గత గురువారం యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించింది. కస్టమర్లు రూ.50,000 కంటే ఎక్కువ నగదు ఉపసంహరింంచకుండా పరిమితి విధించింది. యస్ బ్యాంకు వ్యస్థాపకుడు రానాకపూర్‌ను అరెస్ట్ చేశారు. వేల కోట్ల రూపాయల అక్రమ పెట్టుబడులు పెట్టినట్లుగా, నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ మారటోరియం నేపథ్యంలో యస్ బ్యాంకు షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. యస్ బ్యాంకు సంక్షోభానికి సంబంధించి చాలా కాలం నుండే సంకేతాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు

యస్ బ్యాంకు సంక్షోభం వార్నింగ్ సిగ్నల్స్ పట్టించుకోలేదా?
యస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం డిపాజిటర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు మునిగిపోయారు. అయితే ఎస్బీఐ, ఎల్ఐసీ ఆదుకునే పరిస్థితుల్లో రానున్న కొన్నేళ్లలో లాభపడే అవకాశాలు వేరే అంశం. యస్ బ్యాంకు నుండి వచ్చిన వివిధ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఇన్వెస్టర్లు పట్టించుకోలేదనేది నిపుణుల వాదన.

ఇది మొదటి సంకేతం...
యస్ బ్యాంకు ఎన్పీఏలను రిపోర్ట్ చేయడం ప్రారంభించింది. ఇదే మొదటి సంకేతం. అంతేకాదు ఎన్పీఏలపై ఆర్బీఐ నివేదిక ఒక రకంగా ఉంటే, కంపెనీ రిపోర్ట్ మరో రకంగా ఉంది. అప్పుడైనా ఇన్వెస్టర్లు గుర్తించాల్సిందని చెబుతున్నారు.

ఏదో జరుగుతోందని...
యస్ బ్యాంకు నివేదికలతో ఆర్బీఐ విభేదించింది. యస్ బ్యాంకు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇదీ సంకేతమే. యస్ బ్యాంకులో ఏదో జరుగుతుందని చెప్పడానికి ఇవి కీలక సంకేతాలుగా భావించవచ్చునని అంటున్నారు.

రానా కపూర్ తప్పుకున్న సమయంలో..
సీఈవోగా ఉన్న రానా కపూర్‌ను పదవి నుండి తప్పుకోమని చెప్పినప్పుడైనా సంక్షోభంలో ఉందని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. కానీ కొత్త సీఈవో వచ్చినప్పుడు యస్ బ్యాంకుపై ఆశలు చిగురించాయి.

లోగో పట్ల ఆకర్షితుడై రూ.1.2 బిలియన్ డాలర్లు..
కేవలం యస్ బ్యాంకుకు చెందిన లోగోను ఇష్టపడి 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేద్దామని ఓ ఇన్వెస్టర్ రావడం, దీనిని యస్ బ్యాంకు రిజక్ట్ చేయడం.. సీరియస్‌నెస్ కనిపించడం లేదనేందుకు సంకేతాలు అంటున్నారు. అంటే నిధుల సేకరణపై సీరియస్‌నెస్ లేదనేందుకు ఇది నిదర్శనం అంటున్నారు. లోగోను ఇష్టపడి అంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తానంటే ఎందుకు పరిగణలోకి తీసుకోలేదనేది ప్రశ్నే.

ప్రభుత్వం హామీ ఇచ్చాక కూడా.. మనిషి స్వభావం..
రిటైల్ ఇన్వెస్టర్లు పట్టించుకోని ఎన్నో సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పెద్ద కుదుపు వచ్చినా మళ్లీ కుదురుకుంటుందని ఎక్కువమంది ఆశలు పెట్టుకుంటారు. మనిషి స్వభావం ఎక్కువగా ఇదే. అంతెందుకు.. యస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డిపాజిటర్లకు నష్టం లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఇన్నాళ్లుగా వచ్చిన సంకేతాలను పక్కన పెట్టి ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద మనీ విత్ డ్రా చేసుకోవడానికి వరుస కడుతున్నారు.

ఇన్వెస్టర్లు, డిపాజిటర్లకు ఊరట
యస్ బ్యాంకును ఆదుకునేందుకు ఎస్బీఐ, ఎల్ఐసీ ముందుకు వస్తున్నాయనే వాదనలు ఉన్నాయి. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై చర్చలు మాత్రమే సాగుతున్నాయి. అయితే ఈ బ్యాంకును ఎస్బీఐ ఆదుకుంటుందనే సంకేతాలు ఇన్వెస్టర్లు, డిపాజిటర్లకు ఊరట కలిగిస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications