For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Work From Home: ట్రాయ్ శుభవార్త: ఆ కనెక్షన్‌పై ప్రతినెలా రూ.200 బెనిఫిట్

|

న్యూఢిల్లీ: ఏడాదిన్నర కాలంగా దేశాన్ని పట్టి పీడిస్తోంది ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి. గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. తొలి దఫా కంటే సెకెండ్ వేవ్ భారత్‌ను దారుణంగా దెబ్బకొడుతోంది. తొలిసారి సుదీర్ఘకాలం పాటు సాగిన లాక్‌డౌన్ తరహా పరిస్థితులు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అడ్డుకోగలిగినప్పటికీ..సెకెండ్ వేవ్‌ను మాత్రం అదుపులోకి రావట్లేదు. దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్‌డౌన్ విధించకపోవడం దీనికి ఓ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు తలకిందలవుతాయనే కారణంతో- కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది.

అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే..

అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే..

లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్ల ఏడాదిన్నర కాలంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. సుదీర్ఘకాలం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)లో ఉంటోన్నారు. ఇంట్లో నుంచే పనిచేస్తోన్నారు. ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా..దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. న్యాయస్థానాలు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజువారీ విచారణలను నిర్వహిస్తోన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఇదే విధానాన్ని అనుసరిస్తోన్నాయి. పరిపాలన కుంటుపడకుండా వీడియో కాన్ఫరెన్స్‌లతో రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తోన్నాయి.

 ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కోసం..

ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కోసం..

ఈ తరహా పరిస్థితులు ఇంకా ఎన్నిరోజులు ఉంటాయో తెలియదు. ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొనసాగుతుందనేది తేలట్లేదు. ఈ పరిణామాల మధ్య ల్యాండ్‌లైన్ కనెక్షన్లను పెంచుకోవడంపై ట్రాయ్ (TRAI) దృష్టి సారించింది. ల్యాండ్‌లైన్ బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లకు ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది. ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న వారికి నేరుగా ప్రతినెలా 200 రూపాయల ప్రోత్సాహం అందేలా ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌దారులకు నేరుగా బెనిఫిట్ కలిగేలా చర్యలు తీసుకోనుంది.

 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల మీద లోడ్

మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల మీద లోడ్

వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత.. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లపై ఒత్తిడి అధికమైంది. రోజూ వేలాది జీబీల డేటా వినియోగమౌతోంది. ఫలితంగా వాటి సర్వర్ల మీద భారం పడుతోంది. దీన్ని నివారించడానికి ల్యాండ్‌లైన్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లను ప్రోత్సహించాలని ట్రాయ్ నిర్ణయించింది. దేశంలో 75 కోట్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 73 కోట్లకు పైగా కనెక్షన్లు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల మీదే ఆధారపడి ఉన్నాయి. ఇందులో ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ వాటా చాలా తక్కువ. 2.26 కనెక్షన్లు మాత్రమే ఉంటోన్నాయి. ఈ సంఖ్యను పెంచడానికి ట్రాయ్ ప్రత్యేకంగా ఓ కన్సల్టేషన్ పేపర్‌ను జారీ చేసింది.

 జూన్ 10 నాటికి రిపోర్ట్..

జూన్ 10 నాటికి రిపోర్ట్..

ల్యాండ్‌లైన్ వినియోగదారులపై ప్రతినెలా 200 రూపాయల మేర సబ్సిడీ ఇవ్వడానికి.. లేక అంతే మొత్తంలో టెలికమ్ కంపెనీల లైసెన్స్ ఫీజులను మాఫీ చేయడానికి అవకాశం ఉందా? అనే విషయంపై సమగ్ర నివేదిక అందజేయాలని ట్రాయ్ సూచించింది. ఈ విషయంలో టెలికమ్ కంపెనీల లైసెన్స్ ఫీజులను మాఫీ చేస్తే..దాన్ని ఆయా కంపెనీలు దురుపయోగం చేస్తాయని ట్రాయ్ అభిప్రాయపడింది కూడా. అందుకే నేరుగా ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌దారులకు లబ్ది కలిగించేలా ప్రతినెలా 200 రూపాయల సబ్సిడీ లభించేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై ఓ నివేదిక అందజేయాలని కోరింది. వచ్చేనెల 10వ తేదీ నాటికి ఈ రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది.

English summary

Work From Home: ట్రాయ్ శుభవార్త: ఆ కనెక్షన్‌పై ప్రతినెలా రూ.200 బెనిఫిట్ | Work From Home: TRAI is seeking incentives to increase fixed-line broadband connections

The Telecom Regulatory Authority of India (TRAI) is exploring incentives it can provide to increase fixed-line broadband connections in the country including exempting internet service providers from license fees and giving customers direct cash benefits.
Story first published: Saturday, May 22, 2021, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X