For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్: ఆన్‌లైన్‌లో ఈ పాస్‌బుక్‌ని రూపొందించి, డౌన్‌లౌడ్ చేసుకోవడం ఎలా?

By Nageswara Rao
|

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను కలిగి ఉన్న ఉద్యోగులు ఆన్ లైన్‌లో ఈ పాస్ బుక్ ద్వారా బ్యాలెన్స్‌ను, లావాదేవీలను చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ పాస్ బుక్‌ను పలుమార్లు డౌన్ లౌడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఈ సర్వీసుని ఉద్యోగులు పొందాలనుకుంటే చేయాల్సిందల్లా ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌లో రిజస్టర్ చేసుకోవడమే. ఇందుకు గాను మీరు పీఎఫ్ నెంబర్, కోడ్, పే స్లిప్‌లో ఉన్న మీ పేరుతో నమోదు చేసుకోవాలి.

How to Download, Generate EPF E-Passbook Online?

ఈ పాస్‌బుక్ కోసం ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో రిజస్టర్ అవ్వడం ఎలా?

ఫోటో గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్న పాన్, ఆధార్, ఎన్‌పీఆర్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్ట్, ఓటరు ఐడీ, రేషన్ కార్డ్ లాంటి వాటితో పీఎఫ్ దారుడు మెంబర్ పోర్టల్‌లో మొబైల్ నెంబర్, పాస్ వర్డ్‌ని వినియోగించి రిజస్టర్ అవ్వొచ్చు.

1. ముందుగా ఈపీఎఫ్ఓ వైబ్ సైట్‌ను సందర్శించండి.

How to Download, Generate EPF E-Passbook Online?

2. మొబైల్, డాక్యుమెంట్ ప్రకారం పుట్టినరోజు లాంటి వివరాలను నమోదు చేయండి.
3. బాక్సులో చూపించిన పదాలను టైప్ చేయిండి.
4. పిన్ నెంబర్ కోసం క్లిక్ చేయండి.

పైన మీరు పొందుపరచిన మొబైల్ నెంబర్‌కు పిన్ నెంబర్ వస్తుంది. ఈ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

ఈ పాస్‌బుక్ రూపొందించడం, డౌన్‌లౌడ్ చేసుకోవడం ఎలా?

పూర్తి వివరాలతో లోపలికి లాగిన్ అయిన తర్వాత, మెను బార్‌లో ఈ పాస్ బుక్‌ను సెలక్ట్ చేసుకోండి.

1. స్థాపన కోడ్ ఎంచుకోండి
2. PF నెంబర్‌ని ఎంటర్ చేయండి
3. పే స్లిప్ ప్రకారం పేరు ఎంటర్ చేయండి
4. బాక్స్‌లో టెక్స్ట్‌ని టైప్ చేయండి
5. పిన్ నెంబర్ కోసం క్లిక్ చేయండి
6. మీరు పిన్ నెంబర్‌ను స్వీకరించిన తర్వాత, బాక్స్‌లో దానిని నమోదు చేయండి
7. వివరాలు కోసం క్లిక్ చేయండి.

మీ ఈ పాస్ బుక్‌ను డౌన్ లౌడ్ చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోండి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

1. ఒక మొబైల్ నెంబర్‌తో ఒకసారి మాత్రమే రిజస్టర్ అయ్యేందుకు అవకాశం ఉంది.

2. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గనుక మీ పాత పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుని విత్ డ్రా చేసుకోనట్లైతే, దానిని కొత్తగా ప్రారంభించిన పీఎఫ్ ఆకౌంట్ నెంబర్‌కి బదిలీ చేసుకోండి.

3. ఎవరైతే ఉద్యోగాలు అదే పనిగా మారుతుంటారో వారు మాత్రం పీఎఫ్ ఆకౌంట్‌ని బదిలీ చేసుకుంటే మంచింది.

English summary

పీఎఫ్: ఆన్‌లైన్‌లో ఈ పాస్‌బుక్‌ని రూపొందించి, డౌన్‌లౌడ్ చేసుకోవడం ఎలా? | How to Download, Generate EPF E-Passbook Online?

Employee Provident Fund (EPF) account holders can check the balance online through e-passbook along with previous transactions. One can even download the e-passbook multiple times if required.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X