For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6.50 లక్షల వాహనాల విక్రయం లక్ష్యం, యమహా కొత్త మోడల్స్ ధరలివే

|

యమహా మోటార్ ఇండియా వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో 6.50 లక్షల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2025 నాటికి తన మార్కెట్ వాటాను మూడింతలకు పైగా పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 2019 సంవత్సరంలో 6.24 లక్షల వాహనాలను విక్రయించినట్టు కంపెనీ సీనియర్‌ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటెజీ, ప్లానింగ్) రవీందర్ సింగ్ తెలిపారు.

స్కూటర్ల కేటగిరీలో తన ఉనికిని మరింతగా పెంచుకునే లక్ష్యంతో Fascino 120FI, RayZR 125FI, Street Rally 125FIలను ఆవిష్కరించింది. వీటితో కంపెనీ 125CC విభాగంలోకి ప్రవేశించింది. ఈ విభాగంలో ప్రస్తుతం హోండా యాక్టివా 125CC, టీవీఎస్‌ ఎన్‌టార్క్య్‌, సుజుకీ యాక్సెస్‌ 125 ఉన్నాయి. యమహా 12CC విభాగంలోని Fascino 120FI ధర రూ.66.430 నుంచి రూ.67,430 (ఎక్స్ షోరూం)గా ఉంది. మిగతా మోడల్స్ ధరలో త్వరలో తెలియజేయనుంది.

బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..

Yamaha Motor India eyes to sell 6.50 lakh units in 2020

స్కూటర్లతో పాటు BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న మోటార్ సైకిల్స్ MT15, R15లను కూడా ఆవిష్కరించింది. ఇ టీవలే BS6 ప్ర మాణాలతో ఉన్న 150CC FZ-S ఆవిష్కరించింది. R15 ధర రూ.1.45 లక్షల నుంచి రూ.1.47 లక్షల మధ్య ఉంది. MT15 ధరను వెల్లడించాల్సి ఉంది. 110CC మోడల్స్‌ను క్రమంగా తగ్గించుకుంటామని, భవిష్యత్తులో 125CC మోడల్స్ మాత్రమే విక్రయిస్తామని తెలిపింది.

English summary

6.50 లక్షల వాహనాల విక్రయం లక్ష్యం, యమహా కొత్త మోడల్స్ ధరలివే | Yamaha Motor India eyes to sell 6.50 lakh units in 2020

Two wheeler manufacturer Yamaha Motor India is eyeing to sell 6.50 lakh units in the domestic market in 2020 and has set a target of doubling its market share by 2025, a top official said here on Thursday.
Story first published: Friday, December 20, 2019, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X