ్చేట‌ప్పుడు టీడీఎస్ మిన‌హాయించిన త‌ర్వాతే మీ బ్యాంకు ఖాతాకు సొమ్ము జ‌మ చేస్తుంది. మీ ఫారం 26 ఏఎస్‌లో కొన్నిసార్లు టీడీఎస్ వివ‌రాలు సంపూర్తిగా ఉండ‌క‌పోవ‌చ్చు. ఫారం 26ఏఎస్‌లో ఉన్నా, లేక‌పోయినా మీకు టీడీఎస్ మిన‌హాయించ‌బ‌డుతున్న‌ట్లు ఏదైనా రుజువుంటే మీ అర్హ‌త‌ను బ‌ట్టి టీడీఎస్ మ‌ళ్లీ వెన‌క్కు వ‌చ్చే విధంగా క్లెయిం చేసుకోవ‌చ్చు.

7. ఈ-ఫైలింగ్ త‌ర్వాత‌, ఐటీఆర్ వెరిఫై చేయండి

7. ఈ-ఫైలింగ్ త‌ర్వాత‌, ఐటీఆర్ వెరిఫై చేయండి

ఇంత‌కు ముందు ఫైలింగ్ పూర్త‌యిన త‌ర్వాత బెంగుళూరు ఇన్‌క‌మ్ ట్యాక్స్ కార్యాల‌యానికి పంపేవారు. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేదు. ఆన్‌లైన్ మార్గం వ‌ద్ద‌నుకునే వారు, వీలు కాని వారు ఇలా స్పీడ్ పోస్ట్ ద్వారా పంప‌వ‌చ్చే. లేక‌పోతే ఎవ‌రికైనా ఈ-వెరిఫై చేసుకునేందుకు ఆదాయపు ప‌న్ను శాక అవ‌కాశ‌మిచ్చింది. నెట్‌బ్యాంకింగ్, ఆధార్‌; లేదా మొబైల్ నంబ‌రు, మెయిల్ సాయంతో ఈ-వెరిఫై ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. మీ నుంచి ఐటీఆర్‌-V అందిన తర్వాత మాత్ర‌మే ప‌న్ను రిట‌ర్నుల స్టేట‌స్‌ను చూసేందుకు వీలు క‌లుగుతుంది. అంద‌కే రిట‌ర్నులు ఫైల్ చేసిన త‌ర్వాత ఈ-వెరిఫై చేయ‌డం మ‌ర‌వ‌కండి.

8. ట్యాన్‌, బ్యాంక్ ఖాతా సంఖ్య‌, మెయిల్ ఐడీ వివరాల్లో త‌ప్పులొద్దు

8. ట్యాన్‌, బ్యాంక్ ఖాతా సంఖ్య‌, మెయిల్ ఐడీ వివరాల్లో త‌ప్పులొద్దు

మీ రిట‌ర్నుల ప్రాసెసింగ్ సరిగ్గా జ‌రిగి, స‌మ‌యం లోపు రీఫండ్‌లు రావాలంటే మొద‌ట్లోనే మీరు వివ‌రాల‌ను సంపూర్తిగా ఇవ్వాలి.

బ్యాంకు వివ‌రాలు ఇచ్చేట‌ప్పుడు పేరు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, ఖాతా నంబ‌రు వంటివి త‌ప్పుల్లేకుండా చూసుకోండి.

9. ట్యాన్ నంబ‌రు స‌రిగా ఉందా, లేదో ఒక‌టికి రెండు సార్లు స‌రిచూసుకోండి.

9. ట్యాన్ నంబ‌రు స‌రిగా ఉందా, లేదో ఒక‌టికి రెండు సార్లు స‌రిచూసుకోండి.

పోస్ట‌ల్ అడ్ర‌స్ లేదా మెయిల్ ఐడీ వంటివాటిలో త‌ప్పులుంటే మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు, రీఫండ్ చెక్కులు స‌రిగా అంద‌క‌పోవ‌చ్చు.

మొబైల్ నంబ‌రు శాశ్వ‌తంగా ఉండేదాన్నే ఇవ్వండి. లేక‌పోతే మీకు రిట‌ర్నులు, ప్రాసెసింగ్ సమాచారాన్ని అంద‌జేయ‌లేరు.

 10. మిన‌హాయింపుల క్లెయిం

10. మిన‌హాయింపుల క్లెయిం

ప‌న్నులు త‌గ్గించుకోవాల‌నుకుంటే మిన‌హాయింపుల‌ను ఉప‌యోగించుకోవ‌డం ముఖ్యం. సెక్ష‌న్ 80 కింద ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం చాలా మిన‌హాయింపుల‌కు అవ‌కాశం క‌ల్పించింది. కొన్నింటికి ఎటువంటి రుజువులు స‌మ‌ర్పించే అవ‌సరం లేకుండా అవ‌కాశ‌మిస్తారు. అలాంటి మిన‌హాయింపుల‌కు అవకాశ‌ముంటే ఉప‌యోగించుకోండి. మీరు క్లెయిం స‌మ‌యంలో ఈ మిన‌హాయింపుల వివ‌రాలు పేర్కొన‌క‌పోతే త‌ర్వాత వాటికి సంబంధించి ఐటీ శాఖ అనుమ‌తించ‌దు.

11. మిన‌హాయింపు వివ‌రాలను పేర్కొన‌క‌పోతే

11. మిన‌హాయింపు వివ‌రాలను పేర్కొన‌క‌పోతే

ప‌న్ను మిన‌హాయింపులు పొందిన ఆదాయ వివ‌రాల‌ను చాలా మంది స‌రిగా చూప‌రు. డివిడెండ్లు, పీపీఎఫ్ వ‌డ్డీ, దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వంటి వాటిని ఆదాయంలో భాగంగా చూపాల్సిందే. కావాలంటే త‌ర్వాత మిన‌హాయింపుల‌కు అవ‌కాశ‌మున్న చోట్ల క్లెయిం చేసుకోవ‌చ్చు. ఐటీఆర్ ప్రాసెసింగ్‌లో ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కూడ‌దంటే ఆ ఆదాయాల‌న్నీ చూపాల‌ని గుర్తుంచుకోండి.

12. సంవ‌త్స‌రం రాసేట‌ప్పుడు

12. సంవ‌త్స‌రం రాసేట‌ప్పుడు

చాలా సార్లు ప‌న్ను చెల్లింపుదార్లు ఆర్థిక సంవ‌త్స‌రం, మ‌దింపు సంవ‌త్స‌రం మ‌ధ్య తిక‌మ‌క ప‌డుతూ ఉంటారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం 2017-18 అని గుర్తుంచుకోండి. ఈ వివ‌రాలు స‌రిగా ఇవ్వ‌కుండా ఒక సంవ‌త్స‌రం రాయాల్సిన చోట మ‌రోటి రాస్తే ప‌న్ను లెక్కింపు వివ‌రాల్లో చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి మీ ఐటీ రిట‌ర్నుల్లో సంవ‌త్స‌రాల వివ‌రాలు స‌రిగా న‌మోదు చేయండి.

Read more about: it returns taxes income tax tax
English summary

ఐటీ రిట‌ర్నులు: ఈ విష‌యాల్లో జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. .. ... | Be careful in these aspects file filing IT returns for the first time

By keeping this list of dos and don'ts in the back of your mind, while filing your tax returns, you can make your tax filing go smoothly, and there will be no complications with your tax return. If you still come to realise that you have made a mistake, after filing your tax returns, the I-T department gives you a chance to revise your tax return and resubmit it.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X