For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ నుంచి 'లైఫ్‌లాంగ్‌ సేవింగ్స్‌ ప్లాన్‌'

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ప్రముఖ సంస్ధ రిలయన్స్.... లైఫ్‌లాంగ్‌ సేవింగ్స్‌ ప్లాన్‌ పేరిట ఒక కొత్త ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారుల జీవితకాల లక్ష్యాలకు అనుగుణంగా పొదుపు ప్రయోజనాలతో పాటు బీమా రక్షణ కూడా కల్పించే అద్భుతమైన పథకం. పాలసీదారులకు రెండు రహాల హామీ మొత్తాలు ఇవ్వడం ఈ పాలసీ ప్రత్యేకత.

పాలసీ వ్యవధి పూర్తైన సమయంలో ఒక విడత లేదా పాలసీదారుడు మరణించిన సమయంలో రెండో విడత హామీ సొమ్మును పాలసీదారుడి కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. జీవితకాల కవరేజ్‌తో పాటు బోనస్‌ ప్రయోజనం కూడా ఈ పాలసీ ద్వారా అందించనున్నారు.

స్టాండర్డ్‌, ఎక్స్‌టెండెడ్‌ కవర్‌ పేరిట రెండు ఆప్షన్లు ఈ పాలసీ అందిస్తుంది. స్టాండర్డ్‌ ఆప్షన్‌ కింద పాలసీదారులు పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్‌ నిధుల వంటి జీవితకాల లక్ష్యాలకు ప్లాన్‌ చేసుకుంటూనే పాలసీ గడువు ముగిసే వరకు బీమా రక్షణ కూడా పొందవచ్చు.

పాలసీ మెచ్యూరిటీ సమయంలో హామీ ఇచ్చిన సొమ్ముతో పాటు అప్పటివరకు జమ అయిన బోన్‌సలు కలిపి ఒకేసారి సొమ్ము చెల్లిస్తారు. ఆరో సంవత్సరం నుంచి పాలసీ గడువు ముగిసే వరకు తేలికపాటి రివర్షనరీ బోన్‌సలతో పాటు టెర్మినల్‌ బోనస్‌ ఏదైనా ఉంటే అది కూడా ఒకేసారి ఏక మొత్తంలో చెల్లిస్తారు.

పాలసీ కాలపరిమితి ఎంత ఉండాలి, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి వ్యవధి నిర్ణయించుకునే హక్కు పాలసీదారులకు మాత్రమే ఉంటుంది. పాలసీ అమలులో ఉన్న కాలంలో ఏదైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే పాలసీపై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

దీంతో పాటు హోల్‌లైఫ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా పాలసీదారుడు మరణించే వరకు బీమా రక్షణ కొనసాగుతుంది. 7 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులందరూ ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కాలపరిమితి 15 నుంచి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.

కనీస వార్షిక ప్రీమియం రూ.12000గా నిర్ణయించారు. ఇందుకు గాను కనీస హామీ మొత్తం రూ.80000గా నిర్ణయించారు. ప్రీమియం చెల్లింపు కాలపరిమితిని ఆప్షన్‌లో 10 సంవత్సరాలు, రెగ్యులర్ ఆప్షన్‌లో 15 నుంచి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.

Reliance Life Insurance launches ‘Lifelong Savings Plan’

బీమా ప్రయోజనంతో పాటు ఈ దిగువ ఐదు రైడర్లను కూడా ఈ ప్లాన్‌ అందిస్తోంది:

* ప్రమాదాల్లో మరణం లేదా శాశ్వత అంగవైకల్యం
* 25 రకాల తీవ్ర అనారోగ్యాలు
* 10 ప్రధాన సర్జరీలు
* టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కింద అదనపు లైఫ్‌ కవరేజ్‌
* కుటుంబంలో ప్రధాన సంపాదనాపరులు మరణిస్తే ఏర్పడే ఆర్థిక నష్టం నుంచి రక్షణ చెల్లించిన ప్రీమియం

English summary

రిలయన్స్ నుంచి 'లైఫ్‌లాంగ్‌ సేవింగ్స్‌ ప్లాన్‌' | Reliance Life Insurance launches ‘Lifelong Savings Plan’

Reliance Life Insurance Company (RLIC), part of Reliance Capital Limited, today announced the launch of ‘Reliance Lifelong Savings Plan’. The plan is a non-linked, participating endowment-cum-whole life plan aimed to offer goal based saving and protection to policy holders.
Story first published: Monday, December 28, 2015, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X