For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యులిప్‌లు పెట్టుబడి సాధనాలా? లేక భారమా?

ఐఆర్‌డిఎ తీసుకున్న నిర్ణయాలతో యులిప్‌లు ఈక్విటీ పెట్టుబడుల ద్వారా పెట్టుబడిదారుల సంపద పెంచడంతో పాటు జీవితానికి అవసరమైన బీమా రక్షణ కూడా కల్పించగలుతున్నాయి. యులిప్‌లు ఆకర్షణీయైమన పెట్టుబడి సాధనాలుగా ఎలా

By Nageshwara Rao
|

యులిప్ అంటే యూనిట్ అనుసంధాన బీమా ప్లాన్. యులిప్‌లు పెట్టుబడి సాధనాలా? లేక వాటి వ్యయాలు తలకు మించిన భారమా? తెలుసుకుందాం. ఇటీవల ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ ఐఆర్‌డిఎ తీసుకున్న చర్యలతో యులిప్‌లు ఆకర్షణీయైమన పెట్టుబడి సాధనాలుగా ఎలా మారాయి?

ఐఆర్‌డిఎ తీసుకున్న నిర్ణయాలతో యులిప్‌లు ఈక్విటీ పెట్టుబడుల ద్వారా పెట్టుబడిదారుల సంపద పెంచడంతో పాటు జీవితానికి అవసరమైన బీమా రక్షణ కూడా కల్పించగలుతున్నాయి. అయితే చిన్న పెట్టుబడిదారులు యలిప్‌ల పట్ల విముఖతను తగ్గించుకుని పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో యులిప్‌లకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఈక్విటీ మార్కెట్లలో నేరుగా పెట్టుబడి పెట్టే విషయంలో భయాందోళనలున్న వారు యులిప్‌లను చక్కని ఈక్విటీ సాధనాలుగా ఎంచుకోవచ్చు. ఏది ఏమైనా యులిప్‌ల విషయంలో పెట్టుబడిదారుల్లో కొన్ని అపోహలున్నాయి. అవేంటో చూద్దాం.

యులిప్‌లు చాలా ఖరీదా?

యులిప్‌లు చాలా ఖరీదా?

యులిప్‌లు చాలా ఖరీదని అందరూ భావిస్తుంటారు. కాని అది ఎంత మాత్రం నిజం కాదు. గతంలో యులిప్‌ల నుంచి వసూలు చేసే ప్రీమియంపై రకరకాలుగా చార్జీల వసూలు చేసేవారు. ఐఆర్‌డిఎ కొత్త నిబంధనలతో ప్రీమియం అలొకేషన్‌ చార్జీలు 20 శాతం నుంచి ఏడు శాతానికి, ఫండ్‌ నిర్వహణ చార్జీలు 2.25 శాతం నుంచి 1.35 శాతానికి తగ్గాయి.

 ఎలాంటి సమాచారం అందించే వారు కాదు

ఎలాంటి సమాచారం అందించే వారు కాదు

గతంలో యులిప్‌లలో ఏం జరుగుతున్నదన్న విషయంలో సగటు పెట్టుబడిదారుడికి ఎలాంటి సమాచారం అందేదికాదు. దీంతో యులిప్‌లు పారదర్శకం కాదనే అపోహ ఉండేది. కాని కొత్తగా నిబంధనలతో యులిప్‌లు అందించే కంపెనీలు ఎన్‌ఎవి, రాబడులకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలి. దీనికి తోడు రాబడుల్లో క్షీణతను కాలపరిమితి ఆధారంగా ఐదు సంవత్సరాలైతే నాలుగు శాతానికి, పది సంవత్సరాలైతే మూడు శాతానికి దిగకుండా చూడాలి.

 పెట్టుబడిదారుడికి స్వేచ్ఛ ఉండదు

పెట్టుబడిదారుడికి స్వేచ్ఛ ఉండదు

బీమా అనేది స్వల్పకాలిక పెట్టుబడి సాధనం కాకపోవడం వల్ల పరిస్థితులకు అనుగుణంగా ఫండ్‌ స్విచింగ్‌కు ఇన్వెస్టర్‌కు స్వేచ్ఛ ఉండదని అందరూ భావిస్తుంటారు. కాని కొత్త మార్పుల వల్ల యులిప్‌లలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎంత తరచుగా కావాలనుకుంటే అంత తరచుగా ఫండ్‌ స్విచింగ్‌కు అవకాశం ఏర్పడింది. పెట్టుబడిదారులు తమ రిస్క్‌ ఆధారంగా ఏ ఆప్షన్‌ కావాలనుకుంటే ఆ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

 మ్యూచువల్‌ ఫండ్‌‌లతో పోలిస్తే

మ్యూచువల్‌ ఫండ్‌‌లతో పోలిస్తే

చిన్న పెట్టుబడిదారులు యులిప్‌లతో పోల్చితే మ్యూచువల్‌ ఫండ్‌లే మెరుగని భావిస్తుంటారు. కాని దేని ప్రయోజనం దానికి ఉంది. స్వల్పకాలం నుంచి మధ్యకాలిక దృక్పథంలో మ్యూచువల్‌ ఫండ్‌లు మంచివే అయినా దీర్ఘకాలిక దృక్పథంలో మాత్రం యులిప్‌లే మంచి రాబడిని అందిస్తాయి. యులిప్‌లలో పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

English summary

యులిప్‌లు పెట్టుబడి సాధనాలా? లేక భారమా? | ULIP Vs Mutual Fund Which Is Better Investment?

One day I called the relationship manager of my bank. The purpose of the call was varied. The main intention was to start a SIP for long term investment. I wanted my relationship manager to suggest me few good funds. My idea was to start SIP in diversified fund or in a balanced fund.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X