For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

By Nageswara Rao
|

గతంలో యువత సంపాదించిన దాంట్లో పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ తరం యువత మాత్రం ఖర్చు ఎక్కువగా చేస్తున్నారు. కాలం చాలా మారింది. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో నివసిస్తున్న యువత విందులు, విలాసాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంట.

25 నుంచి 35 ఏళ్ల వయసు మధ్య ఉన్న యువత సంపాదిస్తున్న నెలవారీ సంపాదనలో 69 శాతం ఖర్చు చేస్తున్నట్టు ప్రైవేట్ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా ఎనిమిది నగరాల్లో నివసిస్తున్న 25 నుంచి 35 ఏళ్ల వారిపై ఈ సర్వే నిర్వహించింది.

సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

గతంలో యువత సంపాదించిన దాంట్లో పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ తరం యువత మాత్రం ఖర్చు ఎక్కువగా చేస్తున్నారు. కాలం చాలా మారింది. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో నివసిస్తున్న యువత విందులు, విలాసాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంట.

 సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

ఇలా ఖర్చు చేస్తున్న మొత్తంలో 50 శాతం కుటుంబానికి, ఇంటి అవసరాల కోసం కేటాయిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఉన్నాయి. ఇంటికి ఖర్చు చేస్తున్న దాంట్లో వారాంతాల్లో రెస్టారెంట్లు, విహార యాత్రలదే అగ్రస్థానం. సంపాదనలో ఆరోగ్య సంరక్షణకు 5 శాతం కూడా కేటాయించడం లేదు.

 సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

అయితే మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు క్లెయిమ్ గణాంకాలను విశ్లేషిస్తే తెలుస్తోందని ఐసీఐసీఐ లాంబార్డ్ పేర్కొంది. ఆరోగ్య బీమా తీసుకోనివారు పొదుపు తక్కువగాను, వైద్య అవసరాలకు ఎక్కువగాను ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో తేలినట్లు పేర్కొంది.

 సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ

కానీ సర్వేలో పాల్గొన్నవారిలో 68 శాతం మంది కాలంతో పరుగులు పెట్టే జీవన విధానం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారని ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్స్ చీఫ్ సంజయ్ దత్తా వివరించారు. ఇందులో 43 శాతం మంది కేవలం పన్ను ప్రయోజనాల కోసమే ఆరోగ్య బీమా తీసుకుంటున్నట్లు వెల్లడించడం విశేషం.

English summary

సర్వే: యువతలో పొదుపు తక్కువ, ఖర్చు ఎక్కువ | Saving and splurging: What's on young consumers' minds

Young Indians want it all but they are unsure how much is too much. Fifty-nine percent of India’s youth would like to be “rich enough” but accept that they (31%) need to be on the lookout for bargains.
Story first published: Wednesday, October 7, 2015, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X