For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహా మాంద్యం తర్వాత తీవ్ర ఆర్థికమాంద్యంలో ప్రపంచం: వరల్డ్ బ్యాంకు

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో 1930లో మాంద్యం తర్వాత మరోసారి ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంకు ఆధ్యక్షులు డేవిడ్ మాల్‌పాస్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, పేద దేశాలకు ఇది భారీ విపత్తు అని పేర్కొన్నారు. ఆర్థిక సంకోచం నేపథ్యంలో రుణ సంక్షోభాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలను పురస్కరించుకొని మల్పాస్ మీడియాతో మాట్లాడారు. చాలా లోతైన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిందని, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు ఇది భారీగా దెబ్బతీస్తుందన్నారు.

ఇన్ఫోసిస్‌పై H1B వీసా కొత్త రూల్స్ ప్రభావం ఉంటుందా.. అంటే?ఇన్ఫోసిస్‌పై H1B వీసా కొత్త రూల్స్ ప్రభావం ఉంటుందా.. అంటే?

మహా సంక్షోభం తర్వాత భారీ సంక్షోభం

మహా సంక్షోభం తర్వాత భారీ సంక్షోభం

మహా సంక్షోభం అనంతరం ఇది భారీ సంక్షోభమని మాల్‌పాస్ అన్నారు. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకు, పేద దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఆయా దేశాలకు భారీ వృద్ధి కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు రూపొందిస్తోందని తెలిపారు. వ్యాక్సీన్‌లను సమకూర్చుకోలేని దేశాలకు వ్యాక్సీన్‌లు, మందుల సరఫరా కోసం 12 బిలియన్ డాలర్ల హెల్త్ ఎమర్జెన్సీ కార్యక్రమాల విస్తరణకు ప్రపంచ బ్యాంకు బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది.

ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు..

ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు..

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు సహకరిస్తున్నారన్నారు. అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సోషల్ సెక్యూరిటీ స్కీంలతో ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయన్నారు. పేద దేశాల్లో ప్రజలకు అదనపు సామాజిక భద్రత కలిగించే దిశగా ప్రపంచ బ్యాంకు కసరత్తు చేస్తోందన్నారు. వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంపై పని చేస్తున్నామన్నారు.

కే షేప్ రికవరీ

కే షేప్ రికవరీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కే షేప్ రికవరీలో ఉందని మాల్‌పాస్ అన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా, ఆర్థిక మార్కెట్ల ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నాయన్నారు. అనధికారిక ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని, సామాజిక స్కీంలపై ఆధారపడ్డారన్నారు. తమ మొదటి ప్రాధాన్యత ప్రాణాల్ని కాపాడటమన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

English summary

మహా మాంద్యం తర్వాత తీవ్ర ఆర్థికమాంద్యంలో ప్రపంచం: వరల్డ్ బ్యాంకు | World experiencing one of the deepest recessions: World Bank

The world is experiencing one of the deepest recessions since the Great Depression in the 1930s owing to the novel coronavirus, World Bank President David Malpass has said, terming the COVID-19 pandemic a “catastrophic event” for many developing and the poorest countries.
Story first published: Thursday, October 15, 2020, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X