For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో కార్యకలాపాలపై హార్లే డేవిడ్‌సన్ కీలక ప్రకటన, హీరోతో కొత్త బిజినెస్ మోడల్

|

అమెరికా లగ్జరీ మోటార్ సైకిల్స్ దిగ్గజం హార్లే డేవిడ్‌సన్ ఇష్టపడేవారికి శుభవార్త. దేశంలో ప్రీమియం బైక్స్ విక్రయం మొదలు పెట్టిన దశాబ్దం తర్వాత తన అమ్మకాలు, మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సెప్టెంబర్ నెలలో ప్రకటించిన తర్వాత భాగస్వామి కోసం ప్రయత్నాలు చేసింది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. దేశీయంగా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. జనవరి 2021 నుంచి అమ్మకాలు, విడిభాగాలు, సర్వీసులు సహా అన్ని సేవల్ని ఎప్పటిలాగే అందించనున్నట్లు తెలిపింది. కొత్త బిజినెస్ మోడల్‌ను ప్రకటించింది.

హీరో మోటో కార్ప్‌తో...

హీరో మోటో కార్ప్‌తో...

డిసెంబర్ నాటికి భారత మార్కెట్ల నుంచి వైదొలగనున్నట్లు హార్లే డేవిడ్‌సన్ సెప్టెంబర్ చివరి వారంలో ప్రకటించింది. దేశీయంగా తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు వ్యాపారాలు కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు అమెరికాకు చెందిన టూవీలర్ దిగ్గజం భారత మార్కెట్లో హీరో మోటో కార్ప్‌తో కలిసి ముందుకు సాగుతుంది. సేల్స్, సర్వీసెస్‌లో ఈ రెండు సంస్థలకు మధ్య ఒప్పందం కుదిరింది. హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ విక్రయాలు, సర్వీసింగ్ బాధ్యతలను హీరో మోటో కార్ప్ నిర్వహిస్తుంది.

హీరో మోటో కార్ప్ ఒప్పందం

హీరో మోటో కార్ప్ ఒప్పందం

అంతేకాకుండా విడిభాగాలు, కంపెనీ సంబంధ యాక్సెసరీస్, దుస్తులు తదితరాల అమ్మకాలను చేపట్టనుంది. హీరో మోటో కార్ప్‌తో ఒప్పందం ప్రకారం కొత్త మోడల్స్‌ను కూడా ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు హీరో, హార్లే డేవిడ్‌సన్‌కు గల డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను రెండు కంపెనీలు వినియోగించుకోనున్నాయి. ప్రస్తుత డీలర్ నెట్ వర్క్ డిసెంబర్ 31, 2020 వరకు కొనసాగుతుందని తెలిపింది. 2021 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చే కొత్త డీలర్ నెట్ వర్క్, సర్వీసెస్ సెంటర్ వివరాలు ఈ ఏడాది చివరి నాటికి వెల్లడిస్తారు.

కొత్త బిజినెస్ మోడల్

కొత్త బిజినెస్ మోడల్

ప్రస్తుతం దేశీయంగా మార్కెట్లకు సంబంధించిన బిజినెస్ మోడల్‌ను సవరించుకున్నట్లు హార్లే డేవిడ్‌సన్ తెలిపింది. ఇందులో భాగంగా హీరో మోటో కార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హార్లే డేవిడ్సన్ ఇండియా, వర్ధమాన మార్కెట్ల ఎండీ సంజీవ్ రాజశేఖరన్ అన్నారు. కాగా, హార్లే డేవిడ్‌సన్‌కు 33 ప్రత్యేక డీలర్‌షిప్స్ ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కార్యకలాపాల నిలిపివేత నిర్ణయించుకున్న నేపథ్యంలో డీలర్లకు చెల్లించనున్న నష్టపరిహారం మరీ తక్కువగా ఉందని పలువురు డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

English summary

ఇండియాలో కార్యకలాపాలపై హార్లే డేవిడ్‌సన్ కీలక ప్రకటన, హీరోతో కొత్త బిజినెస్ మోడల్ | Working with new partner Hero to ensure smooth transition: Harley Davidson

American cult-bike maker Harley-Davidson on Saturday said it is working with its new partner Hero MotoCorp to "ensure a smooth transition" for its customers in India, including after-sale services and warranty.
Story first published: Sunday, November 22, 2020, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X