For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటి రిటర్న్‌లు: తీసుకోవాల్సిన జాగ్రత్తలు (ఫోటోలు)

By Nageswara Rao
|

2014-15 సంవత్సరానికి గాను ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-రిటర్న్‌ల దాఖలుకు గడువు ఈరోజుతో ముగియనుంది. తప్పులు లేని ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. చాలా మంది హడావుడిగా తప్పుల తడకలతో రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు.

ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీ ఇన్‌కమ్ ట్యాక్స్‌ రిటర్న్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే రిటర్న్‌ ఫైల్‌ చేసేటపుడే కింది జాగ్రత్తలు తీసుకోండి. సాధారణంగా బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వార్షిక వడ్డీ ఆదాయం రూ. 10,000లోపు ఉంటే దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని భావిస్తుంటారు.

అయితే సేవింగ్స్ ఖాతాలోని నగదుపై వచ్చే ఆదాయానికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80టిటిఎ స్పష్టం చేస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి ఈ మినహాయింపు వర్తించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

టీడీఎస్‌

టీడీఎస్‌

టీడీఎస్ విషయంలో చాలా మందికి అవగాహాన ఉండదు. మన బ్యాంక్‌లో ఉన్న నగదులో పన్ను కోత (టిడిఎస్‌) కింద 10 శాతం పన్ను మినహాయించుకుంది. అయితే దీనిని రిటర్న్‌లోనూ చూపించాలా వద్దా సందేహంలో ఉంటుంటారు. నిజం చెప్పాలంటే రిటర్న్‌లో మీ ఆదాయం వివరాలు పూర్తిగా చెప్పాలి. మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే, రిటర్న్‌ ఫైల్‌ చేసేటపుడు మీరు చెల్లించిన టిడిఎస్‌ సైతం రీఫండ్‌ చేస్తారు.

రెండో ఇల్లు

రెండో ఇల్లు

మనలో చాలా మందికి రెండో ఇల్లు ఉంటుంది. దానిపై వచ్చే ఆదాయంపై కూడా పన్ను చెల్లించాల్సిందే. అయితే కొన్ని సార్లు ఎవరూ అద్దెకు రాకపోతే ఇల్లు ఖాళీగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇల్లు ఖాళీగా ఉన్న ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం నోషనల్‌ ఆదాయం ఆధారంగా పన్ను చెల్లించాల్సిందే. ఈ సంవత్సరం నుంచి ట్యాక్స్‌ రిటర్న్స్‌లో ఇందుకోసం ఒక ప్రత్యేక కాలమ్‌ కేటాయించారు.

రికరింగ్‌ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

రికరింగ్‌ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు చాలా మంది భార్య లేదా మైనర్ పిల్లల పేరు మీద రికరింగ్ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తెరుస్తుంటారు. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రిటర్న్స్‌లో ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇది తప్పు. పన్ను అధికారులు మాత్రం పెట్టుబడులను ఎవరి ఆదాయం నుంచి పెట్టుబడి పెట్టారో వారి ఆదాయంగానే పరిగణించి పన్ను విధిస్తుంటారు.

ఇన్‌కమ్ ట్యాక్స్ దాఖలు ఆన్‌లైనా? ఆఫ్‌లైనా?

ఇన్‌కమ్ ట్యాక్స్ దాఖలు ఆన్‌లైనా? ఆఫ్‌లైనా?

వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటినా, విదేశీ ఆస్తులున్నా, రిఫండ్‌ కోరుతున్నా ఆన్‌లైన్‌లోనే రిటర్న్‌ ఫైల్‌ చేయాలి. ఈ మూడు కేటగిరీల్లోకి రాని వ్యక్తులు ఫిజికల్‌గానే రిటర్న్‌ ఫైల్‌ చేయవచ్చు.

 విదేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు

విదేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు

ఎన్డీఏ ప్రభుత్వం నల్లధనపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి మీకు విదేశాల్లో ఏమైనా ఆస్తిపాస్తులుంటే ఆ వివరాలు స్పష్టంగా రిటర్న్స్‌లో చూపించాల్సి వస్తోంది. ఆస్తులతో పాటు విదేశీ బ్యాంకుల్లో మీకున్న ఖాతాల వివరాలు, దానిపై వచ్చిన వడ్డీ ఆదాయం, ఆ ఖాతా ఎపుడు ప్రారంభించారు? ప్రస్తుతం ఆ ఖాతా నిర్వహిస్తున్నారా? లేదా? వంటి విషయాలు సైతం తెలియజేయాల్సి ఉంది.

English summary

ఐటి రిటర్న్‌లు: తీసుకోవాల్సిన జాగ్రత్తలు (ఫోటోలు) | How To File Income Tax Returns After The Due Date?

Individuals can file their tax returns after the due date. However, one cannot file a revised return. The due to file income tax returns for the assessment year 2015-16 and Financial Year 2014-15 was August 31, 2015.
Story first published: Monday, September 7, 2015, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X