English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మీరు ప్రీమియం చెల్లించ‌క‌పోయినా ఈ బీమా వ‌ర్తిస్తుంది!

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

చాలామంది ఉద్యోగులు పీఎప్‌ను అన‌వ‌స‌ర‌మైన‌దిగా భావిస్తుంటారు. అంతే కాకుండా ఇందులో వ‌డ్డీ త‌క్కువ ఉండ‌టం కార‌ణంగా పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌నుకుంటారు. అయితే పీఎఫ్ వ‌ల్ల ల‌భించే అన్ని ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ప‌రిస్థితి ఇలా ఉండ‌దు. వ్య‌వ‌స్థీకృత రంగంలో ప‌నిచేస్తూ ప్రతి నెలా పీఎఫ్ కోసం డ‌బ్బు చెల్లిస్తున్న వారికి సాధార‌ణంగా జీవిత బీమా వ‌ర్తిస్తుంది. అయితే ఈ ఉద్దేశం కోసం ఉద్యోగి బేసిక్ శాల‌రీ, క‌రువు భ‌త్యం రెండూ క‌లిపి రూ. 15 వేల లోపు ఉండాలి. పీఎఫ్ సౌక‌ర్యం క‌లిగిన ఉద్యోగుల కోసం ప్ర‌భుత్వం ఈడీఎల్ఐ(ఎంప్లాయి డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్‌) సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తుంది. ఉద్యోగులు ప్ర‌తి నెలా పీఎఫ్ కోసం కొంత డ‌బ్బు చెల్లిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన డిపాజిట్ సొమ్ముతోనే ఈ బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తారు. దాని గురించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం.

ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్‌

ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్‌

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) చందాదారులు కానివారు ఇందులో అందరూ చేరడానికి అవకాశం లేదు. ఇది తమ ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించే పథకం. నేరుగా మీ జీతం నుంచి నిర్ణీత మొత్తాన్ని మిన హాయించి దానిని ఆ సంస్థ భవిష్యనిధికి జమ చేస్తుంది. ఇలా జమ చేసిన మొత్తంలో 8.3 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంకు జమ చేయడం జరుగుతుంది. అలాగే ఈపీఎఫ్‌లో సభ్యులుగా ఉంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) సౌకర్యం కూడా ఉంటుంది. ఈడీఎల్ఐ అంటే మీరు చెల్లించే పీఎఫ్ సొమ్ములో నిర్ణీత మొత్తాన్ని చెల్లించ‌డం ద్వారా ప్ర‌తి ఉద్యోగికి బీమా క‌ల్పించ‌డం.

ప్ర‌స్తుతం బీమా క‌వ‌రేజీ రూ. 6ల‌క్ష‌లు

ప్ర‌స్తుతం బీమా క‌వ‌రేజీ రూ. 6ల‌క్ష‌లు

కంపెనీలు ప్ర‌త్యేకంగా జీవిత బీమా క‌ల్పిస్తూ ఉంటే ఈ సౌక‌ర్యం అవ‌స‌రం లేద‌ని ఈపీఎఫ్‌వోను కోర‌వ‌చ్చు. 2015 వ‌ర‌కూ ఈ బీమా త‌క్కువ‌గా ఉండేది సెప్టెంబ‌రు నెల‌లో విడుద‌లైన నోటిఫికేష‌న్ ప్ర‌కారం బీమా క‌వరేజీని రూ. 6 ల‌క్ష‌లకు పెంచారు. కుటుంబ స‌భ్యులు పీఎఫ్ చందాదారుడి వేత‌నానికి 30 రెట్ల సొమ్మును వారి మ‌ర‌ణ స‌మ‌యంలో క్లెయిం చేసుకునే వీలుంది. ఇంకా పీఎఫ్ ఖాతాలో ఉన్న‌దాంట్లో స‌గం లేదా రూ. 1.5 లక్ష‌లు(వీటిలో ఏది త‌క్కువైతే అది) బోన‌స్‌గా క్లెయిం చేసుకోవ‌చ్చు. మొత్తం అంతా క‌లిపి రూ. 6 లక్ష‌ల ప‌రిమితి ఉంటుంది. అనుకోని ప‌రిస్థితుల్లో ఉద్యోగి మ‌ర‌ణిస్తే నామినీలు ఈ డ‌బ్బును క్లెయిం చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ నామినీ లేక‌పోతే వార‌సులు దీన్ని క్లెయిం చేసుకోవ‌చ్చు.

ఈడీఎల్ఐ అవ‌స‌రం ఏమిటి?

ఈడీఎల్ఐ అవ‌స‌రం ఏమిటి?

ఇది ఒక సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కం. ఉద్యోగం చేస్తున్న వ్య‌క్తి కుటుంబానికి భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఇది అవ‌స‌రం. దేశం కోసం శ్ర‌మిస్తున్న కార్మికుల ఆర్థిక ర‌క్ష‌ణ కోసం ఈ ప‌థకాన్ని ప్రారంభించారు. భార‌తదేశంలో చాలా మంది జీవిత బీమా అవ‌స‌రాన్ని స‌రిగా గుర్తించ‌రు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక ప్ర‌ణాళిక‌కు ప్రాధాన్య‌మివ్వ‌రు. అందుకోస‌మే ప్ర‌భుత్వం సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. ఇందులో భాగంగా పీఎఫ్‌, ఉద్యోగ పింఛ‌ను ప‌థ‌కాల‌ను క‌చ్చితంగా తీసుకోవాల్సిందిగా ష‌ర‌తు పెట్టారు. ఇవ‌న్నీ

వ్య‌వ‌స్థీకృత రంగంలో ప‌నిచేసే వారికే. అదే విధంగా ప్ర‌భుత్వం అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష యోజ‌న‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్ వంటి వాటిని సైతం ప్రారంభించింది.

ఈడీఎల్ఐ కోసం స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌డం ఎలా?

ఈడీఎల్ఐ కోసం స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌డం ఎలా?

ఈడీఎల్ఐ అనేది ఈపీఎఫ్‌, ఎంప్లాయ్ పెన్ష‌న్ స్కీమ్‌లతో ముడిప‌డి ఉంటుంది. ఉద్యోగి ఈ మూడింటికి ఒకేసారి స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ఎవ‌రైనా ఈపీఎఫ్ ప‌రిధిలో ఉన్నారంటే ఆటోమేటిక్‌గా వారు ఈడీఎల్ఐ ప‌థ‌కానికి స‌బ్‌స్కైబ్ చేసుకున్న‌ట్లే. ఉద్యోగి, ఉద్యోగ భ‌విష్య నిధి ప‌థ‌కాల్లో భాగ‌మ‌య్యేలా చూడాల్సిన బాధ్య‌త ఆయా సంస్థ‌ల‌దే. మీరు ఉద్యోగం మారిన‌ప్పుడ‌ల్లా ఈ ప‌థ‌కాలు ఒక సంస్థ నుంచి మ‌రో సంస్థ‌కు మారుతూ ఉంటాయి.

ఈడీఎల్ఐ కోసం కేటాయింపు

ఈడీఎల్ఐ కోసం కేటాయింపు

ఈ ప‌థ‌కం కోసం ఉద్యోగి ప్ర‌త్యేకంగా కేటాయించే అవ‌స‌రం లేదు. ఇందుకోసం ఉద్యోగం క‌ల్పించే సంస్థ‌లే కొంత మొత్తాన్ని కేటాయిస్తాయి. ఇది ఈపీఎఫ్ కంట్రిబ్యూష‌న్‌తో క‌ల‌గ‌లిసి ఉంటుంది. ఇందుకోసం ఒక ఫార్ములా ఉంటుంది. మీ వేత‌నంలో ఇది ఒక ఫిక్స్‌డ్ ప‌ర్సంటేజీ లాగా ఉంటుంది.

ఉద్యోగి సంస్థ‌
ఈపీఎఫ్ 12% ఎంప్లాయ్ కంట్రిబ్యూష‌న్-ఈపీఎస్ కంట్రిబ్యూష‌న్‌
ఈపీఎస్ - 8.33%
ఈడీఎల్ఐ - 0.5%(గ‌రిష్టంగా రూ.75 వ‌ర‌కూ)

ఈడీఎల్ఐ బీమా హామీ మొత్తాన్ని ఎవ‌రు క్లెయిం చేసుకోవ‌చ్చు?

ఈడీఎల్ఐ బీమా హామీ మొత్తాన్ని ఎవ‌రు క్లెయిం చేసుకోవ‌చ్చు?

అ. నామినీ స‌భ్యులు

ఆ. ఒక‌వేళ నామినీ లేక‌పోతే, కుటుంబ స‌భ్యులు

ఇ. ఒక‌వేళ కుటుంబ స‌భ్యులు, నామినీ ఎవ‌రూ లేకుంటే చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సులు

ఈ. మైన‌ర్ నామినీకి సంబంధించిన చ‌ట్ట‌బ‌ద్ధ సంర‌క్ష‌కుడు

ఎలా క్లెయిం చేసుకోవాలి?

ఎలా క్లెయిం చేసుకోవాలి?

నామినీ లేదా క్లెయిం చేసుకోద‌లిచిన వారు ఫారం 20, 10డీ/సీ స‌బ్‌మిట్ చేయాలి. ఉద్యోగం క‌ల్పించిన సంస్థ ద్వారా క‌మిష‌న‌ర్‌కు స‌మ‌ర్పించాలి. వివ‌రాల‌న్నీ క్యాపిట‌ల్ లెట‌ర్స్‌లో రాయాలి. పై రెండింటితో పాటు అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను ఎన్‌క్లోజ్ చేయాలి.

స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు

స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు

మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

మైన‌ర్ త‌ర‌పున క్లెయిం చేస్తుంటే సంర‌క్ష‌కులుగా ఉన్న సర్టిఫికెట్‌

చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సులైతే దాన్ని నిరూపించే స‌ర్టిఫికెట్‌

బ్యాంకు ఖాతా వివ‌రాల కోసం క్యాన్సిల్డ్ లేదా బ్లాంక్ చెక్కు

ఇత‌ర స‌మాచారం

ఇత‌ర స‌మాచారం

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం 0.1 శాతం వడ్డీ తగ్గించడంతో 2016-17 మూడో త్రైమాసికంలో రూ.69.34 కోట్ల మిగులు ఏర్పడింది. గతేడాది వడ్డీ రేటునే కొనసాగిస్తామని కేంద్ర కార్మిక శాఖ తెలిపినట్లు ఇటీవలే పీటీఐ వెల్లడించింది. 2016 మార్చి 31 నాటికి ఈడీఎల్ఐ అడ్మినిస్ట్రేషన్ ఖాతాల్లోని రూ.2,372.83 కోట్లకు రూ.17.5 కోట్ల వడ్డీ చెల్లించారు. ఇటీవ‌లే ఈపీఎఫ్ ఖాతాలో నిల్వ‌పై వ‌డ్డీని 8.80 నుంచి 8.65 శాతానికి తగ్గించిన సంగ‌తి తెలిసిందే.

Read more about: edli, epf
English summary

What is EDLI ? Details about Employee Deposit Linked Insurance Scheme

EDLI or employee deposit linked Scheme is an insurance policy to give life cover to the employees of organised sector. It is a group term insurance. The family of employee gets the sum assured if an employee  dies during the service period. The scheme is applicable to all the organisation which are part of the EPF. The term and condition of this scheme is set by the employees provident fund organisation.
Story first published: Friday, December 23, 2016, 12:02 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC