For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలగించిన ఉద్యోగులకు జొమాటో గుడ్‌న్యూస్! అందుకే టాలెంట్ డైరెక్టరీ

|

కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా జాబ్ కోల్పోయిన తమ ఉద్యోగులకు సహకరించేందుకు ఉబెర్, ఎయిర్‌బీఎన్బీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అదే మాటలో పుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా నడుస్తోంది. అంటే తమ సంస్థల్లో ఉద్యోగం కోల్పోయిన వారికి ఉన్న టాలెంట్ ఆధారంగా ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వెతకడం. ఇందుకు జొమాటో టాలెండ్ డైరెక్టరీని ప్రారంభించింది. దీని ద్వారా కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు సహకరిస్తుంది.

సైరస్ మిస్త్రీ క్రాస్ అప్పీల్, టాటా సన్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులుసైరస్ మిస్త్రీ క్రాస్ అప్పీల్, టాటా సన్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

అందుకే టాలెండ్ డైరెక్టరీ

అందుకే టాలెండ్ డైరెక్టరీ

కరోనా కారణంగా జొమాటో 520 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కంపెనీపై తీవ్ర ప్రభావం పడిందని, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చెప్పారు. నైపుణ్యం కలిగిన వ్యక్తుల కృషి వల్ల తమ సంస్థ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. జొమాటో సంస్థలో నైపుణ్యం ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం జొమాటో టాలెంట్ డైరెక్టరీ అనే అభ్యర్థి ప్రొఫైల్ లిస్టును రూపొందించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

వివిధ నైపుణ్యాలు..

వివిధ నైపుణ్యాలు..

దీని ద్వారా అభ్యర్థులకు ఉన్న అన్ని నైపుణ్యాల్ని నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తమ సంస్థలో వివిధ విభాగాలలో పని చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగుల జాబితా కోసం [email protected]కు మెయిల్ చేయాలని సూచించారు. జొమాటో సంస్థను ఎంతో మంది అభిరుచుల ఉన్న వ్యక్తులతో ప్రారంభించామన్నారు. సంస్థ అభివృద్ధికి నిరంతరం వారు ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా వీడియో ఎడిటర్స్, డిజైనర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్స్ లాంటి వివిధ విభాగాల ప్రతిభావంత వ్యక్తుల జాబితాను చూడవచ్చునని చెప్పారు.

ఉద్యోగాల్లో కోత

ఉద్యోగాల్లో కోత

కరోనా కారణంగా ఫుడ్ పంపిణీపై భారీగా ప్రభావం పడిందని చెప్పారు. ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు కొత్త మార్కెట్లకు అనుగుణంగా అవసరమైన వస్తువులు, మద్యం పంపిణీకి కూడా ముందుకు వచ్చింది. గుర్గావ్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల వేతనాలు 50 శాతం తగ్గించింది. గత రెండు నెలల్లో ఫుడ్ ఆర్డర్లు 80 శాతానికి పైగా పడిపోయాయి. జొమాటో ప్రత్యర్థి స్విగ్గీ కూడా భారీ నష్టం నేపథ్యంలో 1100 మంది ఉద్యోగులను తొలగించింది.

English summary

తొలగించిన ఉద్యోగులకు జొమాటో గుడ్‌న్యూస్! అందుకే టాలెంట్ డైరెక్టరీ | Zomato starts Talent Directory to help its laid off employees find new job

The spree of layoffs in the startup ecosystem has paved the way for action of another kind that is now gaining momentum — facilitating the placement of laid off staff by going the extra mile.
Story first published: Sunday, May 31, 2020, 11:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X