For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విప్రో చేతికి యూకే కంపెనీ క్యాప్‌కో, ఐటీ దిగ్గజానికి ఇదే అతిపెద్ద డీల్

|

ఐటీ దిగ్గజం విప్రో యూకేకు చెందిన గ్లోబల్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ కన్సల్టెన్సీ క్యాప్‌కోను కొనుగోలు చేయనుంది. విప్రో కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద డీల్ కానుంది. క్యాప్‌కో కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్లు ఈ దేశీయ దిగ్గజం తెలిపింది. క్యాప్‌కోను సొంతం చేసుకునేందుకు 1.45 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. మన కరెన్సీలో దాదాపు రూ.10,500 కోట్లు. క్యాప్‌కో కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగంలో కన్సల్టింగ్, ఐటీ సర్వీసులు అందించడంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు విప్రో తెలిపింది.

NPS నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు: ఎంత, ఎలా, ఎన్నిసార్లు?NPS నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు: ఎంత, ఎలా, ఎన్నిసార్లు?

బిజినెస్ లీడర్లతో కలిసి వర్క్

బిజినెస్ లీడర్లతో కలిసి వర్క్

ఈ విభాగంలోని అంతర్జాతీయ క్లయింట్స్‌కు పటిష్టమైన, సమర్ధవంత కన్సల్టింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులను అందించనున్నట్లు విప్రో తెలిపింది. కంపెనీకి గల వ్యూహాత్మక డిజైన్, డొమైన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, క్లౌడ్ తదితర సేవలకు క్యాప్‌కోకు ఉన్న కన్సల్టింగ్ సమర్ధత జత కలవనున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ చెల్లింపులు, క్యాపిటల్ మార్కెట్లు, బీమా తదితర విభాగాల్లో మరింత మెరుగైన సేవలకు వీలున్నట్లు తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక సేవల రంగంలోని పలు ప్రముఖ కంపెనీలకు క్యాప్‌కో సేవలు అందిస్తోంది. క్యాప్‌కో ఇరవై ఏళ్లుగా బిజినెస్‌ లీడర్లతో పని చేస్తోంది.

జూన్ 30 నాటికి ఒప్పందం పూర్తి

జూన్ 30 నాటికి ఒప్పందం పూర్తి

క్యాప్‌కో సంస్థకు అనుభవం కలిగిన ఉన్నత ఉద్యోగులతో పాటు 5,000కు పైగా బిజినెస్, టెక్నాలజీ కన్సల్టెంట్లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా 30ి పైగా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి క్యాప్‌కో కొనుగోలు ఒప్పందం పూర్తి కావొచ్చునని విప్రో భావిస్తోంది.

లండన్ కేంద్రంగా

లండన్ కేంద్రంగా

క్యాప్‌కో 1998లో ఏర్పాటయింది. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా క్లయింట్స్‌ను కలిగి ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌కు దీర్ఘకాలంగా సేవలు అందిస్తోంది. లండన్ కేంద్రంగా 16 దేశాల్లో 30 ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2020లో 72 కోట్ల డాలర్ల ఆదాయం సాధించింది.

English summary

విప్రో చేతికి యూకే కంపెనీ క్యాప్‌కో, ఐటీ దిగ్గజానికి ఇదే అతిపెద్ద డీల్ | Wipro to acquire UK based Capco for $1.45 billion

Wipro Ltd. is paying $1.45 billion to acquire Capco, a British IT consultancy, in its boldest bet yet as the fourth largest Indian software exporter seeks to keep pace with its fast-growing peers in the country’s $147 billion IT outsourcing industry.
Story first published: Friday, March 5, 2021, 8:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X