For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ruchi Soya FPO share price: అదరగొట్టిన రామ్‌దేవ్ కంపెనీ: తొలి రోజే భారీ రిటర్న్స్

|

ముంబై: రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) అదరగొట్టింది. లాభల పంట పండించింది. అంచనాలకు మించి రాణించింది. తొలి రోజే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా సారథ్యాన్ని వహిస్తోన్న పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌లల్లో ఇదీ ఒకటి. ఎఫ్‌పీఓ జారీ అయిన సమయంలో నెగెటివ్ రిమార్క్స్‌ను చవి చూసినప్పటికీ.. లిస్టింగ్ డే నాడు వాటన్నింటినీ అధిగమించింది. తొలి రెండు గంటల్లోనే 35 శాతం రిటర్న్స్ అందించింది.

రూ.850 వద్ద ట్రేడింగ్ ఆరంభం..

రూ.850 వద్ద ట్రేడింగ్ ఆరంభం..

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెగ్మెంట్‌కు చెందిన రుచి సోయా ఈ ఉదయం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లల్లో లిస్టింగ్ అయింది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా, పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ బాలకృష్ణ.. గంట కొట్టి రుచి సోయా లిస్టింగ్‌ను ప్రారంభించారు. అనంతరం దీని ప్రైస్ దూసుకెళ్లింది. 850 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది. అనంతరం అదే ఊపును కొనసాగించింది.

ప్రైస్ బ్యాండ్

ప్రైస్ బ్యాండ్

నిజానికి రుచి సోయా ప్రైస్ బ్యాండ్ విలువ 615-650 రూపాయలు. లిస్టింగ్ నాడు 850తో ట్రేడింగ్ ఆరంభం కావడం వల్ల ఒక్కో షేర్ మీద 200 రూపాయల ఆదాయాన్ని ఇచ్చినట్టయింది. అంతకుముందే 6,61,53,846 ఈక్విటీ షేర్లకు రెండు రూపాయల మేర ఫేస్ వ్యాల్యూను పతంజలి బోర్డ్ ఆఫ్ డైెరెక్టర్స్ నిర్ధారించింది. రుచి సోయా మీద ఎలాంటి రుణ ఒత్తిళ్లు లేకపోవడం వల్లే అంచనాలకు మించిన భారీ లాభాలను అందించగలిగిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

నెగెటివ్ ఫాలో అప్స్..

నెగెటివ్ ఫాలో అప్స్..

కిందటి నెల ఈ కంపెనీ ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూను జారీ చేసిన విషయం తెలిసిందే. 4,300 కోట్ల రూపాయల మేర మొత్తాన్ని సమీకరించుకోవడానికి ఎఫ్‌పీఓను జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన రుచి సోయా ఎఫ్‌పీఓ జారీ అయింది. 28వ తేదీన ముగిసింది. మార్కెట్ వర్గాలు పెద్దగా అంచనాలను పెట్టుకోలేదు. నెగెటివ్ ట్రెండ్స్ సైతం వెలువడ్డాయి. 97 లక్షల బిడ్డింగ్స్ సైతం డ్రాప్ అయ్యాయి. ఇదో రికార్డు. అయినప్పటికీ లిస్టింగ్ డే నాడు మాత్రం ఇన్వెస్టర్లకు లాభాలను పంచిపెట్టింది.

ఈ మొత్తంతో..

ఈ మొత్తంతో..

ఆ తరువాత పరిణామాలు అనుకూలించకపోవడంతో జాప్యం ఏర్పడింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంతో రుణాలను చెల్లించడం, వర్కింగ్ కేపిటల్‌ను పెంచుకోవడం, ఇతర కార్పొరేట్ వ్యవహారాల కోసం మళ్లించుకుంటామని కంపెనీ తెలిపింది. వంటనూనెల సెగ్మెంట్‌లో రుచి సోయా వాటా భారీగా ఉండటం వల్ల మంచి అంచనాలే వ్యక్తమౌతున్నాయి. మహాకోశ్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా వంటి బ్రాండ్ల వంటనూనెలను విక్రయిస్తోందీ కంపెనీ.

English summary

Ruchi Soya FPO share price: అదరగొట్టిన రామ్‌దేవ్ కంపెనీ: తొలి రోజే భారీ రిటర్న్స్ | Yoga guru Ramdev backed Ruchi Soya FPO shares hit market; stock jumps after listing in exchanges

The FPO has opened at Rs 855 a share, with a premium of Rs 205 over the issue price. Yoga Guru Ramdev, Acharya Balkrishna and others were present at the FPO listing ceremony at the Bombay Stock Exchange.
Story first published: Friday, April 8, 2022, 13:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X