For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ఫ్రమ్ హోంతో చిక్కులెన్నో, నిద్రిస్తున్నట్లుగా: సత్య నాదెళ్ల

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) కారణంగా టెక్ కంపెనీలు వివిధ రకాలుగా లాభపడ్డాయి. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ లాభపడింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిపై ఈ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాభాలు ఉన్నప్పటికీ ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నదన్నారు. ఉద్యోగులు ఇబ్బందులు పడతారన్నారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ భేటీలో మాట్లాడారు. వర్క్ ఫ్రమ్ వల్ల ఇబ్బందులను ఏకరవు పెట్టారు.

డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటన.. మైక్రోసాఫ్ట్, FB, గూగుల్ సహా కుప్పకూలిన స్టాక్స్డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటన.. మైక్రోసాఫ్ట్, FB, గూగుల్ సహా కుప్పకూలిన స్టాక్స్

WFH నిద్రపోయినట్లుగా... అలసిపోతారు..

WFH నిద్రపోయినట్లుగా... అలసిపోతారు..

ఆన్‌లైన్ మీటింగ్స్ వల్ల ఉద్యోగులు అలసిపోతారని, పని వాతావరణం నుంచి ప్రయివేటు లైఫ్‌కు మారడంలో ఇబ్బందులు ఎదురవుతాయని సత్య నాదెళ్ల అన్నారు. వర్క్ ఫ్రమ్ వల్ల ఇంటి వద్దనే పని చేస్తోన్న సమయంలో కొన్ని సందర్భాల్లో పనిచేస్తూ నిద్రిస్తున్నట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వీడియో సమావేశాలు ఉదయం ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ, మీ మొదటి వీడియో సమావేశానికి అరగంట కేటాయించడంతో అప్పటికే అలసిపోయే అవకాశం ఉందన్నారు. ఉదయాన్నే మీటింగ్‌కు ఏకాగ్రత అవసరం కాబట్టి ఉద్యోగులు అలసిపోతారన్నారు.

ఉద్యోగులు ఆఫీస్ ప్రయోజనాలు కోల్పోతున్నారు

ఉద్యోగులు ఆఫీస్ ప్రయోజనాలు కోల్పోతున్నారు

రిమోట్ వర్కింగ్ వల్ల ఆఫీస్ ప్రయోజనాల్ని కూడా ఉద్యోగులు నష్టపోతున్నారని సత్య నాదెళ్ల అన్నారు. వీడియో సమావేశాలు లాంఛనంగా మారాయన్నారు. ఈ సమావేశాలకు ముందు, తర్వాత వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనిని పరిష్కరించేందుకు మైక్రోసాఫ్ట్ వద్ద కొత్త ప్లాన్ ఉందన్నారు. ఆఫీస్ వాతావరణాన్ని పునఃసృష్టించేందుకు, ఆడిటోరియం, సమావేశ గది, కాఫీ బార్ వంటి వర్చువల్ ప్రదేశంలో వీడియో కాల్స్‌లో పాల్గొనేలా చేస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల క్లౌడ్ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది ఇప్పటికి 30 శాతం ఎగిశాయి.

రిమోట్ జాయినింగ్స్ వల్ల

రిమోట్ జాయినింగ్స్ వల్ల

పని, వ్యక్తిగత కార్యకలాపాల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలనేది కరోనా తనకు నేర్పించిందని సత్య నాదెళ్ల అన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా కొత్త నియామకాలు వర్చువల్‌గా జరుగుతున్నాయని గుర్తు చేశారు. కొత్త ఉద్యోగులు రిమోట్‌‍గా చేరుతున్నారని, దీంతో శిక్షణ, నైపుణ్య సముపార్జన, నైపుణ్యాలు కీలక అంశాలుగా లేదా సమస్యలుగా మారాయన్నారు.

English summary

వర్క్ ఫ్రమ్ హోంతో చిక్కులెన్నో, నిద్రిస్తున్నట్లుగా: సత్య నాదెళ్ల | Working from home can feel like sleeping at work: Satya Nadella

Microsoft Corp. has been a major beneficiary of the work-from-home boom spurred by the Covid-19 pandemic. But Chief Executive Officer Satya Nadella is realizing the pitfalls of being away from the office for so long.
Story first published: Wednesday, October 7, 2020, 18:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X