For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ ఘనత, ప్రపంచ 44వ కంపెనీగా రిలయన్స్

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 200 బిలియన్ డాలర్లతో ఈ ఈ రికార్డ్ అందుకున్న తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. దాదాపు రూ.15 లక్షలకోట్ల సమీపానికి చేరుకుంది. గత మూడు నాలుగేళ్ల కాలంలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో రిలయన్స్ షేర్ ధర కరోనా -లాక్ డౌన్ దెబ్బతో రూ.1000 లోపుకు పడిపోయింది. ఇప్పుడు రూ.2300 పైన ఉంది. అంటే ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ ఎంక్యాప్ రెండింతల కంటే ఎక్కువగా పెరిగింది. దీనికి ప్రధానం కారణం రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోకి వస్తున్నాయి.

ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో 44వ స్థానం

ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో 44వ స్థానం

వరుస పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.70 లక్షల కోట్లు దాటి, రూ.15 లక్షలకోట్ల దిశగా సాగుతోంది. ఈ నెల 10వ తేదీన 200 బిలియన్ డాలర్ల ఎం-క్యాప్‌తో రిలయన్స్ దేశంలో ఈ రికార్డ్ సాధించిన తొలి సంస్థగా నిలవడంతో పాటు వ్యాల్యూపరంగా ప్రపంచంలో 44వ స్థానంలో నిలిచింది. అమెరికా కంపెనీ సిల్వర్ లేక్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కేకేఆర్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అమెజాన్ కూడా రిలయన్స్ రిటైల్‌లో 40 శాతం వాటాను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీసీఎస్, HDFC కంటే ఎక్కువ

టీసీఎస్, HDFC కంటే ఎక్కువ

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 10లో రిలయన్స్ మొదటిస్థానంలో ఉంటుంది. రెండో స్థానంలో టీసీఎస్ ఉంటుంది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,75,000 కోట్లకు పైగా ఉంది. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.6,00,000 కోట్లకు పైగా ఉంది. ఈ రెండు సంస్థల మార్కెట్ క్యాప్ కంటే ఇఫ్పుడు రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉంది. 2020 మార్చిలో రిలయన్స్ షేర్ ధర ఓ సమయంలో రూ.867కు పడిపోయింది. అప్పటి నుండి 170 శాతం పెరిగింది. రిలయన్స్ షేర్ ధర ఈ వారంలోని 5 సెషన్‌లలో రూ.225 పాయింట్లకు పైగా పెరిగింది.

ప్రపంచంలో టాప్ 10 కంపెనీలు

ప్రపంచంలో టాప్ 10 కంపెనీలు

మార్కెట్ క్యాప్ పరంగా ఆపిల్ 2,006.47 బిలియన్ డాలర్లతో ఆపిల్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత సౌదీ అరేబియా 1,909 బిలియన్ డాలర్లు, అమెజాన్ 1,637 డాలర్లు, మైక్రోసాఫ్ట్ 1,599 డాలర్లు, అల్పాబెట్ 1,055 డాలర్లు, ఫేస్‌బుక్ 779 డాలర్లు, అలీబాబా గ్రూప్ 739 డాలర్లు, టెన్సెంట్ హోల్డింగ్స్ 625 డాలర్లు, బెర్క్‌షైర్ హాత్‌వే 525 డాలర్లు, వీసా ఇంక్ 435 డాలర్లతో టాప్ 10లో ఉన్నాయి. రిలయన్స్ 44వ స్థానంలో ఉంది.

English summary

ముఖేష్ అంబానీ ఘనత, ప్రపంచ 44వ కంపెనీగా రిలయన్స్ | With a $200 billion m cap, RIL 44th biggest firm globally

Mukesh Ambani owned Reliance Industries became the first Indian company to surpass market capitalisation of $200 billion on September 10. The oil to retail to telecom conglomerate now ranks 44th in terms of valuations globally.
Story first published: Friday, September 11, 2020, 18:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X