For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు ... ఆఫీసులకు రండి ... ఎక్కడంటే !!

|

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కరోనా కట్టడి కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఇంకా అమలు చేస్తుంటే సౌదీ అరేబియా మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఇంటివద్ద నుండి పని చేసింది చాలు, ఇక ఆఫీసులకు రండి అంటూ ఉద్యోగులకు సూచించింది. ఉద్యోగులు ఈ నెలాఖరు వరకు వర్క్ ఫ్రం హోం ఆపేయాలని, ఆఫీసుకు వచ్చి పని చేయడం మొదలు పెట్టాలని సూచించింది సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ.

పీఎన్ బీ స్కామ్ ... నీరవ్ మోడీ భార్య అమీ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులుపీఎన్ బీ స్కామ్ ... నీరవ్ మోడీ భార్య అమీ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు

ఇళ్ళ నుండి ఎక్కువ కాలం వర్క్ చెయ్యటం మంచిది కాదన్న మంత్రి

ఇళ్ళ నుండి ఎక్కువ కాలం వర్క్ చెయ్యటం మంచిది కాదన్న మంత్రి

కరోనా వ్యాప్తి నేపధ్యంలో సౌదీ అరేబియా లోనూ కొన్ని నెలలుగా ఉద్యోగులు ఇళ్ల నుండి పని చేస్తున్నారు. కరోనా వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గనప్పటికీ ,కేసులు నమోదు అవుతున్నప్పటికీ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కు గుడ్ బై చెప్పి , అందరూ ఆఫీసులకు బయలుదేరండి అంటూ సూచించింది. ఇళ్ల నుండి ఎక్కువ కాలం పాటు వర్క్ చేయడం మంచిది కాదని మానవ వనరుల శాఖ మంత్రి ఆల్ రజీ స్పష్టం చేశారు .

ఆఫీసులలోనూ కరోనా నియంత్రణా చర్యలు

ఆఫీసులలోనూ కరోనా నియంత్రణా చర్యలు

ఇప్పటికే అన్ని విభాగాలకు ఈ సర్క్యులర్స్ ను జారీ చేసి అందరూ ఆఫీసులకు వచ్చి పని చేయాలని, తాము చేసిన సూచనలు అమలయ్యేలా చూడాలని విభాగాధిపతులను ఆదేశించారు. అంతేకాదు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా, ఆఫీసులలోనూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆఫీసులలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం వేలిముద్రలతో లాగిన్ అయ్యే విధానాన్ని నిలిపివేశారు. ఒక్కసారిగా అందరూ ఉద్యోగులు ఆఫీస్ కు రావలసిన అవసరం లేదని , ఎవరి అవసరం అయితే ఎక్కువగా ఉంటుందో వారి లిస్టులను తయారు చేసి తదనుగుణంగా వారిని మాత్రమే పిలిపించి పని చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

 25 శాతాన్ని మించి ఏ సంస్థలోని ఉద్యోగులు ఇంటి నుండి పని చేసే అవసరం లేదు

25 శాతాన్ని మించి ఏ సంస్థలోని ఉద్యోగులు ఇంటి నుండి పని చేసే అవసరం లేదు

25 శాతాన్ని మించి ఏ సంస్థలోని ఉద్యోగులు ఇంటి నుండి పని చేసే అవసరం లేదంటూ సర్క్యులర్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం సూచించిన నియమాలను పాటిస్తూ, ఆఫీసులో పని చేసుకోవాలని సౌదీ అరేబియా మానవ వనరుల శాఖా మంత్రి పేర్కొన్నారు. ఒకపక్క ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహిస్తుంటే సౌదీ అరేబియా మాత్రం ఆఫీసులకు వచ్చి పని చెయ్యాల్సిందే అంటుంది. ఇక ఇండియాలోనూ ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానమే అమలయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

English summary

వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు ... ఆఫీసులకు రండి ... ఎక్కడంటే !! | Work from home is enough come to offices.. Saudi Arabia HR ministry issued circular

The Saudi Ministry of Human Resources has taken a key decision. Decided that working from home was no longer necessary. It suggested that employees should stop working from home and start working from the office by the end of this month. No work from home from August 30.
Story first published: Wednesday, August 26, 2020, 18:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X