English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పీఎఫ్ ఖాతా ఉంటే ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ప్రావిడెంట్ ఫండ్ అనేది భారత ప్రభుత్వ సామాజిక భద్రతా కార్యక్రమం. ఈ నిధిని భారత ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ‌(భారత ప్రభుత్వ చట్టబద్ధ శాఖ) ద్వారా అమలుచేస్తున్నారు. ఈ ఫండ్ లో యజమాని (సంస్థ యొక్క యజమాని) మరియు ఉద్యోగి వేతనం నుంచి తప్పనిసరిగా పొదుపు ఉండాలి. వృద్దాప్యం లేదా అత్యవసర పరిస్థితిలో ఈ ఫండ్ ఉపయోగించుకోవడానికి ఉద్యోగికి అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివిధ ఆన్ లైన్ సేవలను విస్తరిస్తుంది. ఉద్యోగులు క్రింది సేవల లబ్దిని పొందవచ్చు.

పిఎఫ్ ఖాతా నిల్వ.

పిఎఫ్ లావాదేవీల పాస్ పుస్తకం.

ఫైల్ ఆన్‌లైన్‌ బదిలీ.

ఇతర సేవలు.

పీఎఫ్ ఖాతా క‌లిగి ఉండ‌టం ద్వారా క‌లిగే 10 ప్ర‌యోజ‌నాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

1. మీకు కావాల్సినంత సొమ్మును పీఎఫ్ ఖాతాలో జ‌మ చేసుకోవ‌చ్చు

1. మీకు కావాల్సినంత సొమ్మును పీఎఫ్ ఖాతాలో జ‌మ చేసుకోవ‌చ్చు

సాధార‌ణంగా బేసిక్ శాల‌రీలో 12% మాత్ర‌మే ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కోసం మిన‌హాయిస్తారు. అంత క‌న్నా ఎక్కువ డ‌బ్బును సైతం పీఎఫ్ ఖాతాకు జ‌మ చేసుకోవ‌చ్చు. దాన్ని వాలెంట‌రీ ప్రావిడెంట్ ఫండ్‌గా ప‌రిగ‌ణిస్తారు. అద‌నంగా పెట్టుబ‌డి పెట్టిన పీఎఫ్ సొమ్ముకు సైతం మీకు వ‌డ్డీ వ‌స్తుంది. అయితే ఆ అద‌న‌పు మొత్తానికి స‌మాన‌మైన కంట్రిబ్యూష‌న్‌ను సంస్థ చేయ‌దు. కేవ‌లం మూల‌వేత‌నంలో 12 శాతానికి స‌మాన‌మైన మొత్తాన్ని మాత్ర‌మే మీ యాజ‌మాన్యం మీకు అంద‌జేస్తుంది.

2. అంద‌రూ పౌరుల‌కు ఇది ఉచిత‌మే...

2. అంద‌రూ పౌరుల‌కు ఇది ఉచిత‌మే...

దేశంలో కార్మిక శ‌క్తిలో ఉన్న ఎవ‌రైనా పీఎఫ్ ఖాతాను తెరుచుకోవ‌చ్చు. మీరు స్వ‌యం ఉపాధి క‌లిగి ఉంటే పీపీఎఫ్‌ను ఎంచుకోవ‌చ్చు. మైన‌ర్ పేరిట సైతం పీపీఎఫ్ ఖాతాను త‌ల్లిదండ్రులు తెరిచే వీలుంది. ఎన్ఆర్‌ఐలు సాధార‌ణ భ‌విష్య నిధి(పీఎఫ్‌) ఖాతాను తెర‌వ‌లేరు. ఒక‌వేళ మీరు భార‌తీయులుగా ఉన్న‌ప్పుడు ఖాతా తెరిచి ఉండి త‌ర్వాత ప్ర‌వాస భార‌తీయులైతే ఆ ఖాతా కొన‌సాగించవ‌చ్చు.

3. ఉద్యోగ విర‌మ‌ణ స‌మ‌యంలో వెన‌క్కు

3. ఉద్యోగ విర‌మ‌ణ స‌మ‌యంలో వెన‌క్కు

ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో భ‌విష్య నిధి ఖాతాలోని డ‌బ్బును వెన‌క్కి తీసుకోవ‌చ్చు. అప్పుడు ఉద్యోగి పీఎఫ్ కంట్రిబ్యూష‌న్‌, ఎంప్లాయ‌ర్ కంట్రిబ్యూష‌న్‌, పీఎఫ్ సొమ్ముపై జ‌మ‌యిన వ‌డ్డీ మూడింటిని పొంద‌వ‌చ్చు. పింఛ‌ను సొమ్ము మాత్రం ఒకేసారి తీసుకునేందుకు అనుమ‌తించ‌రు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ప‌దేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నార‌నుకుందాం. మీ పీఎఫ్ ఖాతాలో రూ. 3,50,000 డ‌బ్బు ఉంద‌ని భావిద్దాం. ఇందులో ఈపీఎఫ్‌కు రూ. 2,50,000 పోగా మిగిలిందంతా పింఛ‌ను ఖాతాకు మ‌ళ్లిస్తారు. ఒక‌వేళ 60 ఏళ్ల‌కు ముందే మీరు ఉద్యోగం మానేస్తే మీరు మొత్తం రూ. 3,50,000 పొంద‌లేరు.

4. సంక్షోభ స‌మ‌యంలో పీఎఫ్‌పై రుణం

4. సంక్షోభ స‌మ‌యంలో పీఎఫ్‌పై రుణం

త‌న‌ఖా పెట్టి రుణం తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. మీ వ‌ద్ద ఏ స్థిరాస్తులు లేవు. అలాంటి స‌మ‌యంలో పీఎఫ్ ఖాతా సెక్యూరిటీగా రుణం తీసుకోవ‌చ్చు. పీఎఫ్ ఖాతా తెరిచిన ఏడేళ్ల‌లోపు దానిపై రుణాన్ని పొంద‌వ‌చ్చు. పీఎఫ్ ఖాతా హామీగా తీసుకునే రుణానికి బ్యాంకులు కాస్త త‌క్కువ వ‌డ్డీకే ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ రుణం పొంద‌వ‌చ్చు.

5. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి

5. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి

పీఎఫ్‌ను దీర్ఘకాలిక పెట్టుబ‌డిలో భాగంగా మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగం చేసుకోవ‌చ్చు. పీపీఎఫ్ ఖాతాక‌యితే 15 ఏళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియ‌డ్ ఉండ‌ట‌మే ఈ పెట్టుబ‌డిని మంచి సాధ‌నంగా ఎంపిక చేసుకునేలా చేసింది. 15 ఏళ్ల త‌ర్వాత 5 ఏళ్ల గడువుతో పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకుంటూ వెళ్లొచ్చు.

6. వ‌డ్డీ జ‌మ‌

6. వ‌డ్డీ జ‌మ‌

పీఎఫ్ సొమ్ముపై జ‌మ‌య్యే వ‌డ్డీని ఇంతకుముందు ఏడాదికోసారి నిర్ణ‌యించేవారు. ప్ర‌స్తుతం ప్ర‌తి త్రైమాసికానికి ఒక‌సారి పీఎఫ్ వ‌డ్డీ రేటును ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం భ‌విష్య నిధి(పీఎఫ్‌) ఖాతాపై వ‌డ్డీని 8.65శాతంగా నిర్ణ‌యించారు. ఈ వ‌డ్డీ క‌చ్చితంగా రావ‌డ‌మే కాకుండా న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. వ‌డ్డీ రేటు మారుతున్న‌ప్ప‌టికీ ఒక నిర్ణీత రాబ‌డి మాత్రం వ‌స్తుంది. ఏటా మార్చి,31న మీ పీఎఫ్ వ‌డ్డీ భ‌విష్య నిధి ఖాతాకు జ‌మ అవుతుంది.

7. అత్య‌వ‌స‌రాల్లో వెన‌క్కు తీసుకునే వీలు

7. అత్య‌వ‌స‌రాల్లో వెన‌క్కు తీసుకునే వీలు

పీఎఫ్ సొమ్మును మీ, మీ పిల్ల‌ల వివాహ అవ‌స‌రాలు; వైద్య ఖ‌ర్చులు ; ఇంటి రుణం తీర్చ‌డం కోసం వెన‌క్కు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ కంట్రిబ్యూష‌న్‌లో 50% వ‌ర‌కూ సొమ్మును వివాహ అవ‌స‌రాల నిమిత్తం తీసుకోవ‌చ్చు. వైద్య ఖ‌ర్చుల కోసం మీ వేత‌నానికి 6 రెట్ల సొమ్మును తీసుకోవ‌చ్చు. ఇంటి రుణాన్ని తీర్చేందుకు సొమ్మును వెన‌క్కు తీసుకోవాలంటే మీరు ఉద్యోగం చేస్తుండ‌బ‌ట్టి ప‌దేళ్లు పూర్తి కావాలి. మీ వేత‌నానికి 36 రెట్ల డ‌బ్బును మీ కంట్రిబ్యూష‌న్ నుంచి విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంది.

8. ఈపీఎఫ్ నామినీని నియ‌మించే స‌దుపాయం

8. ఈపీఎఫ్ నామినీని నియ‌మించే స‌దుపాయం

ఈపీఎఫ్ ఖాతాకు నామినీని మీరే స్వ‌యంగా నియ‌మించుకోవ‌చ్చు. భ‌విష్య నిధి చందాదారు అనుకోకుండా మ‌ర‌ణిస్తే నామినీకి పీఎఫ్ సొమ్మును చెల్లిస్తారు. ప్ర‌స్తుతం నామినీ బ్యాంకు ఖాతాకు నేరుగా డ‌బ్బు జ‌మ చేసే స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌లో మార్చే వీలు సైతం ఉంది.

ఈ బీమా మీరు ప్రీమియం చెల్లించ‌క‌పోయినా వ‌ర్తిస్తుంది

9. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్‌) ఖాతా

9. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్‌) ఖాతా

ఇది వేతనజీవులకు, స్యయం ఉపాధి వర్గాలకు అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. దీర్షకాలిక పెట్టుబడి మంచిది. ఓ వ్యక్తి ఏడాదికి లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఐటి చట్టంలోని 80సి సెక్షన్ కింద ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను రిబేట్ లభిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.8 శాతం ఉంది. ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు. మూడేళ్ల తర్వాత రుణం తీసుకునే సౌకర్యం ఉంది.

10. పీపీఎఫ్ ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌

10. పీపీఎఫ్ ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌

మామూలుగా అయితే పీపీఎఫ్ ఖాతా తెరిచి 15 సంవ‌త్స‌రాలు పూర్త‌యితేనే ఖాతా మెచ్యూర్ అవుతుంది. అప్పుడు డ‌బ్బు వెనక్కు తీసుకోవ‌చ్చు. అంత‌కంటే ముందు కావాలంటే 6 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యే వ‌ర‌కూ ఏమీ చేయ‌డానికి ఉండ‌దు. ఏడో సంవ‌త్స‌రం త‌ర్వాత నుంచి పాక్షికంగా డ‌బ్బు ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశ‌మిస్తారు. దీనికి కొన్ని నిబంధ‌న‌లు, ప‌రిమితులు ఉంటాయి.

11. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌

11. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌

అనేక బ్యాంకులు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా పిపిఎఫ్‌ ఖాతాలో డ‌బ్బు జ‌మ చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మీ ఖాతా నుంచి పిపిఎఫ్‌ ఖాతాకి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. కాబట్టి ప్రతీ ఒక్క ఖాతాదారు ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం క‌లిగి ఉన్న బ్యాంకు ఖాతాల‌ను ఎంచుకోవ‌డం మంచిది. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవ‌డం ఎలా?

Read more about: pf, epf, ppf, provident fund, epfo
English summary

11 Reasons Why should you have a pf account

A provident fund functions as a form of social safety net. It is a compulsory government managed retirement savings scheme, into which workers must contribute a portion of their salaries and employers must contribute on behalf of their workers. The money in the fund is then paid out to retirees, or in some cases to the disabled who cannot work.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC