For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SEBI: సెబీ ప్రకటనతో స్టాక్ బ్రోకరేజ్ ఫీజులను పెంచే అవకాశం.. ఎందుకంటే..?

|

SEBI: దేశంలోని స్టాక్ మార్కెట్ల పనితీరు, పెట్టుబడిదారుల రక్షణకు సంబంధించిన విషయాలను సెబీ చూసుకుంటుంది. ఇందులో భాగంగా సెబీ తాజాగా కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. వీటి అమలు వల్ల ఇన్వెస్టర్లు బ్రోకరేజ్ ఛార్జీలు పెరిగవచ్చని జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ వెల్లడించారు.

భద్రత కోసం..

పెట్టుబడిదారుల భద్రతను పెంచే పనిలో భాగంగా కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం బ్రోకరేజ్ సంస్థలు తమ డీమ్యాట్ ఖాతాలో వినియోగించని మొత్తాన్ని కస్టమర్‌ల బ్యాంకు ఖాతాకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించాయి.

కంపెనీలకు కష్టాలు..

కంపెనీలకు కష్టాలు..

దీని కారణంగా కంపెనీలకు ఖర్చులతో పాటు ఆపరేటింగ్ రిస్క్ పెరుగుతుందని నితిన్ కామత్ అన్నారు. దీనివల్ల ఆదాయంపై ప్రభావం పడుతుందని అన్నారు. ఇదే సమయంలో కంపెనీలు రోజువారీ వర్కింగ్ క్యాపిటల్ కోసం మరింత సొమ్మును సమీకరించుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు.

మొదటి శుక్రవారం..

మొదటి శుక్రవారం..

తాజా నిబంధనల ప్రకారం బ్రోకరేజ్ కంపెనీలు.. ప్రతి నెల మొదటి శుక్రవారం లేదా ప్రతి త్రైమాసికంలో మొదటి శుక్రవారం ఇన్వెస్టర్ల అకౌంట్లో మిగిలిన బ్యాలెన్స్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు ఎంపికల్లో ఏది కావాలనే విషయాన్ని కస్టమర్లే ఎంచుకోవచ్చని సెబీ వెల్లడించింది. ట్రేడింగ్ ఖాతాల్లోని నిధులు సురక్షితంగా ఉన్నాయని ఇది నిర్ధారిస్తుంది. అయితే.. నిబంధన కస్టమర్ భద్రతకు మంచివే అయినప్పటికీ.. ఫలితంగా బ్రోకరేజ్ రేట్లపై ఒత్తిడి పెరుగుతుందని కామత్ చెప్పారు.

Read more about: sebi zerodha demat business news
English summary

SEBI: సెబీ ప్రకటనతో స్టాక్ బ్రోకరేజ్ ఫీజులను పెంచే అవకాశం.. ఎందుకంటే..? | with sebi latest demat rules brokerages may raise charges soon nithin kamath says

with sebi latest dematt rules brokerages may raise charges soon nithin kamath says
Story first published: Friday, October 7, 2022, 16:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X