For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI ప్రపంచ రికార్డ్: మన వెనుకే యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌కు అందనంత ఎత్తులో...

|

భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) సరికొత్త రికార్డ్ సృష్టించింది. ట్విట్టర్‌లో ఆర్బీఐకి 10 లక్షలమంది ఫాలోవర్లు దాటారు. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులకు దేనికీ ఈ రికార్డు లేదు. పది లక్షలకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నది కేవలం ఆర్బీఐకే. ప్రపంచ దిగ్గజ బ్యాంకులు యూఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కంటే ఆర్బీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. అగ్రరాజ్యాలతో పోలిస్తే ఆర్బీఐ ట్విట్టర్ ఖాతాను ఆలస్యంగా తెరిచింది. అయినప్పటికీ వాటి కంటే ముందే 10 లక్షల (1 మిలియన్) ఫాలోవర్లను దాటింది.

Moratorium, వారికి ప్రయోజనం అవసరం లేదు: క్రెడిట్ కార్డు కస్టమర్లకు సుప్రీంకోర్టు షాక్Moratorium, వారికి ప్రయోజనం అవసరం లేదు: క్రెడిట్ కార్డు కస్టమర్లకు సుప్రీంకోర్టు షాక్

10 లక్షలకు పైగా...

10 లక్షలకు పైగా...

యూఎస్ ఫెడ్ రిజర్వ్ 2009 మార్చిలో ట్విట్టర్ అకౌంటును తెరిచింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(UBC) 2009 అక్టోబర్ నెలలో ఈ సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేసింది. RBI 2012 జనవరిలో ఖాతాను తెరిచింది. సోమవారం ఉదయం (నవంబర్ 23, 2020) నాటికి ఆర్బీఐకి ఉన్న 1,009,838 మంది ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు లక్షా పదివేలు. యూఎస్ ఫెడ్ రిజర్వ్‌కు ఉన్న ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 6.77 లక్షలు. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సహోద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇక, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ను 1.35 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

రెండేళ్లలోనే జంప్

రెండేళ్లలోనే జంప్

ఆర్బీఐ ట్విట్ట‌ర్‌ ఖాతాని అనుసరించేవారు ప్రారంభంలో తక్కువగా ఉండేవారు. మార్చి 2019 నుంచి మార్చి 2020 మధ్య ఏడాది కాలంలో అనుసరించేవారి సంఖ్య 3.42 లక్షల నుంచి 7.50 లక్షలకు చేరింది. అంటే రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. మార్చి 25 లాక్ డౌన్ తర్వాత ఈ ఆర్బీఐ ట్విట్టర్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య ఏకంగా 1.5 లక్షలకు పైగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షల మంది కొత్తగా ఈ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. రెండు నెలల క్రితం అంటే గత సెప్టెంబర్ 27వ తేదీ నాటికి 9.66 లక్షలుగా ఉంది. ఆదివారం (నవంబర్ 22) నాటికి 10 లక్షల మైలురాయిని దాటింది. ట్విట్టర్ ఖాతాలోకి ఆలస్యంగా వచ్చిన ఆర్బీఐ 85 ఏళ్లుగా సేవలు అందిస్తోంది.

రెండో స్థానంలో మెక్సికో.. బ్యాంక్ ఆఫ్ జపాన్ 29వేలే

రెండో స్థానంలో మెక్సికో.. బ్యాంక్ ఆఫ్ జపాన్ 29వేలే

1 మిలియన్ ఫాలోవర్లతో ఆర్బీఐ మొదటి స్థానంలో ఉండగా, బ్యాంక్ ఆఫ్ మెక్సికో (బ్యాంకో దే మెక్సికో) 7.74 లక్షల ఫాలోవర్లతో రెండో స్థానంలో, బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా 7.57 లక్షల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉంది. ప్రపంచ పవర్ ఫుల్ సెంట్రల్ బ్యాంకు యూఎస్ ఫెడ్ 6.77 లక్షలతో నాలుగో స్థానంలో, ఫ్రాంక్రఫ్ట్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకు 5.91 లక్షల మంది ఫాలోవర్లతో 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బ్రెజిల్ (3.82 లక్షలు) 6వ స్థానం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (3.17 లక్షలు) 7వ స్థానం, బ్యాంక్ ఆఫ్ కెనడా (1.80 లక్షలు) 8వ స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (1.16 లక్షలు) 9వ స్థానం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా (49వేలు) 10వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో మూడో పవర్‌‌ఫుల్ మానిటరీ అథారిటీ అయిన బ్యాంక్ ఆఫ్ జపాన్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 29వేల లోపే.

English summary

RBI ప్రపంచ రికార్డ్: మన వెనుకే యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌కు అందనంత ఎత్తులో... | With over 1 million followers on Twitter, RBI creates a world record

The achievement is impressive as the 85-year-old Reserve Bank was also a latecomer to the world of Twitter as it created the account only in January 2012.
Story first published: Monday, November 23, 2020, 10:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X