For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆదాయాల‌పై ప‌న్ను ఉండ‌దు

కొన్ని ర‌కాల ఆదాయాల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మీరు క‌నుక ఈ మార్గాల ద్వారా ఆదాయం ఆర్జిస్తుంటే వాటికి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌క్క‌ర్లేదు. అటువంటి జాబితా ఇక్క‌డ చూడండి.

|

కొన్ని ర‌కాల ఆదాయాల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మీరు క‌నుక ఈ మార్గాల ద్వారా ఆదాయం ఆర్జిస్తుంటే వాటికి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌క్క‌ర్లేదు. అటువంటి జాబితా ఇక్క‌డ చూడండి.

1. షేర్లు, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి వ‌చ్చే డివిడెండ్ల‌పై:

1. షేర్లు, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి వ‌చ్చే డివిడెండ్ల‌పై:

భార‌త‌దేశ కంపెనీ షేర్ల‌లో మీరు పెట్టుబ‌డి పెట్టి ఉండి, దానిపై డివిడెండ్ వ‌స్తే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(34) ప్ర‌కారం మీకు ప‌న్ను ఉండ‌దు. ఇది డివిడెండ్ సొమ్ముకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. డివిడెండు మీద మ‌న‌కు ఎందుకు ప‌న్ను ప‌డ‌దంటే ఇదివ‌ర‌కే కంపెనీ లాభం మీద ప‌న్ను చెల్లిస్తుంది కాబ‌ట్టి. అదే విధంగా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్‌పై వ‌చ్చే డివిడెండ్ మీద సైతం ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు. విదేశీ కంపెనీల మీద వ‌చ్చే డివిడెండ్ల‌పై ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌వేళ డివిడెండ్‌పై భార‌త‌దేశంలోనూ, సంస్థ ఉన్న మాతృదేశంలోనూ రెండు చోట్లా ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తే, డ‌బుల్ ట్యాక్సేష‌న్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్ర‌కారం మిన‌హాయింపు కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. లేదా సెక్ష‌న్ 91 ప్ర‌కారం ప‌న్ను రీఫండ్ కోసం క్లెయిం చేయ‌వ‌చ్చు.

2. జీవిత బీమా హామీ మొత్తంపై(ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ క్లెయిం)

2. జీవిత బీమా హామీ మొత్తంపై(ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ క్లెయిం)

బోన‌స్‌తో పాటు ఇన్సూరెన్స్ పాల‌సీని క్లెయిం చేసిన‌ప్పుడు వ‌చ్చే బీమా హామీ మొత్త‌మ మీద ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. ఇందుకోసం ప్రీమియం చెల్లింపు నిబంధ‌న‌లు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలో సూచించిన విధంగా ఉండాలి. మార్చి 2012 వ‌ర‌కూ జారీ చేసిన పాల‌సీల విష‌యంలో బీమా హామీ మొత్తంలో ప్రీమియం 20 శాతానికి మించి ఉండ‌కూడ‌దు. ఏప్రిల్ 1, 2012 నుంచి జారీ చేసిన పాల‌సీల‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భించేందుకు బీమా హామీ మొత్తంలో ప్రీమియం శాతాన్ని 10 శాతానికి త‌గ్గించారు. ఈ ప‌న్ను మిన‌హాయింపు కేవ‌లం ఎండోమెంట్ పాల‌సీల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంది. ఈ ష‌ర‌తుల ప‌రిధిలో మీ పాల‌సీ లేక‌పోతే మూలం వ‌ద్ద 2 శాతం ప‌న్ను చెల్లించాల్సిందే(రూ. 1 ల‌క్ష పైన మెచ్యూరిటీ క్లెయిం ఉంటే)

3. స్కాల‌ర్‌షిప్ లేదా గ్రాంట్‌

3. స్కాల‌ర్‌షిప్ లేదా గ్రాంట్‌

మీ విద్యావ‌స‌రాల కోసం విద్యార్థిగా ఉన్న‌ప్పుడు అందుకునే ఉప‌కార‌వేత‌నం(స్కాల‌ర్‌షిప్‌) లేదా గ్రాంట్ల‌పై ఎటువంటి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు.

4. ప్ర‌భుత్వ నోటిఫైడ్‌ బాండ్ల నుంచి వ‌చ్చే వ‌డ్డీ

4. ప్ర‌భుత్వ నోటిఫైడ్‌ బాండ్ల నుంచి వ‌చ్చే వ‌డ్డీ

ప్ర‌భుత్వం నోటిఫై చేసే బాండ్ల నుంచి వ‌చ్చే వ‌డ్డీకి ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొన్ని ప్ర‌భుత్వ రంగ కంపెనీలు మౌలిక ప్రాజెక్టుల కోసం జారీ చేసే ప‌న్ను ర‌హిత బాండ్లపై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయానికి ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపుల‌ను క‌ల్పించింది. ఈ త‌ర‌హా బాండ్ల‌పై వ‌చ్చే వ‌డ్డీకి మీరు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు. అయితే మెచ్యూరిటీ తీర‌క‌ముందే ఈ బాండ్ల‌ను ఎక్స్చేంజీల్లో అమ్మేసి రాబ‌డులు ఆర్జిస్తే మూల‌ధ‌న రాబ‌డుల‌పై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

5. వ్య‌వ‌సాయ ఆదాయం (అగ్రిక‌ల్చ‌ర్ ఇన్‌క‌మ్‌)

5. వ్య‌వ‌సాయ ఆదాయం (అగ్రిక‌ల్చ‌ర్ ఇన్‌క‌మ్‌)

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(1) ప్ర‌కారం వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ద్వారా వ‌చ్చే ఆదాయం లేదా పొలాన్ని కౌలుకు ఇవ్వ‌డం ద్వారా సంక్ర‌మించే ఆదాయాల‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే వ్య‌వ‌సాయం రూపేణా వ‌చ్చే ఆదాయాన్ని మొత్తం ఆదాయానికి క‌లుపుతారు. ఆదాయ‌పు ప‌న్ను శ్లాబు లెక్కించేట‌ప్పుడు మొత్తం ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ప‌న్ను చెల్లింపు చేయాలి.

6. భాగ‌స్వామ సంస్థ నుంచే వ‌చ్చే లాభంలో వాటాపై

6. భాగ‌స్వామ సంస్థ నుంచే వ‌చ్చే లాభంలో వాటాపై

మీరు ఒక సంస్థ‌లో భాగ‌స్వామిగా ఉంటూ లాభాల్లో వాటాల‌ను స్వీక‌రిస్తూ ఉంటే దానిపై ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు. ఈ లాభానికి సంస్థ ప‌న్ను చెల్లిస్తుంది కాబ‌ట్టి మ‌ళ్లీ వ్య‌క్తులు చెల్లించ‌న‌క్క‌ర్లేదు.

7. ఎన్ఆర్ఈ ఖాతా(నాన్ రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ అకౌంట్)పై వ‌చ్చే వ‌డ్డీకి

7. ఎన్ఆర్ఈ ఖాతా(నాన్ రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ అకౌంట్)పై వ‌చ్చే వ‌డ్డీకి

ఒక వ్య‌క్తి విదేశంలో నివాసం ఉన్నంత వ‌ర‌కూ(ప‌ర్స‌న్ రెసిడెంట్ అవుట్‌సైడ్ ఇండియా) ఫెమా,1999 ప్ర‌కారం ఎన్ఆర్‌ఈ ఖాతాలో వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు.

8. లీవ్ ట్రావెల్ క‌న్సెష‌న్‌(ఎల్‌టీఏ)

8. లీవ్ ట్రావెల్ క‌న్సెష‌న్‌(ఎల్‌టీఏ)

వేత‌నంలో భాగంగా మీరు ఎల్‌టీఏను పొందితే దానికి ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఇందుకోసం హెచ్ఆర్‌ఏ లాగా మీరు ప్ర‌త్యేకంగా మిన‌హాయింపు కోసం క్లెయిం చేయ‌న‌క్క‌ర్లేదు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(5) ప్ర‌కారం దేశీయ ప్ర‌యాణాల ఖ‌ర్చుల‌ను చూపించుకోవ‌చ్చు. ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల్లో రెండు సార్లు ఎల్‌టీఏ పన్ను మిన‌హాయింపు సౌక‌ర్యాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

 9. లీవ్ శాల‌రీ (సెల‌వు వేత‌నం)

9. లీవ్ శాల‌రీ (సెల‌వు వేత‌నం)

ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేట‌ప్పుడు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ద్వారా వ‌చ్చే సొమ్ముకు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌భుత్వం వెల్ల‌డించిన దాని ప్రకారం దాని ప‌రిమితి రూ. 3 లక్ష‌లుగా ఉంది. అంటే అంత‌లోపు వ‌చ్చే దానికి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు. అంత‌కు పైబ‌డి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటే ప‌న్ను చెల్లించాల్సిందే.

10. పొదుపు ఖాతాపై వ‌చ్చే వ‌డ్డీ

10. పొదుపు ఖాతాపై వ‌చ్చే వ‌డ్డీ

పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ముపై వ‌చ్చే వ‌డ్డీకి రూ.10 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అంటే ఆదాయ‌పు ప‌న్ను లెక్కించేట‌ప్పుడు మొత్తం ఆదాయంలో భాగంగా ఈ వ‌డ్డీ ఆదాయాన్ని క‌ల‌ప‌కుండా లెక్కిస్తారు.

Read more about: income tax it exemptions
English summary

ఈ ఆదాయాల‌పై ప‌న్ను ఉండ‌దు | What are the tax exempted Incomes in India

There are certain incomes that are exempt from income tax. If you get your income from these sources, your tax liability will be zero.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X