For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 ఏళ్లలో భారతీయ మహిళలు సృష్టించే ఉద్యోగాలు 17 కోట్లు

|

భారత్‌లో 2030 నాటికి మహిళా పారిశ్రామికవేత్తలు 15 కోట్ల నుండి 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఉద్యోగ వయస్సు ఉన్న మొత్తం జనాభాలో 25 శాతానికి పైగా కొత్త ఉద్యోగాలు మహిళలే సృష్టిస్తారని ఈ నివేదిక తెలిపింది. భారత్‌లోని మొత్తం సంస్థల్లో దాదాపు 20 శాతం సంస్థలు మహిళల ఆధీనంలో ఉన్నాయని, అంటే దాదాపు 1.35 నుండి 1.57 కోట్ల సంస్థల వరకు ఉన్నాయి.

అసలు విషయం చెప్పిన నిర్మల: ఆదాయపు పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపుఅసలు విషయం చెప్పిన నిర్మల: ఆదాయపు పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపు

వర్కింగ్ ఏజ్ వుమెన్

వర్కింగ్ ఏజ్ వుమెన్

'వుమెన్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్ ఇండియా - పవరింగ్ ది ఎకానమీ విత్ హర్' పేరుతో ఈ నివేదికను రూపొందించారు. ప్రస్తుతం వర్కింగ్ ఏజ్‌లోని 43 కోట్ల మందికి పైగా మహిళల్లో దాదాపు 34 కోట్లమందికి పైగా ఎలాంటి పని చేయడం లేదు. వారికి వేతనాలు రావడం లేదు. ఇంటికి పరిమితం కావడం కావొచ్చు లేదా మరొకటి కావొచ్చు. ఇందులో 32 కోట్ల మందికి పైగా లేబర్ ఫోర్స్‌లో లేరు. దాదాపు 2 కోట్ల మంది లేబర్ ఫోర్స్‌లో ఉన్నారు. కానీ వారు వేతనాలు వచ్చే ఉద్యోగులు కాదు.

మహిళల ద్వారా నడిచే సంస్థలు పెరిగాయి

మహిళల ద్వారా నడిచే సంస్థలు పెరిగాయి

గత దశాబ్దకాలంగా మహిళలు రన్ చేస్తోన్న ఎంటర్‌ప్రైజెస్ 14 శాతం నుండి 20 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మహిళలు రన్ చేస్తున్న ఎక్కువ ఎంటర్‌ప్రైజెస్‌లలో సింగిల్ రన్ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి.

తక్కువ రిటర్న్స్, తక్కువ ఉద్యోగాలు

తక్కువ రిటర్న్స్, తక్కువ ఉద్యోగాలు

మహిళల నేతృత్వంలో నడిచేవి తక్కువ రిటర్న్స్, తక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా మాత్రమే ఉన్నాయి. అన్ని సంస్థల్లో సరాసరిన 28 శాతం వర్క్ ఫోర్స్ ఉంటే మహిళల నేతృత్వంలో నడిచే సంస్థల్లో కేవలం 17 శాతం ఉద్యోగాలు మాత్రమే ఉంటున్నాయి.

మహిళలు స్వయంగా నిర్వహించట్లేదు

మహిళలు స్వయంగా నిర్వహించట్లేదు

మరో విషయం ఏమంటే మహిళల పేరుతో ఉన్న దాదాపు 10 నుండి 30 శాతం కంపెనీలను స్వయంగా మహిళలు మాత్రమే నిర్వహించడం లేదు. అన్ని ప్రభుత్వాలు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష ఉపాధిని 5 కోట్ల నుండి ఆరు కోట్లకు పెంచవచ్చునని, 2030 నాటికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ఉద్యోగాలు 10 కోట్ల నుండి 11 కోట్లకు చేరుకుంటుందని ఈ సర్వేలో తేలింది.

వివిధ దేశాల్లో మహిళా లేబర్ ఫోర్స్

వివిధ దేశాల్లో మహిళా లేబర్ ఫోర్స్

2018 జాబితా ప్రకారం వుమెన్ వర్క్ ఫోర్స్‌లో భారత్ కింది ర్యాంకులో ఉంది. 15 నుండి 64 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు... యూకేలో 73, రష్యాలో 69, చైనాలో 69, అమెరికాలో 67, ఘనాలో 65, బ్రెజిల్‌లో 61, ఇండోనేషియాలో 54, పిలిప్పైన్స్‌లో 48, శ్రీలంకలో 38, బంగ్లాదేశ్‌లో 38, ఈజిప్ట్‌లో 25, పాకిస్తాన్‌లో 25, ఇండియాలో 25, ఇరాన్‌లో 18, జోర్డాన్‌లో 15 మంది లేబర్ ఫోర్స్‌లో ఉన్నారు.

English summary

10 ఏళ్లలో భారతీయ మహిళలు సృష్టించే ఉద్యోగాలు 17 కోట్లు | Women in business can generate 170 mn jobs in India by 2030

Women in entrepreneurship can generate 150–170 million jobs in India, which is more than 25 per cent of the new jobs required for the entire working-age population by 2030, according to a joint report by Bain & Company and Google.
Story first published: Wednesday, February 19, 2020, 18:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X